ముంబై: ‘ధీరే ధీరే సే మేరె జిందగీ మే ఆనా’, ‘సాన్సోకి జరూరత్ హై జైసే’... వంటి సూపర్‌హిట్ పాటలతో వచ్చి సూపర్ హిట్ అయిన ‘ఆషికీ’ సినిమా హీరో రాహుల్ రాయ్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. నవంబర్ 2020లో కార్గిల్ సమీపాన షూటింగ్ చేస్తూ ఉండగా అతనికి బ్రైన్‌స్ట్రోక్ వచ్చింది. వెంటనే అక్కడి నుంచి హుటాహుటిన ముంబై తరలించి నానావతి హాస్పిటల్‌లో చేర్చారు. అక్కడి నుంచి మరో హాస్పిటల్‌కు మారి రెండు రోజుల క్రితం డిశ్చార్జ్ అయ్యాడు. దాదాపు నెలన్నర రోజులు హాస్పిటల్‌లోనే ఉండాల్సి వచ్చిన రాహుల్‌ను అతని చెల్లెలు ప్రియ, ఆమె భర్త చూసుకున్నారు. రాహుల్ రాయ్‌కు ఇంకా స్పీచ్ థెరపి, ఫిజియో థెరపీలు ఉన్నాయి.
రాహుల్ రాయ్ ‘ఆషికీ’తో వచ్చిన ఫేమ్‌తో చాలా పేరు సంపాదించినా ఆ తర్వాత తగినన్ని హిట్స్ లేక తెర మరుగు అయ్యాడు. బిగ్‌బాస్ హిందీలో పాల్గొని విజేతగా నిలిచి మళ్లీ న్యూస్‌లోకి వచ్చాడు. అతనికి బాలీవుడ్‌లో వేషాలే దొరకట్లేదని చెప్పాలి. ఎందుకనో ‘ఆషికీ’ సినిమా దాని దర్శకుడు మహేష్ భట్‌కు లాభించినట్టుగా దాని హీరో హీరోయిన్లకు లాభించలేదు. ఇక ఆ సినిమా హీరోయిన్ అనూ అగర్వాల్ భయంకరమైన ప్రమాదంలో ఆమె ముఖమే పాడవగా తెరమరుగైపోయింది. ఇపుడు రాహుల్ రాయ్‌కు ఆరోగ్య ప్రమాదం... ఏదేమైనా రంగులు హంగులతో పాటు ఊహించని ఘటనలు నిండి ఉండే చోటు బాలీవుడ్.
Comments
Please login to add a commentAdd a comment