Rahul Roy
-
తొలి సినిమాతో స్టార్డమ్.. బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిపాలు.. మాట పడిపోవడంతో!
ఫస్ట్ సినిమాకే హిట్ అందుకుంటే ఆ కిక్కే వేరు! అలాంటిది 22 ఏళ్ల వయసులో తొలి చిత్రంతోనే అసాధారణ విజయాన్ని అందుకున్నాడు బాలీవుడ్ హీరో రాహుల్ రాయ్. అతడు హీరోగా నటించిన ఆషిఖి సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోవడంతో నిర్మాతలు అతడి ఇంటి ముందు క్యూ కట్టారు. వెంటనే అనేక సినిమాలకు సంతకం చేసుకుంటూ పోయాడు. కానీ వివిధ కారణాల రీత్యా పలు చిత్రాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఏవో ఒకటో, రెండో కాదు ఏకంగా పది సినిమాలు అటకెక్కాయి. పెళ్లి- విడాకులు దీంతో నిరాశ చెందిన రాహుల్ తర్వాత ఓపక్క హీరోగా నటిస్తూనే సపోర్టింగ్ రోల్స్ కూడా చేశాడు. 2006లో అతడు బిగ్‌బాస్ షోలో పాల్గొని టైటిల్ విజేతగానూ అవతరించాడు. రాహుల్ రాయ్ ప్రొడక్షన్స్ పేరిట నిర్మాణ సంస్థను స్థాపించి సినిమాలు కూడా రిలీజ్ చేశాడు. మధ్యలో 2000వ సంవత్సరంలో మోడల్ రాజలక్ష్మి ఖాన్వికర్(రాణి)ని పెళ్లాడిన అతడు 2014లో ఆమెకు విడాకులిచ్చాడు. కొంతకాలం క్రితం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో తీవ్ర అనారోగ్యానికి లోనైన రాహుల్ ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాడు. తాజాగా అతడు తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తొలి సినిమా పారితోషికం ఎంతంటే? 'డైరెక్టర్ మహేశ్ భట్‌ను కలిసిన నాలుగైదు నిమిషాల్లోనే మనం సినిమా చేస్తున్నాం అన్నాడు. అలా ఆషిఖి చేశాం. ఈ చిత్రంతో నాకెంతో గుర్తింపు వచ్చింది. ఆషిఖి సినిమాకు గానూ నాకు రూ.30,000 పారితోషికం ఇచ్చారు. థియేటర్లో ఆషిఖి చూస్తున్న ప్రేక్షకులు పాటలు రాగానే పైసల కాయిన్లు విసురుతూ సందడి చేశారు. ప్రేక్షకుల స్పందన చూసి సంతోషమేసింది. కానీ ఈ సినిమా రిలీజైన ఆరు నెలల వరకు నాకు ఒక్కటంటే ఒక్క సినిమా ఆఫర్ కూడా రాలేదు. ఆ తర్వాత మాత్రం ఉన్నట్లుండి బోలెడన్ని అవకాశాలు వచ్చాయి. కేవలం 11 రోజుల్లోనే 47 సినిమాలకు సంతకం చేశాను. దర్శకుడికి కృతజ్ఞతగా.. అతడి వల్లే నా కెరీర్ గొప్పగా ఆరంభమైంది. కాబట్టి తనకు కృతజ్ఞతగా ఏదైనా ఇవ్వాలనుకునేవాడిని. మహేశ్ భట్ పుస్తకప్రియుడు. అందుకే తరచూ పుస్తకాలు బహుమతిగా ఇస్తూ ఉండేవాడిని' అని చెప్పుకొచ్చాడు. మహేశ్ భట్ ద్వారా పరిచయమైన అనుపమ్ ఖేర్ కూడా తన జీతంలో నుంచి కొంత భాగం దర్శకుడికి పుస్తకాలు కొనేందుకే వెచ్చిస్తాడు. ఇకపోతే రాహుల్ రాయ్ 2020 నవంబర్‌లో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యాడు. ఈ సమయంలో ఆయన మాట పడిపోయింది. నెమ్మదిగా బ్రెయిన్ స్ట్రోక్ నుంచి కోలుకుంటున్న అతడు ఇప్పుడిప్పుడే మామూలుగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాడు. చదవండి: నిమిషానికే రెండు లక్షలు.. అల్లు అర్హ పారితోషికం మొత్తంగా ఎంతంటే? సౌందర్య చనిపోలేదు, ఆ రూపంలో బతికే ఉంది -
సహజీవనం నా జీవితాన్ని నాశనం చేసింది: ప్రముఖ నటి
బాలీవుడ్ నటి అను అగర్వాల్ గురించి చాలామందికి తెలియదు. టాలీవుడ్లో దొంగ దొంగది సినిమాలో అలరించింది. అయితే అనుకోని అంతకుముందే ఆషికి సినిమాతో బాలీవుడ్లో ఫేమ్ సాధించింది. ఆమె నటించిన ఆషికి సూపర్‌హిట్‌గా నిలిచింది. రోడ్డు ప్రమాదంతో కోమాలోకి వెళ్లిడంతో కెరీర్ బ్రేక్ పడింది. తాజాగా ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ వ్యక్తితో తాను సహజీవనం చేసినట్లు వెల్లడించింది. అయితే దానివల్ల తన వ్యక్తిగత జీవితం నాశమైందని తెలిపింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అను అగర్వాల్ మాట్లాడుతూ..'నేను ఓ వ్యక్తితో సహజీవనం చేశా. అయితే అతని తల్లి కూడా మాతో నివసించింది. ఆమె కూడా నన్ను అంగీకరించింది. కానీ ఆమె స్నేహితులు నా గురించి చెడుగా చెప్పారు. అంతేకాకుండా పత్రికల్లో నా గురించి వ్రాసిన విషయాలను నమ్మారు. దీంతో నా జీవితం నాశనమైంది. ఆ సమయంలో నన్ను నేను రక్షించుకోవడానికి నాకు ఎలాంటి మార్గాలు లేవు. అప్పట్లో సోషల్ మీడియా కూడా లేదు. దీంతో నా వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయా'. అని అన్నారు. అను బాలీవుడ్ అరంగేట్రం: 1990లో తన తొలి బాలీవుడ్ చిత్రం ఆషికి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ సినిమాతో అను ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత నటించిన గజబ్ తమాషా, జనమ్ కుండ్లీ, కింగ్ అంకుల్, రిటర్న్ ఆఫ్ జ్యువెల్ థీఫ్ చిత్రాల్లో నటించింది. ఊహించని రోడ్డు ప్రమాదంతో సినిమాలకు దూరమైంది. 1999లో జరిగిన ఓ ప్రమాదం ఆమె జీవితాన్ని కుదిపేసింది. దాదాపు నెల రోజుల పాటు కోమాలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం అను అగర్వాల్ ఫౌండేషన్‌ను నడుపుతూ, యోగా క్లాసులు నిర్వహిస్తోంది. -
అడుగు బయటపెట్టలేదు..అయినా కరోనా వచ్చింది : హీరో
ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు రాహుల్ రాయ్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో వివరించారు. అన్ని జాగ్రత్తలు పాటించినా, తమకు కరోనా సోకిందని పేర్కొంటూ ఓ సుధీర్ఘ పోస్ట్‌ను అభిమానులతో షేర్ చేసుకున్నారు. 'ఇంట్లోంచి అడుగు బయటపెట్టలేదు. అయినా మాకు కరోనా వచ్చింది. మా అపార్ట్మెంట్లో ఒకరికి కరోనా వచ్చింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా మా బిల్డింగ్‌ను సీల్ చేశారు. 14 రోజుల పాటు మేం ఇంట్లోనే ఉన్నాం. అయినా నాతో పాటు నా కుటుంబం మొత్తానికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సడెన్‌గా ఢిల్లీకి వెళ్లాల్సి ఉండటంతో టెస్ట్ చేయించుకున్నాం. అయితే ఆశ్చర్యంగా మా ఫ్యామిలీ మొత్తానికి కోవిడ్ వచ్చిందని తేలింది. తమకు కరోనా లక్షణాలు ఏమీ లేవని, ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికీ కరోనా అటాక్ అయ్యిందని పేర్కొన్నాడు. మరో 14 రోజుల పాటు ఉండే క్వారంటైన్ ఎప్పుడు పూర్తవుతుందో ఎదురుచూస్తున్నాం' అని తెలిపాడు. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరు కరోనా జాగ్రత్తలు పాటించాలని కోరాడు. కాగా గతేడాది నవంబర్‌లో రాహుల్ రాయ్‌కు బ్రైన్స్ట్రోక్ వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు నెలన్నర రోజుల పాటు హాస్పిటల్లోనే చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు. ‘ఆషికీ’ సినిమాతో బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాహుల్ రాయ్..తొలి సినిమాతోనే బంపర్‌హిట్ కొట్టారు. అయితే ఆ సినిమా విజయం సాధించినా రాహుల్‌కు మాత్రం సరైన అవకాశాలు రాలేదు. View this post on Instagram A post shared by Rahul Roy (@officialrahulroy) చదవండి : నటి వజ్రాల మాస్కు: ధర చూస్తే దిమ్మ తిరగాల్సిందే! ముఖం పాడై తెరమరుగైన హీరోయిన్.. -
రాహుల్ రాయ్‌కు ఆరోగ్య ప్రమాదం..
