
ఆండీ రాబర్ట్స్, మహేశ్‌బాబు
హీరో మహేశ్‌బాబుకు ఫ్యాన్స్ నంబర్ ఇంత అని చెప్పలేం. ఎప్పటికప్పుడు ఆ నంబర్ అప్‌డేట్ అవుతూ పెరుగుతూ ఉంటుంది. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మహేశ్ తానే అభిమానిలా మారిపోయి వెస్టిండీస్ క్రికెటర్ ఆండీ రాబర్ట్స్‌తో ఫొటో దిగారు. ప్రస్తుతం మహేశ్ హాలిడే మూడ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే లండన్‌లో భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌ను లైవ్‌లో మహేశ్ వీక్షించిన సంగతి గుర్తుండే ఉంటుంది. సో.. మహేశ్ అక్కడే ఈ ఫొటో దిగి ఉండవచ్చు. ఇక.. ఈ ఫారిన్ ట్రిప్ కంప్లీట్ కాగానే ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమా షూట్‌లో జాయిన్ అవుతారు మహేశ్. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment