fan following
-
అమాంతం పెరిగిన చిరాగ్ ఫ్యాన్ ఫాలోయింగ్
ఇది సోషల్ మీడియా యగం. దీనిలో ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు చాలామంది తాపత్రయ పడుతుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా తమ ప్రతిభను చాటుతున్న పలువురు ఫ్యాన్ ఫాలోయింగ్ కోసం ఎదురు చూస్తుంటారు. అయితే ఎన్నికల నేపధ్యంలో బీహార్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ కుమార్ పాశ్వాన్‌కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోవర్స్ సంఖ్య అమాంతం పెరిగింది.చిరాగ్ కుమార్ పాశ్వాన్ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్‌లోని జముయి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికల ప్రకటన వచ్చినది మొదలు చిరాగ్‌కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ నిరంతరం పెరుగుతూ వచ్చింది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ (ఎక్స్) తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చిరాగ్ అభిమానుల సంఖ్య విపరీతంగా పెరిగింది.చిరాగ్ పాశ్వాన్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ప్రకారం ఆయన ఈ ఏడాది మే 26 నాటికి ఒక మిలియన్ (10 లక్షలు) ఫాలోవర్లను సంపాదించుకున్నారు. తాజాగా చిరాగ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. తనకు పెరుగుతున్న ఫాలోవర్ల గురించి చిరాగ్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ఇన్‌స్టాలో సమాచారం ఇచ్చారు.చిరాగ్ పాశ్వాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం నలుగురిని మాత్రమే అనుసరిస్తున్నారు. అర్జున్ భారతి, నరేంద్ర మోదీ, రామ్ విలాస్ పాశ్వాన్, అమిత్ షాలను చిరాగ్ అనుసరిస్తున్నారు. తన ఇన్‌స్టాలో చిరాగ్ మొత్తం 2,076 పోస్ట్‌లను షేర్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ (ట్విట్టర్)లో 93 లక్షల 27 వేలమంది ఫాలోవర్లు ఉన్నారు. ఎక్స్‌లో పాశ్వాన్ 112 మందిని అనుసరిస్తున్నారు. చిరాగ్‌కు ఫేస్బుక్లో ఏడు లక్షలమంది ఫాలోవర్లు ఉన్నారు. -
ఫాన్స్‌తో వ్యవహారం మామూలుగా ఉండదు..అదొక మనస్తత్వ శాస్త్రం!
అది న్యూస్ రిపోర్టర్ల వాట్సాప్ గ్రూప్. అందులో ఒక వీడియో. ఆ వీడియోలో.. కొత్తగా రిలీజ్ అయిన సినిమా థియేటర్ ముందు సినిమా హాల్ నుంచి బయటకు వచ్చిన వారిని "సినిమా ఎలా వుంది ? అని అడుగుతున్నారు . సాధారణంగా " సూపర్ " " హండ్రెడ్ డేస్ " వెయ్యి రోజులు ఖాయం " కలియుగాంతం దాకా ఈ సినిమా ఆడుతుంది " అని ఇలాంటి సందర్బాల్లో సమాధానాలు వస్తుంటాయి . అది అభిమానులు చెప్పే మాటలో లేక మానేజ్ చేసినవో తెలియదు. లోతుగా పరిశీలించి తెలుసుకోవాల్సినంత సీన్ లేదు. ఇలాంటి వీడియో ఒకటి ఉంటుంది అనుకొని దాన్ని చూడలేదు. ఆ గ్రూప్‌లో వచ్చిన కామెంట్స్ చూసి అసలు వీడియోలో ఏముందో అని క్లిక్ చేసి డౌన్ లోడ్ అయ్యాక చూసా. ఎవరో వ్యక్తి సినిమా బాగోలేదు అని కామెంట్ కామెంట్ చేసాడు. దానితో అక్కడ ఉన్న అభిమానులు అతనిపై దాడి చేసారు. చూడగానే మనసు చివుక్కు మంది. ఆ వ్యక్తి తన మనసులోని ఫీలింగ్స్ చెప్పాడో లేదా కావాలనే దుష్ప్రచారం చేసాడో .. తరువాతి మాట . సినిమా బాగా లేదు అనగానే దాడి చేస్తారా ? మనం ఏమైనా తాలిబన్ల రాజ్యంలో ఉన్నామా? అనిపించింది. హీరోల అభిమానులు అలాగే ఉంటారని మా బాల్యంలో చెప్పుకునేవారు. ఒకప్పుడూ ఎంజీఆర్ సినిమా తొలి రోజు సినిమాకు వెళితే అయన అభిమానులు తలతో ఫైట్ చేసేవారట. అమాయకుడు ఎవరైనా వెళితే తలపగలడం ఖాయం అట. అది ఎంత వరకు నిజమో కానీ ఫాన్స్ వ్యవహారం మామూలుగా ఉండదు . అదొక సామాజిక- మనస్తత్వ శాస్త్ర టాపిక్. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక రకమయిన మానసిక రుగ్మత. కాలం మారినా దక్షిణాదిన ఈ ధోరణి మారలేదు. అభిమానులు తమకు అసెట్ అని చాలా మంది సో కాల్డ్ హీరోస్ అనుకొంటారు. అభిమానులు వీరి మెడకు వేలాడే గుదిబండలు అని .. పాపం గ్రహించలేరు. అంత తెలివితేటలు ఉండే అవకాశం తక్కువ. భ్రమల లోకంలో బతికేస్తుంటారు . సాగినన్నాళ్లు సాగుతుంది. ఒక్కోసారి ఆకాశం నుంచి నేలకు పడిపోతారు. నిన్నటి హీరో.. పాపం తీవ్ర డిప్రెషన్ తో బాధ పడుతున్నాడు . ఇంకా ఎంతో మంది ఇలాంటి కోవలో ఉన్నారో లేదా కాస్త తక్కువ స్థాయిలో డిప్రెషన్లో ఉన్నారు అనేదాని గురించి మాట్లాడడం .. విశ్లేషించడం టైం వేస్ట్. చిత్రమయిన విషయం ఏమిటంటే అంత బహిరంగంగా దాడి చేయడం. నిజానికి ఇది తప్పు .. మీకు అభిమానం ఉంటే సినిమా ఎందుకు బాగోలేదో చెప్పుమని అడగొచ్చు అంతే గాని దాడి చెయ్యడం ఏంటి ? అని ఎవరూ అడిగినట్లు లేరు . పోలీస్‌లు ఏమి చేసారో తెలియదు. అటుపై ఇంకో వీడియో చూసా. దాడి జరిగిన వ్యక్తి .. హీరో నన్ను ఇంటికి పిలిస్తే సంతోష పడుతాను అంటున్నాడు . అలాంటివి జరగవు అని నాకు తెలుసు. ఒక వేళా హీరో జరిగిన దానికి సారీ చెప్పాలనుకున్నా అభిమానులు .. సలహాదారులు చెప్పనివ్వరు. నెక్స్ట్ సీన్.. ఫేస్బుక్ ఫ్రెండ్ .. ఓ మహిళ. ఆ మధ్యలో మెసెంజర్లో లండన్ గురించి సమాచారం ఇచ్చారనుకొంటా! నా పోస్ట్‌ల పై కామెంట్స్ పెడుతుంటారు . నేను లోతుగా పరిశీలించలేదు. ఆమెకు దేవుడంటే భక్తి . విదేశాల్లో ఉన్నా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు అంటే అమితంగా ఇష్ట పడే వ్యక్తి. ఆమె ఆ సినిమా నచ్చలేదని పోస్ట్ పెట్టినట్టున్నారు . దాని పై కొంత మంది తనని టార్గెట్ చేసుకొంటూ ఎలా మాట్లాడింది అంటూ.. పోస్ట్‌లు పెట్టారు . నేను ఎప్పుడో కానీ ఫేస్‌బుక్‌లోకి వెళ్లి ఇతరుల పోస్ట్‌లు చూడను. అనుకోకుండా ఈ పోస్ట్ కనిపించింది. ఆ సినిమాను విమర్శించింది కాబట్టి ఆమె హిందువు కాదు అని.. ఇంకా రకరకాలుగా కామెంట్స్ చేసారని అర్థం అయ్యింది. సినిమా సినిమానే . జీవితం కాదు. ఒకే ఇంట్లో ఒకరికి సినిమా నచ్చోచ్చు. ఇంకొరికి నచ్చక పోవచ్చు. అదేమీ అసాధారణం కాదు. సినిమా నచ్చకపొతే ఆమె తన అభిప్రాయాన్ని పోస్ట్ చేసారు . ఒకవేళ..