ముంబై: ‘ధీరే ధీరే సే మేరె జిందగీ మే ఆనా’, ‘సాన్సోకి జరూరత్ హై జైసే’... వంటి సూపర్‌హిట్ పాటలతో వచ్చి సూపర్ హిట్ అయిన ‘ఆషికీ’ సినిమా హీరో రాహుల్ రాయ్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. నవంబర్ 2020లో కార్గిల్ సమీపాన షూటింగ్ చేస్తూ ఉండగా అతనికి బ్రైన్స్ట్రోక్ వచ్చింది. వెంటనే అక్కడి నుంచి హుటాహుటిన ముంబై తరలించి నానావతి హాస్పిటల్లో చేర్చారు. అక్కడి నుంచి మరో హాస్పిటల్‌కు మారి రెండు రోజుల క్రితం డిశ్చార్జ్ అయ్యాడు. దాదాపు నెలన్నర రోజులు హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చిన రాహుల్‌ను అతని చెల్లెలు ప్రియ, ఆమె భర్త చూసుకున్నారు. రాహుల్ రాయ్‌కు ఇంకా స్పీచ్ థెరపి, ఫిజియో థెరపీలు ఉన్నాయి. రాహుల్ రాయ్ ‘ఆషికీ’తో వచ్చిన ఫేమ్‌తో చాలా పేరు సంపాదించినా ఆ తర్వాత తగినన్ని హిట్స్ లేక తెర మరుగు అయ్యాడు. బిగ్‌బాస్ హిందీలో పాల్గొని విజేతగా నిలిచి మళ్లీ న్యూస్‌లోకి వచ్చాడు. అతనికి బాలీవుడ్లో వేషాలే దొరకట్లేదని చెప్పాలి. ఎందుకనో ‘ఆషికీ’ సినిమా దాని దర్శకుడు మహేష్ భట్‌కు లాభించినట్టుగా దాని హీరో హీరోయిన్లకు లాభించలేదు. ఇక ఆ సినిమా హీరోయిన్ అనూ అగర్వాల్ భయంకరమైన ప్రమాదంలో ఆమె ముఖమే పాడవగా తెరమరుగైపోయింది. ఇపుడు రాహుల్ రాయ్‌కు ఆరోగ్య ప్రమాదం... ఏదేమైనా రంగులు హంగులతో పాటు ఊహించని ఘటనలు నిండి ఉండే చోటు బాలీవుడ్. -
'ఆషిఖి' నటుడికి బ్రెయిన్ స్ట్రోక్
'ఎల్ఏసీ' సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్న బాలీవుడ్ నటుడు రాహుల్ రాయ్‌కు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. కార్గిల్‌లో ఉన్న వాతావరణం కారణంగా ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో వెంటనే షూటింగ్ నిలిపివేసి రెండు రోజుల క్రితం ముంబైకి వచ్చారు. ఈ విషయాన్ని రాహుల్ రాయ్ సోదరుడు రోమీర్ సేన్ ఆలస్యంగా మీడియాకు తెలిపారు. రాహుల్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నాడని, అయితే ఎవరూ భయపడాల్సిన పని లేదని పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారని చెప్పారు. కోవిడ్ పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చిందన్నారు. (చదవండి: రియాలిటీ షో: వారిద్దరూ కలిసుండటం లేదా!) రాహుల్ రాయ్.. 'ఆషిఖి' సినిమాతో 22 ఏళ్లకే బాలీవుడ్లో తెరంగ్రేటం చేశారు. మొదటి సినిమాతోనే మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. తర్వాత పలు సినిమాల్లో తన ప్రతిభ చూపించారు. 