‘బ్యాట్’ దూశాడు! | Pollard-Starc Brawl Overshadows Batting Fireworks | Sakshi
Sakshi News home page

‘బ్యాట్’ దూశాడు!

Published Wed, May 7 2014 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 7:00 AM

‘బ్యాట్’ దూశాడు!

‘బ్యాట్’ దూశాడు!

బెంగళూరు బౌలర్ స్టార్క్ వైపు బ్యాట్ విసిరిన పొలార్డ్
 సాధారణంగా వెస్టిండీస్ క్రికెటర్లు మైదానంలో చేసే చర్యలు అభిమానులకు నవ్వు తెప్పిస్తాయి. తమ ఆటతో పాటు సరదా చర్యలతోనూ వీరు అభిమానులను సంపాదించుకుంటారు. కానీ మంగళవారం నాటి ముంబై, బెంగళూరు మ్యాచ్‌లో మాత్రం పొలార్డ్ చర్య  క్రీడాభిమానులను షాక్‌కు గురి చేసింది. 17వ ఓవర్‌లో బెంగళూరు బౌలర్ స్టార్క్... క్రీజులో ఉన్న పొలార్డ్‌కు అద్భుతమైన బౌన్సర్ సంధించి బ్యాట్స్‌మన్‌ను    రెచ్చగొట్టాడు. దీనికి పొలార్డ్ ‘పోవోయ్.. పో’ అన్న తరహాలో సైగ చేశాడు. కానీ స్టార్క్ తర్వాతి  బంతిని వేసేందుకు వస్తున్న సమయంలో పొలార్డ్ క్రీజును వదిలి పక్కకు వచ్చాడు. స్టార్క్ మాత్రం బంతిని బ్యాట్స్‌మన్ వైపు వేగంగా విసిరాడు.
 
 దీంతో పట్టరాని కోపంతో ఊగిపోయిన పొలార్డ్... స్టార్క్ వైపు బ్యాట్ విసిరేశాడు. ‘టైం’ బాగుండటంతో బ్యాట్ చేతిలోంచి చివరి క్షణంలో జారింది. అయినా బౌలర్ వైపు పొలార్డ్ దూసుకెళ్లాడు. దీంతో రెండో ఎండ్‌లో ఉన్న రోహిత్, అంపైర్లు వేగంగా వచ్చి పొలార్డ్‌ను ఆపారు. అటు బెంగళూరు కెప్టెన్ కోహ్లితో పాటు గేల్ కూడా వచ్చి పొలార్డ్‌ను చల్చబరిచారు. అయితే ఓవర్ ముగిసిన తర్వాత కూడా పొలార్డ్, కోహ్లి ఈ అంశంపై సీరియస్‌గా మాట్లాడుకున్నారు. పొలార్డ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా... కోహ్లి చిరాకుగా తిరస్కరించాడు. మొత్తానికి క్రీడాస్ఫూర్తి లేకుండా ఆటగాళ్లు ప్రవర్తించిన తీరు మాత్రం గర్హనీయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement