
ఆదిత్య రాయ్ కపూర్, దిశా పటానీ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మలంగ్: అన్‌లిష్ ద మ్యాడ్‌నెస్’. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి ఏడున ప్రేక్షకుల మందుకు వచ్చింది. ‘ఆషికి 2’, ‘ఏక్ విలన్’ సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు మోహిత్ సూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మధ్య సరైన హిట్ దొరకని ఆదిత్య కపూర్‌కు ఈ సినిమా కాస్త ఊరటనిచ్చిందనే చెప్పవచ్చు. యాక్షన్ సన్నివేశాల్లో ఆదిత్య విజృంభిస్తే, ప్రేమ సన్నివేశాల్లో దిశా అద్భుతంగా నటించింది. ఈ సినిమా ఎక్కువ భాగం గోవాలోనే షూటింగ్ జరుపుకుంది. (మలంగ్ ట్రైలర్‌ను వీక్షించండి)
‘మలంగ్’ తొలివారం మంచి వసూళ్లనే రాబట్టింది. విడుదలైన తొలి నాడు సుమారు రూ.7 కోట్లు రాబట్టగా తర్వాతి రోజుల్లో వరుసగా రూ. 8, 10 కోట్లు కురిపించింది. దీంతో వీకెండ్‌లో పుంజుకున్నట్లు కనిపించినా.. సోమవారానికి మాత్రం వసూళ్లు రూ.4 కోట్ల దగ్గరే ఆగిపోయాయి. తొలుత కలెక్షన్లలో దూకుడు ప్రదర్శించిన ఈ చిత్రం దాన్ని కొనసాగించడంలో మాత్రం కాస్త తడబడుతోంది. మొత్తంగా ఇప్పటివరకు రూ.36 కోట్లు రాబట్టింది. కాగా వాలంటైన్స్ డే నాడు కార్తీక్ ఆర్యన్, సారా అలీ ఖాన్ నటించిన రొమాంటిక్ డ్రామా సినిమా ‘లవ్ ఆజ్ కల్2’ విడుదల అవుతుండటంతో ‘మలంగ్’ వసూళ్లకు గండిపడే అవకాశాలున్నాయి. (ఔను: వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు)
Comments
Please login to add a commentAdd a comment