Honey Rose Get Huge Fan Following In Kerala, Video Viral - Sakshi
Sakshi News home page

Honey Rose : హనీరోజ్‌ కోసం ఎగబడిన ఫ్యాన్స్‌.. ఫాలోయింగ్‌ మామూలుగా లేదుగా!

Published Sun, Feb 5 2023 3:05 PM | Last Updated on Sun, Feb 5 2023 3:42 PM

Honey Rose Fans Go Crazy At Kerala Video Viral - Sakshi

హనీరోజ్‌.. ఈమె సినీ కెరీర్‌ వీరసింహారెడ్డికి ముందు, ఆ తర్వాత అనేట్లుగా ఉంది. ఈ సినిమాలో హనీ రోజ్ పోషించిన మీనాక్షి పాత్రతో చాలామందికి కనెక్ట్‌ అయ్యింది. అందంతో పాటు నటనతనూ అలరించిన హనీరోజ్‌ ఈ సినిమా స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ ఒక్క సినిమాతో తెలుగులో బోలెడంత పాపులారిటీని దక్కించుకుంది. దీంతో ఆమె క్రేజ్‌ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది.

తాజాగా కేరళలోని ఓ షోరూం ఓపెనింగ్‌కి హనీరోజ్‌ గెస్టుగా వెళ్లింది. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఫ్యాన్స్‌ వచ్చేశారు. హనీరోజ్‌ను చూడటానికి వచ్చిన జనాన్ని చూసి పోలీసులు, బౌన్సరలే షాకయ్యారు. అంతమంది జనాన్ని కంట్రోల్‌ చేయలేక నానా తిప్పలు పడ్డారు. ఇక షాప్‌ ఓపెనింగ్‌ అనంతరం హనీరోజ్‌ తిరిగి వెళ్తుండగా ఆమెతో సెల్ఫీల కోసం ఫ్యాన్స్‌ ఎగబడ్డారు.

ఇంకొంత మంది అయితే ఆమెపై పడిపోయారు కూడా. చివరికి ఎలాగోలా హనీరోజ్‌ కారెక్కి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు హనీరోజ్‌ ఫాలోయింగ్‌ చూసి ఆశ్చర్యపోతున్నారు.  


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement