Aashiqui
-
తొలి సినిమాతో స్టార్డమ్.. బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిపాలు.. మాట పడిపోవడంతో!
ఫస్ట్ సినిమాకే హిట్ అందుకుంటే ఆ కిక్కే వేరు! అలాంటిది 22 ఏళ్ల వయసులో తొలి చిత్రంతోనే అసాధారణ విజయాన్ని అందుకున్నాడు బాలీవుడ్ హీరో రాహుల్ రాయ్. అతడు హీరోగా నటించిన ఆషిఖి సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోవడంతో నిర్మాతలు అతడి ఇంటి ముందు క్యూ కట్టారు. వెంటనే అనేక సినిమాలకు సంతకం చేసుకుంటూ పోయాడు. కానీ వివిధ కారణాల రీత్యా పలు చిత్రాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఏవో ఒకటో, రెండో కాదు ఏకంగా పది సినిమాలు అటకెక్కాయి. పెళ్లి- విడాకులు దీంతో నిరాశ చెందిన రాహుల్ తర్వాత ఓపక్క హీరోగా నటిస్తూనే సపోర్టింగ్ రోల్స్ కూడా చేశాడు. 2006లో అతడు బిగ్‌బాస్ షోలో పాల్గొని టైటిల్ విజేతగానూ అవతరించాడు. రాహుల్ రాయ్ ప్రొడక్షన్స్ పేరిట నిర్మాణ సంస్థను స్థాపించి సినిమాలు కూడా రిలీజ్ చేశాడు. మధ్యలో 2000వ సంవత్సరంలో మోడల్ రాజలక్ష్మి ఖాన్వికర్(రాణి)ని పెళ్లాడిన అతడు 2014లో ఆమెకు విడాకులిచ్చాడు. కొంతకాలం క్రితం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో తీవ్ర అనారోగ్యానికి లోనైన రాహుల్ ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాడు. తాజాగా అతడు తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తొలి సినిమా పారితోషికం ఎంతంటే? 'డైరెక్టర్ మహేశ్ భట్‌ను కలిసిన నాలుగైదు నిమిషాల్లోనే మనం సినిమా చేస్తున్నాం అన్నాడు. అలా ఆషిఖి చేశాం. ఈ చిత్రంతో నాకెంతో గుర్తింపు వచ్చింది. ఆషిఖి సినిమాకు గానూ నాకు రూ.30,000 పారితోషికం ఇచ్చారు. థియేటర్లో ఆషిఖి చూస్తున్న ప్రేక్షకులు పాటలు రాగానే పైసల కాయిన్లు విసురుతూ సందడి చేశారు. ప్రేక్షకుల స్పందన చూసి సంతోషమేసింది. కానీ ఈ సినిమా రిలీజైన ఆరు నెలల వరకు నాకు ఒక్కటంటే ఒక్క సినిమా ఆఫర్ కూడా రాలేదు. ఆ తర్వాత మాత్రం ఉన్నట్లుండి బోలెడన్ని అవకాశాలు వచ్చాయి. కేవలం 11 రోజుల్లోనే 47 సినిమాలకు సంతకం చేశాను. దర్శకుడికి కృతజ్ఞతగా.. అతడి వల్లే నా కెరీర్ గొప్పగా ఆరంభమైంది. కాబట్టి తనకు కృతజ్ఞతగా ఏదైనా ఇవ్వాలనుకునేవాడిని. మహేశ్ భట్ పుస్తకప్రియుడు. అందుకే తరచూ పుస్తకాలు బహుమతిగా ఇస్తూ ఉండేవాడిని' అని చెప్పుకొచ్చాడు. మహేశ్ భట్ ద్వారా పరిచయమైన అనుపమ్ ఖేర్ కూడా తన జీతంలో నుంచి కొంత భాగం దర్శకుడికి పుస్తకాలు కొనేందుకే వెచ్చిస్తాడు. ఇకపోతే రాహుల్ రాయ్ 2020 నవంబర్‌లో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యాడు. ఈ సమయంలో ఆయన మాట పడిపోయింది. నెమ్మదిగా బ్రెయిన్ స్ట్రోక్ నుంచి కోలుకుంటున్న అతడు ఇప్పుడిప్పుడే మామూలుగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాడు. చదవండి: నిమిషానికే రెండు లక్షలు.. అల్లు అర్హ పారితోషికం మొత్తంగా ఎంతంటే? సౌందర్య చనిపోలేదు, ఆ రూపంలో బతికే ఉంది -
'ఆషిఖి' నటుడికి బ్రెయిన్ స్ట్రోక్
'ఎల్ఏసీ' సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్న బాలీవుడ్ నటుడు రాహుల్ రాయ్‌కు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. కార్గిల్‌లో ఉన్న వాతావరణం కారణంగా ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో వెంటనే షూటింగ్ నిలిపివేసి రెండు రోజుల క్రితం ముంబైకి వచ్చారు. ఈ విషయాన్ని రాహుల్ రాయ్ సోదరుడు రోమీర్ సేన్ ఆలస్యంగా మీడియాకు తెలిపారు. రాహుల్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నాడని, అయితే ఎవరూ భయపడాల్సిన పని లేదని పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారని చెప్పారు. కోవిడ్ పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చిందన్నారు. (చదవండి: రియాలిటీ షో: వారిద్దరూ కలిసుండటం లేదా!) రాహుల్ రాయ్.. 'ఆషిఖి' సినిమాతో 22 ఏళ్లకే బాలీవుడ్లో తెరంగ్రేటం చేశారు. మొదటి సినిమాతోనే మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. తర్వాత పలు సినిమాల్లో తన ప్రతిభ చూపించారు. 2006లో హిందీ బిగ్‌బాస్ మొదటి సీజన్ టైటిల్‌ను సైతం ఆయన కైవసం చేసుకున్నారు. పలు టీవీ షోలలోనూ ప్రత్యేక అతిథిగా కనిపించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన 'ఎల్ఏసీ- లైవ్ ద బాటిల్ ఇన్ కార్గిల్' సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. (చదవండి: 26/11 విషాదం.. ‘మీ జ్ఞాపకాలే నా బలం’) -
'బంగారమే' 'జాను'గా వస్తోంది.. ట్రైలర్ చూస్తారా?
సరిగ్గా మూడేళ్ల కిందట 'ఆషికీ-2'తో ప్రేక్షకులను ప్రేమలోకంలో ముంచెత్తిన జోడీ ఆదిత్యరాయ్ కపూర్, శ్రద్ధా కపూర్. గతంలో ప్రగాఢమైన ప్రేమకథతో అలరించిన ఈ జోడీ ఇప్పుడు 'ఓకే జాను' అంటూ హిందీ ప్రేక్షకులను పలుకరించబోతున్నది. సహజీవనం, ఆధునిక యువత మనోభావాలకు అద్దం పడుతూ ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన 'ఓకే బంగారం' (తమిళంలో 'ఓకే కణ్మని') సినిమాకు ఇది రీమేక్. దక్షిణాది భాషల్లో దుల్కర్ సల్మాన్, నిత్య మీనన్ జోడీ మంచి కెమిస్ట్రీతో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఆదిత్య-శ్రద్ధ పెయిర్ కూడా ఇదే ప్రేమకథతో అభిమానుల మనస్సు దోచుకునేందుకు సిద్ధమవుతోంది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం, గుల్జార్ సాహిత్యంతో మణిరత్నం, కరణ్ జోహార్ నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'ఓకే జాను' ట్రైలర్ తాజాగా ఆన్లైన్ విడుదలైంది. దక్షిణాది 'ఓకే బంగారం' కన్నా కాస్తా ఘాటు ఎక్కువైనట్టు కనిపిస్తున్న 'ఓకే జాను' ట్రైలర్ నెటిజన్లను ఉర్రుతలూగిస్తోంది. మీరు ఓ లుక్ వేయండి. -
ఆషికీ: ప్రేమకథకు పాతికేళ్లు...
ఆల్‌టైమ్ హిట్ ‘ఆషికి’ ఎందరి జీవితాలను నిలబెట్టిందో చెప్పలేము. అందులో హీరోగా నటించిన రాహుల్ రాయ్, హీరోయిన్గా నటించిన అనూ అగర్వాల్, సంగీతం అందించిన నదీమ్-శ్రావణ్, పాడిన కుమార్ షానూ వీళ్లందరూ రాత్రికి రాత్రి సూపర్‌స్టార్స్ అయ్యారు. ఈ సినిమాను నిర్మించిన గుల్షన్ కుమార్‌కు ఈ సినిమా తెచ్చి పెట్టిన సంపద సామాన్యమైనది కాదు. కేవలం లక్ష రూపాయల ఖర్చుతో తయారైన పాటలు ఆ రోజుల్లో అతడికి కోట్లు సంపాదించి పెట్టాయి. ఇప్పటికీ సంపాదించి పెడుతున్నాయి. చరిత్రలో ఒక సినిమా తన సంగీతంతో ఎంత సంపాదించవచ్చు అనడానికి ఇంతకు మించిన ఉదాహరణ లేదు. గుల్షన్ కుమార్ టి- సిరీస్ ద్వారా ఆడియో క్యాసెట్ల రంగంలో సంచలనం సృష్టించడంతో పాటు కొత్త గొంతులను పరిచయం చేయడంలో కూడా ముందుండేవాడు. పాత పాటలను రీమిక్స్ చేసి సొంత ఆల్బమ్స్ తయారు చేసి విడుదల చేసుకోవచ్చు అని ఎప్పుడైతే తెలిసిందో రఫీ, కిశోర్, ముఖేష్ వంటి గొంతులను పోలినవారిని వెతకడం మొదలుపెట్టాడు గుల్షన్ కుమార్. ఆ వెతుకులాటలో భాగంగా కలకత్తాకు చెందిన కుమార్ షాను దొరికాడు. నదీమ్-శ్రావణ్‌లతో కొన్ని బాణీలు చేయించి గీతకారుడు సలీమ్ చేత పాటలు రాయించి కుమార్ షాను గొంతులో రికార్డు చేయించి ఒక కొత్త ఆల్బమ్ విడుదల చేయాలని గుల్షన్‌కుమార్ ఆలోచన. అయితే అప్పుడే దర్శకుడు మహేష్ భట్ ఆ పాటలు విని ఈ పాటల ఆధారంగా ఒక సినిమా తీస్తాను అని ఆషికి తీశాడు. ఇందుకు పూర్తిగా కొత్త ముఖాలనే ఎంచుకున్నాడు. రాహుల్ రాయ్, అనూ అగర్వాల్, దీపక్ తిజోరి వంటి కొత్తవాళ్లతో వచ్చినా సరే కథాబలం, పాటల బలం, హీరో హీరోయిన్ల ప్రెజెన్స్ సినిమాను సూపర్ హిట్ చేశాయి. బాగా డబ్బున్న కుర్రాడైన రాహుల్ రాయ్ అనాథ అయిన అనూ అగర్వాల్ ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకోవడం కథ. ఈ సీదాసాదా కథను మంచి మంచి పాటలతో నింపి చెప్పడం వల్ల కథనం ఆసక్తికరంగా మారింది. ఇందులోని ప్రతీ పాటా హిట్టే. జానే జిగర్ జానెమన్ మై దునియా భులాదూంగా నజర్కే సామ్నే జిగర్ కే పాస్ తూ మేరీ జిందగీ హై బస్ ఏక్ సనమ్ చాహియే ఆషికీ కే లియే... 1990 ఆగస్టు మూడోవారంలో రిలీజైన సినిమా దేశమంతా దుమారం రేపింది. ప్రతి ఇంటా ప్రతి బండిలో ఆఖరికి ప్రతి లారీలో కూడా ఇవే పాటలు వినిపించేవి. ఇందులో పాడిన అనురాధా పౌడ్వాల్ ఆ రోజుల్లో లతా మంగేష్కర్‌కు గట్టి పోటీగా నిలిచింది. అయితే ఈ సినిమా వల్ల లబ్ధి పొందిన వారు ఆ తర్వాత జీవితంలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. నదీమ్-శ్రావణ్లలో నదీమ్ హత్యకు గురయ్యాడు. గుల్షన్ కుమార్ కూడా హత్యకు గురయ్యాడు. అనూ అగర్వాల్ పెద్ద కార్ యాక్సిడెంట్‌కు లోనయ్యి ముఖం అంద వికారంగా మారడంతో సినిమాలకే దూరమయ్యింది. తనకు వెన్నుదన్నుగా నిలిచిన గుల్షన్ కుమార్ మరణం వల్ల అనురాధా పౌడ్వాల్ కెరీర్లో వెనుకబడింది. రాహుల్ రాయ్ ఒకటి రెండు సినిమాల్లో మెరిసినా తర్వాత రాణించలేకపోయాడు. అయినప్పటికీ ‘ఆషికి’ ఒక గొప్ప ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదలయ్యి 25 ఏళ్లు నిండిన సందర్భంగా గుల్షన్ కుమార్‌కు నివాళిగా ఈ సినిమాలోని ‘ధీరే ధీరే సే’ పాటను పాప్ గాయకుడు హనీ సింగ్ చేత రీమిక్స్ చేసి హృతిక్ రోషన్, సోనమ్ కపూర్ల మీద చిత్రించి ప్రత్యేక ఆల్బమ్‌గా విడుదల చేశారు. ఆ పాట చాలామందికి నచ్చుతోంది. అయితే పాత ఆషికీ మీద ఉన్న అభిమానంతో ఈ కొత్తపాటను ఈసడించుకుంటున్నవాళ్లు కూడా ఉన్నారు. ఆషికీని గుర్తు చేస్తూ ఇటీవల వచ్చిన ఆషికీ 2 కూడా హిట్ అయిన సంగతి తెలిసిందే. -
'నేను మళ్లీ నటిస్తున్నాను...'
అనూ అగర్వాల్ పేరు వినబడగానే మణిరత్నం ‘దొంగా దొంగా’ సినిమాలో ‘కొంచెం నీరు..’ పాట పెదాల మీద ఇప్పటికీ పలుకుతుంది. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘ఆషికీ’ సినిమాతో వెండితెరకు పరిచయమైన అనూ అగర్వాల్‌కు ఆ తరువాత చెప్పుకోదగ్గ సినిమాలేవీ రాలేదు. ఈలోపే ఆమెను దురదృష్టం వెంటాడింది. 1999లో ముంబాయిలో ప్రమాదానికి గురై చాలారోజులు కోమాలో ఉంది. దేవుడి దయ వల్ల ఆమె మృత్యువు నుంచి బయటపడింది. ఆ తరువాత మాత్రం అగర్వాల్ రూపంలో మార్పులు వచ్చాయి. కొందరైతే ఆమెను గుర్తు కూడా పట్టలేదు. తాజా వార్త ఏమిటంటే, ‘‘నేను మళ్లీ నటించనున్నాను’’ అని అనూ అగర్వాల్ సోషల్ నెట్వర్కింగ్ పేజీలో రాసింది. తన ఆటోబయోగ్రఫీ‘అనూజువల్-మెమరీ ఆఫ్ ఏ గర్ల్ హు కేమ్ బ్యాక్ ఫ్రమ్ ది డెడ్’ గురించి కూడా ప్రకటించింది. ఈ పుస్తకం వచ్చే నెలలో విడుదల కానుంది. ‘ఢిల్లీ యూనివర్శిటీ’ నుంచి సోషియాలజీలో గోల్డ్‌మెడల్ గెలుచుకున్న అగర్వాల్ మొదట్లో మోడలింగ్ చేసింది. మళ్లీ సినిమాల్లో నటించాలనుకుంటున్న ఆమె ముందు అవకాశాలు క్యూ కట్టడం లేదుగానీ, అనూ అగర్వాల్ ‘ఆటోబయో గ్రఫీ’లోని విషయాల గురించి ఆ నోటా ఈ నోట విన్న ఒక దర్శకుడు ఆమెను కలిసి- ‘‘వేరే కథ ఎందుకు? మీ జీవితకథనే సినిమాగా తీద్దాం’’ అన్నాడట. అందుకు అగర్వాల్ ఒప్పుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి!