
దిశాపాట్నీ
వరుస గాయాలతో హీరోయిన్ దిశా పాట్నీ ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల సల్మాన్‌ఖాన్ ‘భారత్’ సినిమా షూటింగ్ సమయంలో దిశా కాలికి గాయమైన సంగతి గుర్తుండే ఉంటుంది. తాజాగా మరోసారి దిశా గాయపడ్డారు. మోహిత్ సూరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మలాంగ్’ సినిమాలో దిశాపాట్నీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా షూట్‌లోనే ఆమె చేతికి గాయమైంది. సీన్ కంప్లీట్ చేశాకే దిశా హస్పిటల్‌కి వెళ్లారు. పెద్ద గాయం కాకపోవడంతో నో రెస్ట్ అంటున్నారు దిశా. ఆదిత్యారాయ్ కపూర్, కునాల్ కేము, అనిల్ కపూర్ ఈ సినిమాలో కీలక పాత్రలు చేస్తున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment