సెలబ్రిటీలు కనిపిస్తే చాలు వాళ్లతో ఒక్క ఫోటో అయినా దిగాలనుకుంటారు చాలామంది. ఇక అందులో తమ ఫెవరెట్ హీరో, హీరోయిన్లు కనిపిస్తే వాళ్ల ఆనందానికి అవధులుండవు. అయితే కొందరు తమ అభిమానాన్ని చూపించే క్రమంలో కొన్నిసార్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. తాజాగా బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్‌కు సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
అసలే అతడికి లేడీ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. తాజాగా ఆయన నైట్ మేనేజర్ అనే వెబ్‌సిరీస్‌లో నటించారు. స్క్రీనింగ్ అనంతరం ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తుండగా పలువురు ఆయనతో కలిసి ఫోటోలు దిగారు. ఈ క్రమంలో ఓ లేడీ ఫ్యాన్ ఆదిత్య రాయ్ దగ్గరకు వచ్చి సెల్ఫీ అడిగింది. ఫోటో దిగుతుండగానే హీరోను హగ్ చేసుకునేందుకు, ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించింది.
ఈ చర్యతో షాక్ అయిన ఆదిత్య రాయ్ నవ్వుతూనే ఆమె చర్యను ప్రతిఘటించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. సెలబ్రిటీలు అయినంత మాత్రాన వాళ్లను ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment