ఫస్ట్ సినిమాకే హిట్ అందుకుంటే ఆ కిక్కే వేరు! అలాంటిది 22 ఏళ్ల వయసులో తొలి చిత్రంతోనే అసాధారణ విజయాన్ని అందుకున్నాడు బాలీవుడ్ హీరో రాహుల్ రాయ్. అతడు హీరోగా నటించిన ఆషిఖి సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోవడంతో నిర్మాతలు అతడి ఇంటి ముందు క్యూ కట్టారు. వెంటనే అనేక సినిమాలకు సంతకం చేసుకుంటూ పోయాడు. కానీ వివిధ కారణాల రీత్యా పలు చిత్రాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఏవో ఒకటో, రెండో కాదు ఏకంగా పది సినిమాలు అటకెక్కాయి.
పెళ్లి- విడాకులు
దీంతో నిరాశ చెందిన రాహుల్ తర్వాత ఓపక్క హీరోగా నటిస్తూనే సపోర్టింగ్ రోల్స్ కూడా చేశాడు. 2006లో అతడు బిగ్‌బాస్ షోలో పాల్గొని టైటిల్ విజేతగానూ అవతరించాడు. రాహుల్ రాయ్ ప్రొడక్షన్స్ పేరిట నిర్మాణ సంస్థను స్థాపించి సినిమాలు కూడా రిలీజ్ చేశాడు. మధ్యలో 2000వ సంవత్సరంలో మోడల్ రాజలక్ష్మి ఖాన్‌వికర్(రాణి)ని పెళ్లాడిన అతడు 2014లో ఆమెకు విడాకులిచ్చాడు. కొంతకాలం క్రితం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో తీవ్ర అనారోగ్యానికి లోనైన రాహుల్ ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాడు. తాజాగా అతడు తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
తొలి సినిమా పారితోషికం ఎంతంటే?
'డైరెక్టర్ మహేశ్ భట్‌ను కలిసిన నాలుగైదు నిమిషాల్లోనే మనం సినిమా చేస్తున్నాం అన్నాడు. అలా ఆషిఖి చేశాం. ఈ చిత్రంతో నాకెంతో గుర్తింపు వచ్చింది. ఆషిఖి సినిమాకు గానూ నాకు రూ.30,000 పారితోషికం ఇచ్చారు. థియేటర్‌లో ఆషిఖి చూస్తున్న ప్రేక్షకులు పాటలు రాగానే పైసల కాయిన్లు విసురుతూ సందడి చేశారు. ప్రేక్షకుల స్పందన చూసి సంతోషమేసింది. కానీ ఈ సినిమా రిలీజైన ఆరు నెలల వరకు నాకు ఒక్కటంటే ఒక్క సినిమా ఆఫర్ కూడా రాలేదు. ఆ తర్వాత మాత్రం ఉన్నట్లుండి బోలెడన్ని అవకాశాలు వచ్చాయి. కేవలం 11 రోజుల్లోనే 47 సినిమాలకు సంతకం చేశాను.
దర్శకుడికి కృతజ్ఞతగా..
అతడి వల్లే నా కెరీర్ గొప్పగా ఆరంభమైంది. కాబట్టి తనకు కృతజ్ఞతగా ఏదైనా ఇవ్వాలనుకునేవాడిని. మహేశ్ భట్ పుస్తకప్రియుడు. అందుకే తరచూ పుస్తకాలు బహుమతిగా ఇస్తూ ఉండేవాడిని' అని చెప్పుకొచ్చాడు. మహేశ్ భట్ ద్వారా పరిచయమైన అనుపమ్ ఖేర్ కూడా తన జీతంలో నుంచి కొంత భాగం దర్శకుడికి పుస్తకాలు కొనేందుకే వెచ్చిస్తాడు. ఇకపోతే రాహుల్ రాయ్ 2020 నవంబర్‌లో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యాడు. ఈ సమయంలో ఆయన మాట పడిపోయింది. నెమ్మదిగా బ్రెయిన్ స్ట్రోక్ నుంచి కోలుకుంటున్న అతడు ఇప్పుడిప్పుడే మామూలుగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాడు.
చదవండి: నిమిషానికే రెండు లక్షలు.. అల్లు అర్హ పారితోషికం మొత్తంగా ఎంతంటే?
సౌందర్య చనిపోలేదు, ఆ రూపంలో బతికే ఉంది
Comments
Please login to add a commentAdd a comment