2006లో హిందీ బిగ్‌బాస్ మొదటి సీజన్ టైటిల్‌ను సైతం ఆయన కైవసం చేసుకున్నారు. పలు టీవీ షోలలోనూ ప్రత్యేక అతిథిగా కనిపించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన 'ఎల్ఏసీ- లైవ్ ద బాటిల్ ఇన్ కార్గిల్' సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. (చదవండి: 26/11 విషాదం.. ‘మీ జ్ఞాపకాలే నా బలం’) -
బీజేపీలోకి ‘ఆషికి’ ఫేమ్ రాహుల్ రాయ్
న్యూఢిల్లీ: బాలీవుడ్ సినిమా ‘ఆషికి’ఫేమ్ రాహుల్ రాయ్ బీజేపీలో చేరారు. శనివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి విజయ్ గోయల్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాయ్ మాట్లాడుతూ.. ఇది తన జీవితంలో గుర్తుండిపోయే రోజని పేర్కొన్నారు. పార్టీలో ఉంటూనే నటనను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. 22 ఏళ్ల వయసులో రాయ్ బాలీవుడ్లో నటుడిగా రంగప్రవేశం చేశారు. 1990లో వచ్చిన ‘ఆషికి’సినిమా ఆయనకు గుర్తింపు తీసుకొచ్చింది. ప్రముఖ టీవీ షో బిగ్‌బాస్ మొదటి సీజన్ విజేతగా నిలిచారు. పార్టీ ఏ పని అప్పగించినా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా నేతృత్వంలో భారత్‌పై ప్రపంచదేశాల దృక్పథం మారిందని, ఇది తనను ఎంతోగానో ఆకర్షించిందని, అందుకే పార్టీలో చేరారని వెల్లడించారు. -
ఆషికీ: ప్రేమకథకు పాతికేళ్లు...
ఆల్‌టైమ్ హిట్ ‘ఆషికి’ ఎందరి జీవితాలను నిలబెట్టిందో చెప్పలేము. అందులో హీరోగా నటించిన రాహుల్ రాయ్, హీరోయిన్గా నటించిన అనూ అగర్వాల్, సంగీతం అందించిన నదీమ్-శ్రావణ్, పాడిన కుమార్ షానూ వీళ్లందరూ రాత్రికి రాత్రి సూపర్‌స్టార్స్ అయ్యారు. ఈ సినిమాను నిర్మించిన గుల్షన్ కుమార్‌కు ఈ సినిమా తెచ్చి పెట్టిన సంపద సామాన్యమైనది కాదు. కేవలం లక్ష రూపాయల ఖర్చుతో తయారైన పాటలు ఆ రోజుల్లో అతడికి కోట్లు సంపాదించి పెట్టాయి. ఇప్పటికీ సంపాదించి పెడుతున్నాయి. చరిత్రలో ఒక సినిమా తన సంగీతంతో ఎంత సంపాదించవచ్చు అనడానికి ఇంతకు మించిన ఉదాహరణ లేదు. గుల్షన్ కుమార్ టి- సిరీస్ ద్వారా ఆడియో క్యాసెట్ల రంగంలో సంచలనం సృష్టించడంతో పాటు కొత్త గొంతులను పరిచయం చేయడంలో కూడా ముందుండేవాడు. పాత పాటలను రీమిక్స్ చేసి సొంత ఆల్బమ్స్ తయారు చేసి విడుదల చేసుకోవచ్చు అని ఎప్పుడైతే తెలిసిందో రఫీ, కిశోర్, ముఖేష్ వంటి గొంతులను పోలినవారిని వెతకడం మొదలుపెట్టాడు గుల్షన్ కుమార్. ఆ వెతుకులాటలో