లేదు సినిమా బాగుంది .. ఈ కోణం లో చూడాలి" అని కామెంట్ చెయ్యడం సమంజసం. తప్పు లేదు. కానీ వ్యక్తిగత దాడి చేయడానికి అసలు ఎవరు మీరు ? సినిమా అభిమానులా ? హీరో అభిమానులా? అంటే కాదు. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏమిటంటే ఒక పార్టీ అభిమానులు (అందరూ కాదు .. కొందరు ) ఇలా పోస్ట్ లు పెట్టడాన్ని చూసాను. ఇదేమి పార్టీ వ్యవహారం కాదు. పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వదు . వీరికి సినిమా నచ్చితే దాన్ని పోస్ట్ చేసుకోవచ్చు. సినిమాపై వస్తున్న విమర్శల్ని కూడా తిప్పి కొట్టొచ్చు. కానీ ఆ క్రమం లో వ్యక్తిగత కామెంట్స్ చేయడం .. పిచ్చి పిచ్చి లాజిక్‌లు తియ్యడం .. సినిమాను విమర్శించిన వారందరూ సంఘ వ్యతిరేఖ శక్తులు వీరికి భక్తి లేదు .. దేవుడంటే నమ్మకం లేదు అని కామెంట్స్ చెయ్యడం .. ఈ పనులు వల్ల వీరు ఏమి సాధించారో నాకైతే అర్థం కాలేదు. మొదట్లో సదరు హీరోపై నాకు సధాభిప్రాయం ఉండేది. కష్టపడుతాడు, అనుకొన్నది సాధించాలన్న పట్టుదల ఉంది అనుకొనే వాడిని. ఆ సినిమాపై, ప్రారంభంలో నాకు ఎలాంటి అభిప్రాయం లేదు . కానీ ఈ అభిమానులు చేసిన రచ్చ తరువాత ఒక నెగటివ్ ఫీలింగ్ వచ్చింది. నాలా నెగటివ్ ఫీలింగ్స్ తెచ్చుకొన్నవారు కచ్చితంగా వేలల్లో/లక్షల్లో వుంటారు. చాలా మంది అన్నీ గమనిస్తుంటారు. జరుగుతున్న దాన్ని బట్టి ఒక అభిప్రాయాన్ని ఏర్పర్చుకుంటారు. అభిమానం అంటే నిర్మాణాత్మక విమర్శలను ఆహ్వానించడం. అంతే కానీ తనకు నచ్చనిది అవతలి వారు చెప్పారు కనుక వారిపై మాటలతో దాడికి రెడీ అవ్వడం కాదు. అత్యుత్సాహంతో ఎవరో ఇద్దరు ముగ్గురు కామెంట్ చెయ్యడంతో నొచ్చుకొన్న ఆమె " ఛీ .. మీరు ఇలాంటి వారా?" అంటూ మొత్తం ఆ ఐడియాలజీ వర్గాన్ని అసహ్యించుకొంటూ పోస్ట్ పెట్టారు . సెల్ఫ్ గోల్ వేసుకోవడం అని దీన్నే అంటారని చెబుతున్నారు.మానసిక శాస్త్ర పరిశోధకులు, - వాసిరెడ్డి అమర్ నాథ్, మానసిక శాస్త్ర పరిశోధకులు, సీనియర్ విద్యావేత్త. (చదవండి: పేద విద్యార్థులకు అండగా నాట్స్ అధ్యక్షుడు) -
హీరోను ముద్దుపెట్టుకోబోయిన లేడీ ఫ్యాన్.. షాక్ అయిన నటుడు
సెలబ్రిటీలు కనిపిస్తే చాలు వాళ్లతో ఒక్క ఫోటో అయినా దిగాలనుకుంటారు చాలామంది. ఇక అందులో తమ ఫెవరెట్ హీరో, హీరోయిన్లు కనిపిస్తే వాళ్ల ఆనందానికి అవధులుండవు. అయితే కొందరు తమ అభిమానాన్ని చూపించే క్రమంలో కొన్నిసార్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. తాజాగా బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్‌కు సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అసలే అతడికి లేడీ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. తాజాగా ఆయన నైట్ మేనేజర్ అనే వెబ్‌సిరీస్‌లో నటించారు. స్క్రీనింగ్ అనంతరం ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తుండగా పలువురు ఆయనతో కలిసి ఫోటోలు దిగారు. ఈ క్రమంలో ఓ లేడీ ఫ్యాన్ ఆదిత్య రాయ్ దగ్గరకు వచ్చి సెల్ఫీ అడిగింది. ఫోటో దిగుతుండగానే హీరోను హగ్ చేసుకునేందుకు, ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించింది. ఈ చర్యతో షాక్ అయిన ఆదిత్య రాయ్ నవ్వుతూనే ఆమె చర్యను ప్రతిఘటించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. సెలబ్రిటీలు అయినంత మాత్రాన వాళ్లను ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by @varindertchawla -
హనీరోజ్ కోసం ఎగబడిన ఫ్యాన్స్.. ఫాలోయింగ్ మామూలుగా లేదుగా!
హనీరోజ్.. ఈమె సినీ కెరీర్ వీరసింహారెడ్డికి ముందు, ఆ తర్వాత అనేట్లుగా ఉంది. ఈ సినిమాలో హనీ రోజ్ పోషించిన మీనాక్షి పాత్రతో చాలామందికి కనెక్ట్ అయ్యింది. అందంతో పాటు నటనతనూ అలరించిన హనీరోజ్ ఈ సినిమా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ ఒక్క సినిమాతో తెలుగులో బోలెడంత పాపులారిటీని దక్కించుకుంది. దీంతో ఆమె క్రేజ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. తాజాగా కేరళలోని ఓ షోరూం ఓపెనింగ్‌కి హనీరోజ్ గెస్టుగా వెళ్లింది. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఫ్యాన్స్ వచ్చేశారు. హనీరోజ్‌ను చూడటానికి వచ్చిన జనాన్ని చూసి పోలీసులు, బౌన్సరలే షాకయ్యారు. అంతమంది జనాన్ని కంట్రోల్ చేయలేక నానా తిప్పలు పడ్డారు. ఇక షాప్ ఓపెనింగ్ అనంతరం హనీరోజ్ తిరిగి వెళ్తుండగా ఆమెతో సెల్ఫీల కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఇంకొంత మంది అయితే ఆమెపై పడిపోయారు కూడా. చివరికి ఎలాగోలా హనీరోజ్ కారెక్కి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు హనీరోజ్ ఫాలోయింగ్ చూసి ఆశ్చర్యపోతున్నారు. View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) -
విజయ్ @ 80 లక్షలు
హీరో విజయ్ దేవరకొండకు యూత్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన నటన, స్టైల్, డిఫరెంట్ యాటిట్యూడ్‌తో అభిమానులను సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో విజయ్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 8 మిలియన్ల ఫాలోయర్స్‌ను సంపాదించుకొని సౌత్‌లోనే నంబర్ వన్ హీరోగా నిలిచారు. తమ అభిమాన హీరో 80 లక్షల మార్కుకి చేరుకోవడంతో విజయ్ ఫ్యా¯Œ ్స ఫుల్ ఖుషీ అవుతున్నారు. విజయ్‌కి టాలీవుడ్లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన నటించిన ‘అర్జున్ రెడ్డి, గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ సినిమాలు హిందీలో డబ్ కావడంతో అక్కడ కూడా అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న ‘ఫైటర్’ (టైటిల్ మారే అవకాశం ఉంది) ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఈ సినిమాతో డైరెక్ట్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నారు విజయ్ దేవరకొండ. -
ఫ్యాన్ మూమెంట్
