west indies cricketers
-
ఫిక్సింగ్ కలకలం.. విండీస్ క్రికెటర్‌పై వేటు
వెస్టిండీస్ వికెట్‌కీపర్, బ్యాటర్ డెవాన్ థామస్‌పై ఐసీసీ సస్సెన్షన్ వేటు వేసింది. లంక ప్రీమియిర్ లీగ్ 2021లో ఫిక్సింగ్ పాల్పడ్డాడన్న అభియోగాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది. అలాగే యూఏఈ, కరీబియన్ లీగ్‌ల్లో బుకీలు కలిసిన విషయాన్ని దాచిపెట్టాడని, వీటిపై విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని పేర్కొంది. థామస్‌పై సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని.. శ్రీలంక క్రికెట్ (SLC), ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ (ECB), కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) యొక్క అవినీతి నిరోధక కోడ్ల ప్రకారం అతనిపై ఏడు అభియోగాలు మోపినట్లు వెల్లడించింది. కాగా, డెవాన్ థామస్ గతేడాదే టెస్ట్ అరంగేట్రం చేశాడు. అతను విండీస్ తరఫున ఒక టెస్ట్, 21 వన్డేలు, 12 టీ20లు ఆడాడు. ఇందులో మొత్తంగా 320 పరుగులు, 36 క్యాచ్‌లు, 4 రనౌట్లు, 8 స్టంపింగ్‌లు చేశాడు. టెస్ట్‌ల్లో, వన్డేల్లో బౌలింగ్ సైతం చేసిన థామస్.. ఫార్మాట్‌కు 2 చొప్పున 4 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IPL 2023 QF 1: సీఎస్కే-గుజరాత్ మ్యాచ్‌పై అనుమానాలు.. ఫిక్స్ అయ్యిందా..? -
టెస్ట్‌ల్లో తొలి సెంచరీ బాదిన శివ్‌నరైన్ చంద్రపాల్ తనయుడు
వెస్టిండీస్ యువ క్రికెటర్ టగెనరైన్ చంద్రపాల్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. కెరీర్లో మూడో మ్యాచ్‌లోనే సెంచరీ చేసి తండ్రి శివ్‌నరైన్ చంద్రపాల్‌ను పుత్రోత్సాహంతో పరవశించేలా చేశాడు. జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సెంచరీ బాదిన టగెనరైన్.. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నాడు. బ్యాటింగ్ శైలితో పాటు హావభావలు సైతం తండ్రిలాగే ప్రదర్శించే టగెనరైన్.. సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడటంలోనూ, పరుగులు సాధించడంలోనూ తండ్రికి సరిసాటి అనిపించుకుంటున్నాడు. A maiden Test ton for Tagenarine Chanderpaul as the Windies openers put on a double century stand 🙌Watch #ZIMvWI live and FREE on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺📝 Scorecard: https://t.co/kWH1ac3IPs pic.twitter.com/GuyFrenHUF— ICC (@ICC) February 5, 2023 జింబాబ్వేతో మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 221 పరుగులు చేసింది. ఓపెనర్లు టగెనరైన్ చంద్రపాల్ (291 బంతుల్లో 101 నాటౌట్; 10 ఫోర్లు, సిక్స్), క్రెయిగ్ బ్రాత్‌వైట్ (246 బంతుల్లో 116 నాటౌట్; 7 ఫోర్లు) సెంచరీలతో కదం తొక్కారు. జింబాబ్వే బౌలర్లు శాయశక్తులా ప్రయత్నించినా వీరిద్దరిని ఔట్ చేసుకోలేకపోయారు. ముఖ్యంగా టగెనరైన్ వికెట్ల ముందు గోడలా నిలబడి, బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. టగెనరైన్ సెంచరీ సాధించడంతో అతనిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తండ్రి శివ్‌నరైన్ చంద్రపాల్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. 26 ఏళ్ల టగెనరైన్ 3 టెస్ట్ మ్యాచ్‌ల్లో 5 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, అర్ధసెంచరీ సాయంతో 65.25 సగటున 261 పరుగులు చేశాడు. టగెనరైన్ తండ్రి శివ్‌నరైన్ 1994-15 మధ్యకాలంలో 164 టెస్ట్‌ల్లో 51.4 సగటున 30 సెంచరీలు, 66 హాఫ్‌సెంచరీల సాయంతో 11867 పరుగులు చేశాడు. అలాగే 268 వన్డేల్లో 11 సెంచరీలు, 59 హాఫ్‌సెంచరీల సాయంతో 8778 పరుగులు, 22 టీ20ల్లో 343 పరుగులు చేసి విండీస్ దిగ్గజ బ్యాటర్ అనిపించుకున్నాడు. ఇదిలా ఉంటే, 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు వెస్టిండీస్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. వర్షం అంతరాయం నడుమ తొలి టెస్ట్ ఆటంకాలతో సాగుతోంది. -
ఐపీఎల్ అసలు క్రికెట్టే కాదు.. ప్రముఖ వ్యాఖ్యాత సంచలన వ్యాఖ్యలు
ఆంటిగ్వా: పొట్టి ఫార్మాట్‌పై వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్, ప్రముఖ వ్యాఖ్యాత మైఖేల్ హోల్డింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 ఫార్మాట్ అసలు క్రికెట్టే కాదని, అందుకే ఆ ఫార్మట్‌లో జరిగే ఐపీఎల్ తదితర లీగ్‌ల్లో కామెంటరీ చెప్పడం లేదని పేర్కొన్నాడు. తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తాను క్రికెట్‌కు మాత్రమే కామెంటరీ చెబుతానని, తాను ఐపీఎల్‌ను క్రికెట్‌గా పరిగణించనని, అందుకే కామెంటరీ చెప్పడం లేదని వెల్లడించాడు. ఈ సందర్భంగా ప్రస్తుత విండీస్ క్రికెట్ దుస్థితిపై ఆయన స్పందించాడు. టీ20ల కారణంగా సుదీర్ఘ ఫార్మాట్లో తమ దేశం రాణించలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవలి కాలంలో తమ జట్టు పొట్టి ఫార్మాట్లో రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచినప్పటికీ.. ఆ గెలుపు అసలు గెలుపే కాదని, ఈ టోర్నీలు నెగ్గడం విండీస్ క్రికెట్‌కు పునరుజ్జీవం కాదని అభిప్రాయపడ్డాడు. విండీస్ క్రికెటర్లు దేశం కోసం టెస్ట్ క్రికెట్ ఆడడం మానేసి, డబ్బు కోసం ఐపీఎల్ లాంటి క్యాష్ రిచ్ లీగ్‌ల బాట పట్టారని ఆయన వాపోయాడు. విండీస్ లాంటి పేద దేశం భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులలా ఆటగాళ్లకు వేతనాలు చెల్లించలేవని, అందుకే తమ ఆటగాళ్లు ఆ దేశాల్లో జరిగే టీ20 క్రికెట్ ఆడేందుకు ఇష్టపడుతున్నారని పేర్కొన్నాడు. వేతన వివాదాలపై తమ దేశ క్రికెట్ బోర్డు, ఆటగాళ్ల మధ్య అనేక వివాదాలున్నాయని, ఇలాంటి పరిస్థితులుంటే ఆటగాళ్లు మాత్రం ఏం చేయగలరని వ్యాఖ్యానించాడు. క్రికెటర్లను నిందించడం తన ఉద్దేశం కాదని, డబ్బులు ఎర వేసి ఆటగాళ్లను లోబర్చుకుంటున్న నిర్వాహకులను మాత్రమే తాను విమర్శిస్తున్నాని పేర్కొన్నాడు. తమ దేశ స్టార్ క్రికెటర్లు టెస్ట్ క్రికెట్‌కు చాలా సేవలు చేయాల్సి ఉందని, కానీ వారికి అవేవీ పట్టడం లేదని గేల్, రసెల్, బ్రేవో, పొలార్డ్, సునీల్ నరైన్ లాంటి క్రికెటర్లనుద్దేశించి వ్యాఖ్యానించాడు. ఇటీవలి కాలంలో విండీస్ జట్టు టీ20 టోర్నమెంట్లను గెలుస్తుండవచ్చని, అయితే అది క్రికెట్టే కాదు.. అసలు గెలుపే కాదని తెలిపాడు. కాగా, మైఖేల్ హోల్డింగ్ ఇటీవలే జాత్యహంకార అంశంపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ తాను ఇంగ్లండ్‌లో పెరిగి ఉంటే.. అసలు బతికి ఉండేవాడినే కాదని, అదృష్టవశాత్తు తాను అక్కడ పెరగలేదని, లేదంటే యువకుడిగా ఉన్నప్పుడే చనిపోయేవాడినని అన్నాడు. 