ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు రాహుల్ రాయ్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో వివరించారు. అన్ని జాగ్రత్తలు పాటించినా, తమకు కరోనా సోకిందని పేర్కొంటూ ఓ సుధీర్ఘ పోస్ట్‌ను అభిమానులతో షేర్ చేసుకున్నారు. 'ఇంట్లోంచి అడుగు బయటపెట్టలేదు. అయినా మాకు కరోనా వచ్చింది. మా అపార్ట్‌మెంట్‌లో ఒకరికి కరోనా వచ్చింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా మా బిల్డింగ్‌ను సీల్ చేశారు. 14 రోజుల పాటు మేం ఇంట్లోనే ఉన్నాం. అయినా నాతో పాటు నా కుటుంబం మొత్తానికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సడెన్‌గా ఢిల్లీకి వెళ్లాల్సి ఉండటంతో టెస్ట్ చేయించుకున్నాం. అయితే ఆశ్చర్యంగా మా ఫ్యామిలీ మొత్తానికి కోవిడ్ వచ్చిందని తేలింది.
తమకు కరోనా లక్షణాలు ఏమీ లేవని, ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికీ కరోనా అటాక్ అయ్యిందని పేర్కొన్నాడు. మరో 14 రోజుల పాటు ఉండే క్వారంటైన్ ఎప్పుడు పూర్తవుతుందో ఎదురుచూస్తున్నాం' అని తెలిపాడు. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరు కరోనా జాగ్రత్తలు పాటించాలని కోరాడు. కాగా గతేడాది నవంబర్‌లో రాహుల్ రాయ్‌కు బ్రైన్‌స్ట్రోక్ వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు నెలన్నర రోజుల పాటు హాస్పిటల్‌లోనే చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు. ‘ఆషికీ’ సినిమాతో బాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాహుల్ రాయ్..తొలి సినిమాతోనే బంపర్‌హిట్ కొట్టారు. అయితే ఆ సినిమా విజయం సాధించినా రాహుల్‌కు మాత్రం సరైన అవకాశాలు రాలేదు.
చదవండి : నటి వజ్రాల మాస్కు: ధర చూస్తే దిమ్మ తిరగాల్సిందే!
ముఖం పాడై తెరమరుగైన హీరోయిన్..
Comments
Please login to add a commentAdd a comment