మా మధ్య ఏమీలేదు! | We've always been friends: Shraddha Kapoor on Aditya Roy Kapur | Sakshi
Sakshi News home page

మా మధ్య ఏమీలేదు!

Published Sun, Apr 12 2015 10:20 PM | Last Updated on Sun, Sep 3 2017 12:13 AM

మా మధ్య ఏమీలేదు!

మా మధ్య ఏమీలేదు!

‘ఆషికి-2’లో శ్రద్ధా కపూర్‌ను చూసి ‘‘అబ్బ..ఇలాంటి అమ్మాయి నాకు లవర్ అయితే ఎంత బాగుంటుంది’’ అని కొంతమంది యువకులు అనుకునే ఉంటారు. ఈ హాట్ బ్యూటీ అంతగా కుర్రకారుని ఆకట్టుకున్నారు. శ్రద్ధా ఎంతమంది గుండెల్లో గూడుకట్టుకున్నారో చెప్పలేం కానీ.. హీరో ఆదిత్య రాయ్ కపూర్ మనసులో మాత్రం ఉన్నారనే వార్త ప్రచారంలో ఉంది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న శ్రద్ధా ఈ విషయం గురించి మాట్లాడుతూ -‘‘అందరూ అనుకుంటున్నట్లు ఆదిత్యకూ నాకూ మధ్య ఏమీ లేదు.
 
 మా మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే. అంతకు మించి ఏదైనా ఉందని ఎవరైనా అనుకుంటే నేనేం చేయలేను. కాకపోతే లేని విషయాన్ని ఉందన్నట్లుగా ఊహించడం ఎందుకు?’’ అన్నారు. ఆదిత్యతో తనకు స్నేహం కుదరడానికి గల కారణం గురించి చెబుతూ - ‘‘ ‘ఆషికి-2’ చేస్తున్నప్పుడు ఇద్దరం సన్నివేశాలను చర్చించుకుని చేసేవాళ్లం. అలా మా మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. ఆ సినిమా తాలూకు అనుభవాలు మా ఇద్దరి మనసుల్లోంచి ఎప్పటికీ చెరిగిపోవు. ఇప్పుడే కాదు.. ఆదిత్య నాకెప్పటికీ ఓ స్పెషల్ ఫ్రెండ్‌గా నిలిచిపోతాడు’’ అని శ్రద్ధాకపూర్ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement