Bafta
-
రెహమాన్‌కు అరుదైన గౌరవం
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ‘బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిలిమ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాఫ్టా)’∙సంస్థ ఈ అరుదైన గుర్తింపును రెహమాన్‌కి అందించింది. ‘ఇండియన్ బ్రేక్ త్రూ ఇన్షియేటివ్ అంబాసిడర్’గా ఆయన్ని నియమించినట్లు ఆ సంస్థ తెలిపింది. బాఫ్టా రాయబారిగా రెహమాన్ ఇకపై నెట్‌ఫ్లిక్స్‌తో కలసి భారతదేశంలోని ప్రతిభావంతులైన కళాకారులను గుర్తించాల్సి ఉంటుంది. దీనిపై రెహమాన్ స్పందిస్తూ – ‘‘సినిమాలు, కళలు, క్రీడలు, టీవీ రంగాల్లో ప్రతిభావంతులను గుర్తించడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. భారత్‌లోని అద్భుతమైన ప్రతిభావంతులను ప్రపంచ వేదికపై నిలబెట్టడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. బాఫ్టాతో కలసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది’’ అన్నారు. బాఫ్టాకు రెహమాన్ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమండా బెర్రీ తెలిపారు. కాగా ప్రతి ఏటా ఈ సంస్థ ప్రదానం చేసే అవార్డులకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. -
ఏఆర్ రెహమాన్‌కు అరుదైన గౌరవం
ఆస్కార్ అవార్డు విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయన్ని అస్కార్ అవార్డుతో సమామైన అవార్డులను ప్రదానం చేసే బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స(బాఫ్టా) సంస్థ ఇండియన్ బ్రేక్ త్రూ ఇనిషియేటివ్ అంబాసిడర్‌గా నియమించినట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. బాఫ్టా.. నెట్‌ఫ్లిక్స్ సహకారంతో భారత్‌లో ఉన్న గొప్ప కాళాకారులను గుర్తించడానికి ఏర్‌ఆర్ రెహమాన్‌ను అంబాసిడర్‌గా ఎంపిక చేసింది. ఐదు రంగాల్లో ప్రత్యేకమైన ప్రతిభ కనబరిచిన వారిని బాఫ్టా గుర్తించనుంది. తన ఎంపికపై ఏఆర్ రెహమాన్ స్పందింస్తూ.. ‘ నాకు చాలా సంతోషంగా ఉంది. బాఫ్టాతో పని చేస్తూ సినిమాలు, ఆటలు, టీవీ రంగాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచే వారిని గుర్తించడం కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాను’ అని తెలిపారు. చదవండి: ఆది పురుష్‌కి రెహమాన్? ప్రతిభ ఉన్న ఆర్టిస్టులను బాఫ్టా గుర్తించటం ఓ ప్రత్యేకమైన అవకాశం అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను గుర్తించి, సంబంధాలు పెంచడంతో పాటు బాఫ్టా అవార్డు విజేతలు, నామినేషన్ దక్కించుకున్న వాళ్లకు మెంటర్‌గా ఉంటానని పేర్కొన్నారు. ఇక భారత్‌లో అద్భుతమైన టాలెంట్ కలిగి ఉన్న ఆర్టిస్టులను ప్రపంచవేదికపై నిలబెట్టడానికి ఆత్రుతగా ఎదురు చూసున్నానని తెలిపారు. యూకేలో బాఫ్టా బ్రేక్ త్రూ ఆర్టిస్టులను 2013 నుంచి గుర్తిస్తోంది. అదేవిధంగా 2019 నుంచి చైనాలో ఉన్న కొత్త ప్రతిభను ప్రపంచానికి తెలియజేస్తోంది. ఇక భారత్‌లో ఉన్న కొత్త టాలెంట్‌ను గుర్తించడానికి బాఫ్టా అడుగులు వేస్తోంది. చదవండి: ఇప్పుడు చెప్పాల్సిన కథ ఇది ఏఆర్ రెహమాన్ బాఫ్టా అంబాసిడర్‌గా తమకు మద్దతుగా నిలిచినందుకు ఆనందంగా ఉందని బాఫ్టా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమండా బెర్రీ అన్నారు. అదే విధంగా కొత్త ప్రతిభను గుర్తించడం, పెంపొందించడంలో తమ అభిరుచులకు అనుకూలంగా ఉన్నారని తెలిపారు. హిందీ, తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలతో అనుబంధం ఉన్న రెహమాన్ సేవలు బాఫ్టాకు ఎంతగానో ఉయయోగపడతాయని పేర్కొన్నారు. బ్రేక్ త్రూ ఇండియా ఆర్టిస్టులను ఎంపిక చేయడం కోసం జ్యూరీ, న్యాయ నిర్ణేతలను నియామించాల్సి ఉందని బాఫ్టా పేర్కొంది. -
ఆయనతో నైటౌట్.. ప్రియుడితో బ్రేకప్!
లాస్ఏంజిల్స్: ప్రముఖ ఎం టీవీ ప్రజెంటర్ లారా వైట్మోర్- రాక్ సింగర్ రోరీ విలయమ్స్ ప్రణయబంధానికి బీటలు పడ్డాయి. బాఫ్టా అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా లియోనార్డో డికాప్రియోతో లారా నైటౌట్ చేయడం.. ఈ ప్రేమికుల మధ్య చిచ్చు రేపింది. రోరీ నుంచి లారా విడిపోయింది. గత నెలలో లండన్‌లోని రాయల్ ఓపెరా హైజ్‌లో జరిగిన బాఫ్టా వేడుకల సందర్భంగా 'రెవెనంట్' స్టార్ లియో, లారా సన్నిహితంగా కనిపించారు. చెట్టాపట్టాలేసుకొని ఫొటోలకు పోజులిచ్చారు. ఈ సాన్నిహిత్యమే లారా-రోరీ బ్రేకప్ కు దారితీసింది. లారా (30) గత ఏడాది వేసవి నుంచే తనకంటే ఏడాది చిన్నవాడైన రోరీతో డేటింగ్ చేస్తోంది. వీళ్ల ప్రణయబంధం పెళ్లిపీటల వరకు వెళుతుందని భావించారు. ఇటీవల బోయ్ఫ్రెండ్ను ఈ అమ్మడు తన కుటుంబసభ్యులకు కూడా పరిచయం చేసింది. ఈ క్రమంలో బాఫ్టా వేడుకల్లో లియో-లారా కలిసి తిరుగడమే వీరి బంధానికి బ్రేక్ వేసింది. అయితే తాను లియోతో స్నేహంగా మాత్రమే గడిపానని, అంతకుమించి ఎలాంటిది జరుగలేదని లారా చెప్తోంది. లారాతో తాను విడిపోలేదని, ప్రస్తుతం తన మ్యూజిక్ కెరీర్‌పైనే దృష్టిపెట్టానని రాక్ సింగర్ రోరీ తెలిపాడు. లియో ఎపిసోడ్ వీరి బ్రేకప్‌కు దారితీసిందని సన్నిహితులు చెప్తున్నారు. -
ఆ ముద్దు హల్చల్ చేస్తోంది!
లండన్: 'టైటానిక్' హీరో లియోనార్డ్ డికాప్రియో అవార్డు ఫంక్షన్లలో ఏం చేసినా అది వైరల్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల వేడుకలో ఆయనను పాప్ సింగర్ లేడీ గాగా విరుసుగా తోసుకొనిపోవడం.. అది చూసి లియోనార్డ్ బిత్తరపోవడం తెలిసిందే. ఆ వీడియో అప్పట్లో ఆన్లైన్లో బాగానే హల్చల్ చేసింది. ఈసారి బాఫ్టా అవార్డుల వేడుక ఈ వైరల్‌కు వేదిక అయింది. ప్రేమికుల రోజు సందర్భంగా తొలిసారి ఈ వేడుకలో 'కిస్ క్యామ్'ను ప్రవేశపెట్టారు. అయితే, ఊహించినట్టు ప్రేమికులుగా భావిస్తున్న మైఖేల్ ఫాస్బెండర్, అలిషియా వికాండర్ మాత్రం ఈ 'కిస్ క్యామ్' ఫోకస్ అయిన సందర్భంగా ముద్దు పెట్టుకోలేదు. ఇది అందరినీ ఒకింత నిరాశపరిచింది. అయితే ఈ లోటును డికాప్రియో చాలా తెలివిగా పూడ్చాడు. 81 ఏళ్ల డామ్ మ్యాగీని, 41 ఏళ్ల లియోనార్డోని ఒకేఫ్రేములో ఈ కెమెరా ఫిక్స్ చేయగానే.. ఊహించనిరీతిలో లియోనార్డో ముందుకొచ్చి మ్యాగీని ఆత్మీయంగా ముద్దాడారు. 'హ్యారీపోటర్' సినిమాలో కీలక పాత్రలో నటించిన మ్యాగీ కూడా ఈ కిస్‌ను ఆత్మీయంగా స్వీకరించారు. ఇది ఊహించినట్టే ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. 'కిస్ క్యామ్'ను ఫాస్బెండర్, వికండర్ జోడీ మాత్రమే నిరాశపరిచింది. బ్రయాన్ క్రాంస్టన్-జూలియన్ మూర్, రెబెల్ విల్సన్-ఎడ్డీ ఇజార్డ్ జంటలు ఈ క్యామ్‌లో చుంబనాలతో ఆహూతులను అలరించాయి. బాఫ్టా అవార్డుల వేడుకలో లియోనార్డో డికాప్రియో హీరోగా నటించిన 'రెవెనంట్' మరోసారి దుమ్మురేపింది. ఈ సినిమాను ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం అవార్డులు వరించాయి. Maggie Smith and Leonardo DiCaprio on the BAFTA Kiss Cam pic.twitter.com/A6TuSIdksx — Leo DiCaprio News (@NewsDiCaprio) February 14, 2016 -
అవార్డులు మీ తెల్లవాళ్లకేనా?
లండన్: హాలీవుడ్ చిత్రపరిశ్రమలో తెల్లజాతీయులు, పురుషుల ఆధిపత్యమే సర్వత్రా రాజ్యమేలుతుండటం ఇప్పుడు పెద్ద వివాదమే రేపుతోంది. హాలీవుడ్లో భిన్నత్వమే లేకపోవడం, నల్లజాతీయులకు, మహిళలకు తగినంత ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై ఇప్పుడు నిరసన వ్యక్తమవుతోంది. అవార్డుల ప్రదానోత్సవంలోనూ ఈ వివక్ష కొట్టొచ్చినట్టు కనబడుతుండటంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హాలీవుడ్‌లోని ఈ వివక్షను వ్యతిరేకిస్తూ క్రియేటివ్ ఆఫ్ కలర్ నెట్వర్క్ గ్రూప్ అనే హక్కుల సంస్థ.. బాఫ్టా అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ నిరసన ప్రదర్శనకు 'ఎలియన్ 3' నటుడు లియోన్ హెర్బర్ట్ నేతృత్వం వహించారు. ఈ నిరసనలో పాల్గొన్న ఉద్యమకారులు నలుపు, తెలుపు దుస్తులు ధరించి.. 'లైట్, యాక్షన్, డైవర్సిటీ' అంటూ నినాదాలు చేశారు. బాఫ్టా మాస్కులతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు. లండన్‌లోని రాయల్ ఓపెరా హౌస్ బయట ఈ నిరసన ప్రదర్శన ప్రశాంతంగా జరిగింది. హాలీవుడ్ సినిమా/టీవీ పరిశ్రమలో అందరికీ అవకాశాల కల్పన, భిన్నత్వం లేకపోవడం పట్ల 1990 నుంచి ఉద్యమం జరుగుతున్నా.. ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదని, బాఫ్టా అవార్డుల నామినేషన్ల విషయంలోనూ నల్లజాతి కళాకారులకు అన్యాయమే జరిగిందని, ఏదో నామమాత్రంగా వారికి నామినేషన్లు ప్రకటించారని ఉద్యమకారులు తమ ఫేస్బుక్ పేజీలో పేర్కొన్నారు.