రెహమాన్‌కు అరుదైన గౌరవం | AR Rahman appointed BAFTA Breakthrough India ambassador | Sakshi
Sakshi News home page

రెహమాన్‌కు అరుదైన గౌరవం

Published Tue, Dec 1 2020 12:57 AM | Last Updated on Tue, Dec 1 2020 1:34 AM

AR Rahman appointed BAFTA Breakthrough India ambassador - Sakshi

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహమాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ‘బ్రిటీష్‌ అకాడమీ ఆఫ్‌ ఫిలిమ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌ (బాఫ్టా)’∙సంస్థ ఈ అరుదైన గుర్తింపును రెహమాన్‌కి అందించింది. ‘ఇండియన్‌ బ్రేక్‌ త్రూ ఇన్షియేటివ్‌ అంబాసిడర్‌’గా ఆయన్ని నియమించినట్లు ఆ సంస్థ తెలిపింది. బాఫ్టా రాయబారిగా రెహమాన్‌ ఇకపై నెట్‌ఫ్లిక్స్‌తో కలసి భారతదేశంలోని ప్రతిభావంతులైన కళాకారులను గుర్తించాల్సి ఉంటుంది.

దీనిపై రెహమాన్‌ స్పందిస్తూ – ‘‘సినిమాలు, కళలు, క్రీడలు, టీవీ రంగాల్లో ప్రతిభావంతులను గుర్తించడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. భారత్‌లోని అద్భుతమైన ప్రతిభావంతులను ప్రపంచ వేదికపై నిలబెట్టడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. బాఫ్టాతో కలసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది’’ అన్నారు. బాఫ్టాకు రెహమాన్‌ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అమండా బెర్రీ తెలిపారు. కాగా ప్రతి ఏటా ఈ సంస్థ ప్రదానం చేసే అవార్డులకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement