Kunal Khemu
-
అప్పుడు కాలు.. ఇప్పుడు చేయి!
వరుస గాయాలతో హీరోయిన్ దిశా పాట్నీ ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల సల్మాన్‌ఖాన్ ‘భారత్’ సినిమా షూటింగ్ సమయంలో దిశా కాలికి గాయమైన సంగతి గుర్తుండే ఉంటుంది. తాజాగా మరోసారి దిశా గాయపడ్డారు. మోహిత్ సూరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మలాంగ్’ సినిమాలో దిశాపాట్నీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా షూట్లోనే ఆమె చేతికి గాయమైంది. సీన్ కంప్లీట్ చేశాకే దిశా హస్పిటల్‌కి వెళ్లారు. పెద్ద గాయం కాకపోవడంతో నో రెస్ట్ అంటున్నారు దిశా. ఆదిత్యారాయ్ కపూర్, కునాల్ కేము, అనిల్ కపూర్ ఈ సినిమాలో కీలక పాత్రలు చేస్తున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. -
మాకు పనీపాటా లేక కాదు..!
బాలీవుడ్ కథానాయికలు ఇప్పుడు నిర్మాతలుగా మారడం ఓ ట్రెండ్ అయింది. ఇప్పటికే దియా మీర్జా, ప్రియాంకా చోప్రా, అనుష్కా శర్మ వంటి తారలు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు వీళ్ల లిస్ట్‌లో సోహా అలీఖాన్ కూడా చేరారు. తన భర్త కునాల్ ఖేమూతో కలిసి ఆమె సినిమాలు నిర్మించనున్నారు. తొలి ప్రయత్నంగా ఓ లివింగ్ లెజెండ్ జీవితం ఆధారంగా సినిమా నిర్మించనున్నట్లు ఆమె తెలిపారు. ఆ లెజెండ్ సినీ, క్రీడా రంగాలకు చెందిన వ్యక్తి కాదని స్పష్టం చేశారు. ఆ వివరాలు త్వరలో తెలియజేస్తామన్నారు. ‘‘మాకు పనీపాటా లేకపోవడం వల్ల నిర్మాతలుగా మారలేదు. మేం నిర్మించే సినిమాల్లో మేం నటించం. కొత్త ఆలోచనలను ప్రోత్సహించాలనే సంకల్పంతోనే నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నాం’’ అని సోహా పేర్కొన్నారు. -
తెరపై రొమాన్స్ ఇబ్బందే
సినిమా తెరపై తాను మరొక నటునితో రొమాన్స్ చేస్తుంటే తన ప్రియుడైన కునాల్ ఖెమూ అసూయ పడుతుంటాడని బాలీవుడ్ నటి సోహా పేర్కొంది. మనల్ని అభిమానించే వ్యక్తులు మరొక వ్యక్తితో తెరపై రొమాన్స్ చేస్తూ కనిపిస్తే సహించలేమని తెలిపింది. తాను కూడా అసూయ పడుతుంటానని, అయితే అది బయటకు కనబడనీయకుండా జాగ్రత్త పడతానని వివరించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ సోదరి అయిన సోహా, నటుడు కునాల్ కొన్ని రోజులుగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని, వారు త్వరలోనే వివాహం కూడా చేసుకోనున్నారనే ప్రచారం బాలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఒక నటునితో డేటింగ్ చేయాలంటే ఎన్నో కష్టాలుంటాయని సోహ అభిప్రాయపడింది. బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల ఒకరినొకరం కలుసుకోవడం కాస్త కష్టమవుతోందని, ఒకవేళ కలిసినా ఇద్దరం మంచి మూడ్‌లో ఉంటామన్న గ్యారంటీ లేదంది. తాము వేర్వేరు ప్రాజెక్టుల్లో పనిచేస్తుండటంతో ఒకేసారి ఏకాంతం దొరకడం కష్టమేనని వ్యాఖ్యానించింది. తమ షెడ్యూళ్లు వేర్వేరుగా ఉండటమే దానికి కారణమంది. ఈ కాలంలో ప్రతి ఒక్కరూ చాకచక్యంగా ఉంటున్నారన్న సోహా..నటులకు కూడా భావోద్వేగాలు అనేవి ఉంటాయని గుర్తుంచుకోవాలని చెప్పింది. ‘ఒక్కోసారి మనలను మనం సంభాళించుకోలేనప్పుడు ఏదైనా చేయొచ్చు.. అది అనాలోచితంగా జరిగేది.. వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కరెక్టు కాదు..’ అని ఆమె పేర్కొంది. ‘ఒక్కోసారి నేను మంచి మూడ్‌లో ఉంటా.. కాని అదే సమయంలో కునాల్ సినిమా సరిగా ఆడకపోవడం .. షూటింగ్ సమయంలో ఎవరైనా అతడిని ఇబ్బంది పెట్టడం వంటి కారణాల వల్ల అతడు నాపై అసహనం వ్యక్తం చేస్తాడు.. నేను కూడా అంతే.. అసహనం ఎక్కువైతే ఇంట్లో వస్తువులు విసిరేస్తాను.. తలుపులు తంతాను..అయితే ఆ తర్వాత మళ్లీ బాధపడతాను..’ అంటూ ముక్తాయించింది. తాను ఓ గొప్ప నటిగా ఫీలవుతానని, అయితే కునాల్ మాత్రం సాధారణ వ్యక్తిలాగే వ్యవహరిస్తాడని చెప్పింది. సోహా నటించిన ‘జో బీ కార్వలో’ అనే సినిమా నేడు విడుదల కానుంది. -
అమ్మ వెంటపడింది : సోహా అలీఖాన్
ముంబై: పెళ్లి చేసుకుని స్థిరపడాలంటూ తన తల్లి కొంతకాలంగా చెబుతోందని సహనటుడు కునాల్ ఖేముతో కొన్నాళ్లు ఆటాపాటా సాగించిన నటి సోహా అలీఖాన్ అంటోంది. అయితే సోదరుడు సైఫ్ మాత్రం 40 ఏళ్లు వచ్చాకే వివాహం చేసుకోవాలంటూ సలహా ఇస్తున్నాడంది. సోహా, కునాల్‌లు ఓ కొత్త ఇంట్లో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే పెళ్లెప్పుడనేది మాత్రం ఇంకా తేలలేదు. ‘కచ్చితంగా పెళ్లి చేసుకోవాలంటూ ప్రతి రోజూ మా అమ్మ వెంటపడింది. ఆమె మాట వినిఉంటే కనుక ఇప్పటికి నాకు 20 మంది పిల్లలు పుట్టేవాళ్లు. అయితే చెప్పి చెప్పి విసిగిపోయిందేమో. ఇప్పుడు ఆ మాట అనడం లేదు. నీకు తోచినప్పుడు చేసుకో అంటోంది’ అని సోహా చెప్పింది. సోదరుడు సైఫ్ ఎవరైనా సరే 40 ఏళ్ల వయసులోనే చేసుకోవాలని చెబుతున్నాడంది. ‘పెళ్లి అనేది ఓ గట్టి కట్టుబాటు వంటిదని సైఫ్ అంటున్నాడు. అందుకే 40 ఏళ్లు వచ్చేదాకా నువ్వు మనస్ఫూర్తిగా సన్నద్ధం కాలేవు అని సలహా ఇచ్చాడు’ అని తెలిపింది. కునాల్ తనకు అన్నివిధాలుగా సహకరిస్తున్నాడంది. ఎంతో ఆనందంగా కాలం గడుపుతాడంది. ఎప్పుడైనా తాను నిరాశానిస్పృహకు లోనైతే దాని నుంచి బయటపడేవిధంగా చేస్తాడంది. అటువంటి ధోరణి ఎంతో అవసరమని తెలిపింది. వృత్తిపరంగా చక్కని సలహాలు ఇస్తాడంది. ఎంతో ప్రేమపూర్వకంగా, ఆప్యాయంగా ఉంటాడంది. అటువంటి ప్రేమనందించే వ్యక్తిని కలిగి ఉండడం ఆనందం కలిగిస్తోందంది. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ కుమారుడైన సైఫ్ అలీఖాన్ ఐదేళ్లపాటు ప్రేమాయణం సాగించి 42 ఏళ్ల వయసులో నటి కరీనాకపూర్‌ను గత ఏడాది వివాహమాడిన సంగతి తెలిసిందే.