1979లో వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన 67 ఏళ్ల హోల్డింగ్ విండీస్ తరఫున 60 టెస్టులు, 102 వన్డేలు ఆడాడు. మొత్తంగా 391 వికెట్లు పడగొట్టాడు. చదవండి: కోహ్లీని తప్పిస్తే టీమిండియా ఐసీసీ టోఫ్రీ గెలుస్తుందా..? -
ఫ్యాన్ మూమెంట్
హీరో మహేశ్‌బాబుకు ఫ్యాన్స్ నంబర్ ఇంత అని చెప్పలేం. ఎప్పటికప్పుడు ఆ నంబర్ అప్డేట్ అవుతూ పెరుగుతూ ఉంటుంది. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మహేశ్ తానే అభిమానిలా మారిపోయి వెస్టిండీస్ క్రికెటర్ ఆండీ రాబర్ట్స్‌తో ఫొటో దిగారు. ప్రస్తుతం మహేశ్ హాలిడే మూడ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే లండన్‌లో భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌ను లైవ్‌లో మహేశ్ వీక్షించిన సంగతి గుర్తుండే ఉంటుంది. సో.. మహేశ్ అక్కడే ఈ ఫొటో దిగి ఉండవచ్చు. ఇక.. ఈ ఫారిన్ ట్రిప్ కంప్లీట్ కాగానే ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమా షూట్లో జాయిన్ అవుతారు మహేశ్. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. -
‘బ్యాట్’ దూశాడు!
బెంగళూరు బౌలర్ స్టార్క్ వైపు బ్యాట్ విసిరిన పొలార్డ్ సాధారణంగా వెస్టిండీస్ క్రికెటర్లు మైదానంలో చేసే చర్యలు అభిమానులకు నవ్వు తెప్పిస్తాయి. తమ ఆటతో పాటు సరదా చర్యలతోనూ వీరు అభిమానులను సంపాదించుకుంటారు. కానీ మంగళవారం నాటి ముంబై, బెంగళూరు మ్యాచ్‌లో మాత్రం పొలార్డ్ చర్య క్రీడాభిమానులను షాక్‌కు గురి చేసింది. 17వ ఓవర్లో బెంగళూరు బౌలర్ స్టార్క్... క్రీజులో ఉన్న పొలార్డ్‌కు అద్భుతమైన బౌన్సర్ సంధించి బ్యాట్స్‌మన్‌ను రెచ్చగొట్టాడు. దీనికి పొలార్డ్ ‘పోవోయ్.. పో’ అన్న తరహాలో సైగ చేశాడు. కానీ స్టార్క్ తర్వాతి బంతిని వేసేందుకు వస్తున్న సమయంలో పొలార్డ్ క్రీజును వదిలి పక్కకు వచ్చాడు. స్టార్క్ మాత్రం బంతిని బ్యాట్స్‌మన్ వైపు వేగంగా విసిరాడు. దీంతో పట్టరాని కోపంతో ఊగిపోయిన పొలార్డ్... స్టార్క్ వైపు బ్యాట్ విసిరేశాడు. ‘టైం’ బాగుండటంతో బ్యాట్ చేతిలోంచి చివరి క్షణంలో జారింది. అయినా బౌలర్ వైపు పొలార్డ్ దూసుకెళ్లాడు. దీంతో రెండో ఎండ్‌లో ఉన్న రోహిత్, అంపైర్లు వేగంగా వచ్చి పొలార్డ్‌ను ఆపారు. అటు బెంగళూరు కెప్టెన్ కోహ్లితో పాటు గేల్ కూడా వచ్చి పొలార్డ్‌ను చల్చబరిచారు. అయితే ఓవర్ ముగిసిన తర్వాత కూడా పొలార్డ్, కోహ్లి ఈ అంశంపై సీరియస్‌గా మాట్లాడుకున్నారు. పొలార్డ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా... కోహ్లి చిరాకుగా తిరస్కరించాడు. మొత్తానికి క్రీడాస్ఫూర్తి లేకుండా ఆటగాళ్లు ప్రవర్తించిన తీరు మాత్రం గర్హనీయం.