హీరో మహేశ్‌బాబుకు ఫ్యాన్స్ నంబర్ ఇంత అని చెప్పలేం. ఎప్పటికప్పుడు ఆ నంబర్ అప్డేట్ అవుతూ పెరుగుతూ ఉంటుంది. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మహేశ్ తానే అభిమానిలా మారిపోయి వెస్టిండీస్ క్రికెటర్ ఆండీ రాబర్ట్స్‌తో ఫొటో దిగారు. ప్రస్తుతం మహేశ్ హాలిడే మూడ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే లండన్‌లో భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌ను లైవ్‌లో మహేశ్ వీక్షించిన సంగతి గుర్తుండే ఉంటుంది. సో.. మహేశ్ అక్కడే ఈ ఫొటో దిగి ఉండవచ్చు. ఇక.. ఈ ఫారిన్ ట్రిప్ కంప్లీట్ కాగానే ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమా షూట్లో జాయిన్ అవుతారు మహేశ్. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. -
సమంతకు షాకిచ్చిన అభిమాని
తమిళసినిమా: నటి సమంత గురించి ఏదో ఒక వార్త మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఆ మధ్య నటుడు నాగచైతన్యతో ప్రేమ అనే ప్రచారం హోరెత్తించారు. ఆ జంట ప్రేమపెళ్లికి దారి తీయడంతో ఇకపై సమంత నటిస్తుందా? అందుకు నాగచైతన్య కుటుంబం అంగీకరిస్తుందా, అనే సందేహాలను ప్రచారం చేశాయి.పెళ్లైన మూడో రోజునే సమంత షూటింగ్‌కు సిద్ధం అయితే అదో వార్త అయ్యింది. కాయలున్న చెట్టుకే రాళ్లన్న సామెతలా ఫామ్‌లో ఉన్న సమంత గురించి రకరకాల వదంతులు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకటి సమంత నటనకు గుడ్‌బై చెప్పనున్నారన్నది ఒకటి. అయితే ఇలాంటి వదంతులను ఎంజాయ్ చేస్తూ తన పని తాను చేసుకుపోతున్న సమంత కెరీర్ పరంగా విజయబాటలో దూసుకుపోతున్నారు. ద్విభాషా చిత్రం యూటర్న్‌తో పాటు తమిళంలో విజయ్‌సేతుపతికి జంటగా నటిస్తున్న సూపర్ డీలక్స్, తెలుగులో తన భర్త నాగచైతన్యతో ఒక చిత్రం చేస్తున్నారు. శివకార్తికేయన్‌తో నటించిన సీమరాజా చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉంది. ఇంత బిజీగా ఉన్న సమంత సమయం దొరికినప్పుడల్లా ట్విట్టర్లో తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటుంటారు. ట్విట్టర్లో సమంతకు అభిమానుల ఫాలోయింగ్ అధికస్థాయిలోనే ఉంది. తంటా ఎక్కడొచ్చిందంటే స్నేహితులు, సినిమా వాళ్ల ప్రశ్నలకే తప్ప సమంత అభిమానులకు బదులివ్వడం లేదట. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వీరాభిమాని కాస్త ఘాటుగానే ప్రశ్నించాడు. అదేమిటంటే తాను ఇప్పటి వరకూ వేలకు పైగా మీకు ట్వీట్ చేశానని, మీరు మాత్రం ఒక్కసారి కూడా బదులివ్వలేదని నిష్టూరమాడాడు. అంతే కాదు అయిన మీపై అభిమానం ఒక్క శాతం కూడా తగ్గలేదంటూ, ధైర్యంగా ఐలవ్యూ అని కూడా చెప్పేశాడు. దీంతో షాక్ అవడం సమంత వంతైంది. ఆ తరువాత తేరుకుని తనకు వెయ్యికి పైగా మెసేజ్‌లు చేసినందుకు కృతజ్ఞతలు అని ఆ అభిమానికి బదులిచ్చారు. అంతే తనకు సమంత ట్విట్ చేయడంతో ఆ అభిమాని ఆనందంతో ఎగిరి గంతేశాడు. నేను జయించాను. ఎంతో సాధించాన న్న ఫీలింగ్ కలుగుతోంది అంటూ ఫుల్ జోష్‌లో మునిగిపోయాడు. అభిమానం అంటే ఇదే. -
అక్షయ్‌ను హెచ్చరించిన కరీనా!
సెలబ్రిటీలు ఏం చేసినా ఓ కన్ను కనిపెడుతూనే ఉంటుంది. అలాంటిది సెలబ్రిటీల పిల్లలంటే మీడియా ఫోకస్ అంతా వారిపైనే ఉంటుంది. సోషల్ మీడియాలో సెలబ్రిటీల కంటే వారి పిల్లలే ఎక్కువగా ట్రెండ్ అవుతుంటారు. ఇలాంటి లిస్ట్‌లో మొదటిగా చెప్పుకోవాల్సింది తైమూర్ అలీ ఖాన్. పుట్టిన రోజు నుంచే సెలబ్రిటీగా మారిన తైమూర్.. తన క్యూట్ చిక్స్‌తో ఎంతో మందిని ఆకర్షించాడు. తైమూర్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే తాజాగా...కరీనా కపూర్, అక్షయ్‌కుమార్‌ను హెచ్చరించింది. అది కూడా తైమూర్ విషయంలో. అక్షయ్‌ను ఉద్దేశిస్తూ...‘తైమూర్ వల్ల నీకు ముప్పు ఉంది. నీకు ఉన్న అభిమాన గణాన్ని తైమూర్ దాటేయగలడు. ఇది నా ఓపెన్ ఛాలెంజ్’ అంటూ ఓ కార్యక్రమంలో పేర్కొంది. ప్రస్తుతం కరీనా ‘వీరే ది వెడ్డింగ్’ షూటింగ్లో బిజీగా ఉంది. ఇక, మీడియాలో తన తనయుడిపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. ఇప్పుడు తన కుమారుడి వయస్సు 14 నెలలు మాత్రమేనని, కానీ తనకు సంబంధించిన ప్రతి ఫొటో బయటికి ఎలా వస్తుందో తెలియడం లేదన్నారు. బాబు ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ డ్రెస్ ధరించాడు, హెయిర్ స్టైల్ ఎలా ఉంది వంటి అంశాలపై కూడా చర్చ జరుగుతుందని ఆమె తెలిపారు. ఇది హర్షణీయం కాదన్నారు. మీడియా తనని అంతలా ఫాలో అవుతుంటే, ఎలా అదుపు చెయ్యాలో కూడా తెలియడం లేదన్నారు. -
ఈ బర్రె ఏ హీరో ఫ్యానో తెలుసా?
హీరోలకు ఫ్యాన్స్ ఉండటం సహజమే. కొందరు హీరోలకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. మరికొందరు హీరోలంటే అమ్మాయిలు పడిచస్తారు. ఇంకొందరి సినిమాలంటే ఫ్యామిలీ ఆడియెన్స్ క్యూ కడతారు. ఇలా చెప్పుకుంటూపోతే ఫ్యాన్ ఫాలోయింగ్‌లోనూ రకాలు ఉంటాయి. కానీ ఓ స్టార్ హీరోను బర్రె ఫాలో కావడం ఎప్పుడైనా చూశారా? లేదు కదా! కానీ బాలీవుడ్ యాక్షన్ సూపర్ స్టార్ అక్షయ్‌కుమార్ అంటే బర్రెలు పడి చస్తాయట. ఆయనే ఈ విషయాన్ని ట్విట్టర్లో తెలిపారు. సహజంగా అందరు హీరోలకు మనుష్యులు అభిమానులుగా ఉంటారు. కానీ వెరైటీగా నాకు బర్రెలు అభిమానులైపోయాయి. నేను ఏడికిపోతే ఆడికి వచ్చేస్తున్నాయి. ప్రేమను నేను స్వాగతిస్తున్నానంటూ తన కారు వెంట ఫాలో అవుతున్న బర్రెలతో సెల్ఫీ దిగి మరీ ట్విట్టర్లో పెట్టాడు అక్కీ. ఆ మధ్య ఓ పాకిస్థాన్ జర్నలిస్టు బర్రెను ఇంటర్వ్యూ చేసిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. అదేవిధంగా మన అక్కీ కూడా బర్రెల నాడీ పట్టేసినట్టున్నాడు. ఓ అభిమాన బర్రెతో ఆయన నవ్వుతూ సెల్ఫీ దిగుతుండగా.. ఆ బర్రె ఆయనను ఎంత ఆసక్తిగా చూస్తుందో చూడండి. నిజమే మనమిప్పుడు ఒప్పుకోవచ్చు ఈ బర్రె డెఫినెట్‌గా అక్కీ ఫ్యానే అయి ఉంటుందని అభిమానులు ఎక్కసెక్కమాడుస్తున్నారు! అన్నట్టు మన అక్కీ భాయ్ లేటెస్ట్ సినిమా 'రుస్తుం' ఈ శుక్రవారమే వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్లో బిజిగా ఉన్న అక్షయ్‌కుమార్ ట్విట్టర్ నిండా ఈ సినిమా కబుర్లతో నింపేస్తున్నాడు. All love is welcome. People have fan following,I have bull following...seriously this is not bullsh*t! Look -
సెట్లో ఎవరూ నన్ను గుర్తుపట్టలేదు: ఆలియా
సాధారణంగా ఎవరైనా హీరోయిన్ సినిమాలో నటిస్తోందంటే.. షూటింగ్ చూసేందుకు, ఆమెను దగ్గరగా చూసేందుకు వందలాది మంది అభిమానులు అక్కడకు చేరుకుంటారు. అలాంటిది సినిమా సెట్లలో అయితే ఇక హీరోయిన్లకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ సంగతి చెప్పనే అక్కర్లేదు. కానీ, 'ఉడ్తా పంజాబ్' సినిమాలో ఆలియాభట్ నటిస్తుంటే.. అసలు ఆమెను ఎవరూ గుర్తుపట్టలేదట, కనీసం దగ్గరకు కూడా రాలేదట. ఈ విషయాన్ని ఆలియానే స్వయంగా వెల్లడించింది. ఈ సినిమాలో ఆమె బిహార్ నుంచి వచ్చిన వలసకూలీ పాత్ర పోషిస్తోంది. అది బాగా డీగ్లామరైజ్డ్ పాత్ర కావడంతో.. షూటింగు మొదలవగానే తాను వచ్చినా కూడా ఎవరూ తనను గుర్తుపట్టలేదని, దర్శకుడు అభిషేక్ చౌబేతో తాను మాట్లాడుతుంటే అప్పుడు మాటను బట్టి గమనించి అంతా నాలుగు అడుగులు వెనక్కి వెళ్లారని చెప్పింది. ఈ విషయాలను ఆమె ఆ సినిమాలోని 'ఇక్ కుడీ' పాట ఆవిష్కరణ సందర్భంగా వెల్లడించింది. అమిత్ త్రివేదీ ట్యూన్లు అందించిన ఈ పాట స్లోగా సాగే పంజాబీ గీతం. ఇది ప్రేక్షకుల హృదయాలను నేరుగా తాకుతుంది. హాకీ ప్లేయర్ కావాలని ఆశపడే ఆలియాభట్.. తన టాలెంట్ చూపించడానికి చాలా కష్టపడుతుండటాన్ని ఈ పాటలో చూపిస్తారు. ఈ సినిమాలో ఇంకా షాహిద్ కపూర్, దిల్జీత్ దోసంజ్, కరీనా కపూర్ ఖాన్ తదితరులు నటిస్తున్నారు. బాలాజీ మోషన్ పిక్చర్స్, ఫాంటమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 17న విడుదల కానుంది.