భాగంగా కలకత్తాకు చెందిన కుమార్ షాను దొరికాడు. నదీమ్-శ్రావణ్‌లతో కొన్ని బాణీలు చేయించి గీతకారుడు సలీమ్ చేత పాటలు రాయించి కుమార్ షాను గొంతులో రికార్డు చేయించి ఒక కొత్త ఆల్బమ్ విడుదల చేయాలని గుల్షన్‌కుమార్ ఆలోచన. అయితే అప్పుడే దర్శకుడు మహేష్ భట్ ఆ పాటలు విని ఈ పాటల ఆధారంగా ఒక సినిమా తీస్తాను అని ఆషికి తీశాడు. ఇందుకు పూర్తిగా కొత్త ముఖాలనే ఎంచుకున్నాడు. రాహుల్ రాయ్, అనూ అగర్వాల్, దీపక్ తిజోరి వంటి కొత్తవాళ్లతో వచ్చినా సరే కథాబలం, పాటల బలం, హీరో హీరోయిన్ల ప్రెజెన్స్ సినిమాను సూపర్ హిట్ చేశాయి. బాగా డబ్బున్న కుర్రాడైన రాహుల్ రాయ్ అనాథ అయిన అనూ అగర్వాల్ ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకోవడం కథ. ఈ సీదాసాదా కథను మంచి మంచి పాటలతో నింపి చెప్పడం వల్ల కథనం ఆసక్తికరంగా మారింది. ఇందులోని ప్రతీ పాటా హిట్టే. జానే జిగర్ జానెమన్ మై దునియా భులాదూంగా నజర్కే సామ్నే జిగర్ కే పాస్ తూ మేరీ జిందగీ హై బస్ ఏక్ సనమ్ చాహియే ఆషికీ కే లియే... 1990 ఆగస్టు మూడోవారంలో రిలీజైన సినిమా దేశమంతా దుమారం రేపింది. ప్రతి ఇంటా ప్రతి బండిలో ఆఖరికి ప్రతి లారీలో కూడా ఇవే పాటలు వినిపించేవి. ఇందులో పాడిన అనురాధా పౌడ్వాల్ ఆ రోజుల్లో లతా మంగేష్కర్‌కు గట్టి పోటీగా నిలిచింది. అయితే ఈ సినిమా వల్ల లబ్ధి పొందిన వారు ఆ తర్వాత జీవితంలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. నదీమ్-శ్రావణ్లలో నదీమ్ హత్యకు గురయ్యాడు. గుల్షన్ కుమార్ కూడా హత్యకు గురయ్యాడు. అనూ అగర్వాల్ పెద్ద కార్ యాక్సిడెంట్‌కు లోనయ్యి ముఖం అంద వికారంగా మారడంతో సినిమాలకే దూరమయ్యింది. తనకు వెన్నుదన్నుగా నిలిచిన గుల్షన్ కుమార్ మరణం వల్ల అనురాధా పౌడ్వాల్ కెరీర్లో వెనుకబడింది. రాహుల్ రాయ్ ఒకటి రెండు సినిమాల్లో మెరిసినా తర్వాత రాణించలేకపోయాడు. అయినప్పటికీ ‘ఆషికి’ ఒక గొప్ప ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదలయ్యి 25 ఏళ్లు నిండిన సందర్భంగా గుల్షన్ కుమార్‌కు నివాళిగా ఈ సినిమాలోని ‘ధీరే ధీరే సే’ పాటను పాప్ గాయకుడు హనీ సింగ్ చేత రీమిక్స్ చేసి హృతిక్ రోషన్, సోనమ్ కపూర్ల మీద చిత్రించి ప్రత్యేక ఆల్బమ్‌గా విడుదల చేశారు. ఆ పాట చాలామందికి నచ్చుతోంది. అయితే పాత ఆషికీ మీద ఉన్న అభిమానంతో ఈ కొత్తపాటను ఈసడించుకుంటున్నవాళ్లు కూడా ఉన్నారు. ఆషికీని గుర్తు చేస్తూ ఇటీవల వచ్చిన ఆషికీ 2 కూడా హిట్ అయిన సంగతి తెలిసిందే.