న్యూఢిల్లీ: బాలీవుడ్ సినిమా ‘ఆషికి’ఫేమ్ రాహుల్ రాయ్ బీజేపీలో చేరారు. శనివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి విజయ్ గోయల్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాయ్ మాట్లాడుతూ.. ఇది తన జీవితంలో గుర్తుండిపోయే రోజని పేర్కొన్నారు. పార్టీలో ఉంటూనే నటనను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. 22 ఏళ్ల వయసులో రాయ్ బాలీవుడ్‌లో నటుడిగా రంగప్రవేశం చేశారు.
1990లో వచ్చిన ‘ఆషికి’సినిమా ఆయనకు గుర్తింపు తీసుకొచ్చింది. ప్రముఖ టీవీ షో బిగ్‌బాస్ మొదటి సీజన్ విజేతగా నిలిచారు. పార్టీ ఏ పని అప్పగించినా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా నేతృత్వంలో భారత్‌పై ప్రపంచదేశాల దృక్పథం మారిందని, ఇది తనను ఎంతోగానో ఆకర్షించిందని, అందుకే పార్టీలో చేరారని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment