shop opening
-
HYD: జ్యువెల్లరీ షాప్ ఓపెనింగ్‌లో రాశీఖన్నా సందడి (ఫొటోలు)
-
Shraddha Das: హైదరాబాద్‌లో సందడి చేసిన సినీ నటి శ్రద్ధాదాస్ (ఫొటోలు)
-
Keerthy Suresh Latest Pics: షాపింగ్‌మాల్‌లో కీర్తి సురేశ్ సందడి (ఫోటోలు)
-
షాపింగ్ మాల్ ప్రారంభానికి పూజా హెగ్డే.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
సినిమా అవకాశాలు అంతగా లేకున్నా ఇప్పటికీ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్ల లిస్ట్‌లో పూజాహెగ్డే ఉంది. అయితే ఈ అమ్మడు చేసిన కొన్ని సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో సినిమా అవకాశాలు తగ్గాయి. వీటి సంగతి పక్కన పెడితే పూజా అందానికి మాత్రం కుర్రకారు ఫిదా అవుతుంటారు. ఎప్పుడూ ఫిట్‌గా ఉంటూ తన అందంతో వారిని మెస్మరైజ్ చేస్తుంటుంది అ బ్యూటీ. కానీ ఇక్కడ ఒక మంచి కథ ఉన్న సినిమాతో మళ్లీ తెరపైన పూజాహెగ్డే కనిపిస్తే తప్పకుండా పూర్వవైభవం దక్కించుకుంటుంది. (ఇదీ చదవండి: ఆ పార్టీలో నాపై చెయి వేశాడు.. నిలదీస్తే బోరున ఏడ్చాడు: కస్తూరి) ప్రస్తుతం తన చేతిలో అంతగా సినిమా అవకాశాలు లేకపోవడంతో పూజా హెగ్డే పలు షాపింగ్ మాల్స్ ప్రారంభ కార్యక్రమాలతో బిజీగానే ఉంది. తాజాగ కడపలోని ఓ షాపింగ్ మాల్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఇంతకీ ఆ షాపు ఓపెనింగ్ కోసం వచ్చిన పూజ హెగ్డే తీసుకున్న పారితోషికం ఎంతో తెలిస్తే షాకవుతారు. అక్కడ కొన్ని గంటలు మాత్రమే ఆమె ఉన్నందుకు గాను అక్షరాలా రూ. 40 లక్షలు తీసుకున్నారని టాక్. (ఇదీ చదవండి: Pooja Hegde : కడపలో సందడి చేసిన బుట్టబొమ్మ (ఫొటోలు) కడప మాత్రమే కాదు మరెక్కడైన గానీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్య క్రమంలో పూజ వచ్చి రిబ్బన్ కట్ చేయాలంటే రూ. 40 లక్షలు పైగా తీసుకుంటుందని టాక్. దీంతో టాలీవుడ్లో ఆమె డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. కడపలో షాపింగ్ మాల్ ప్రారంభించిన పూజా హెగ్డే.. ఆ తర్వాత తను నటించిన సినిమా పాటలకు స్టెప్పులు వేసింది. దీంతో అక్కడికి వచ్చిన యువకులు కూడా డ్యాన్స్‌లు చేశారు. -
హనుమకొండ : వస్త్ర దుకాణం ప్రారంభోత్సవంలో పూజా హెగ్డే సందడి (ఫొటోలు)
-
వరంగల్ లో హనీ రోజ్ సందడి (ఫొటోలు)
-
హనీరోజ్ కోసం ఎగబడిన ఫ్యాన్స్.. ఫాలోయింగ్ మామూలుగా లేదుగా!
హనీరోజ్.. ఈమె సినీ కెరీర్ వీరసింహారెడ్డికి ముందు, ఆ తర్వాత అనేట్లుగా ఉంది. ఈ సినిమాలో హనీ రోజ్ పోషించిన మీనాక్షి పాత్రతో చాలామందికి కనెక్ట్ అయ్యింది. అందంతో పాటు నటనతనూ అలరించిన హనీరోజ్ ఈ సినిమా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ ఒక్క సినిమాతో తెలుగులో బోలెడంత పాపులారిటీని దక్కించుకుంది. దీంతో ఆమె క్రేజ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. తాజాగా కేరళలోని ఓ షోరూం ఓపెనింగ్‌కి హనీరోజ్ గెస్టుగా వెళ్లింది. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఫ్యాన్స్ వచ్చేశారు. హనీరోజ్‌ను చూడటానికి వచ్చిన జనాన్ని చూసి పోలీసులు, బౌన్సరలే షాకయ్యారు. అంతమంది జనాన్ని కంట్రోల్ చేయలేక నానా తిప్పలు పడ్డారు. ఇక షాప్ ఓపెనింగ్ అనంతరం హనీరోజ్ తిరిగి వెళ్తుండగా ఆమెతో సెల్ఫీల కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఇంకొంత మంది అయితే ఆమెపై పడిపోయారు కూడా. చివరికి ఎలాగోలా హనీరోజ్ కారెక్కి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు హనీరోజ్ ఫాలోయింగ్ చూసి ఆశ్చర్యపోతున్నారు. View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) -
భాగ్యనగరంలో సందడి చేసిన మహానటి(ఫోటోలు)
-
విజయవాడలో సందడి చేసిన సినీనటి శ్రియ, ఫరియా అబ్దుల్లా
-
హాయ్ రాజమండ్రి..
రాజమహేంద్రవరంలో రెజీనా సందడి దానవాయిపేట (రాజమహేంద్రవరం) : ప్రముఖ సినీ నటి రెజీనా కాసేండ్ర ఆదివారం రాజమహేంద్రవరంలో సందడి చేసింది. స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన నీరూస్ షోరూమ్‌ను ఆమె ప్రారంభించింది. జ్యోతి ప్రజ్వలన చేసి, షోరూమ్‌లోని పలు కౌంటర్ల వద్ద ఉంచిన ప్రత్యేక డిజైనర్ చీరలను తిలకించింది. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, నగరంలో ఇది నీరూస్ మొదటి షోరూమ్ అని, దీనిని సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారని అన్నారు. మహిళలు, చిన్నారులకు కావలసిన అన్ని రకాల డిజైనర్ వస్త్రాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. త్వరలోనే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏడు నూతన షోరూమ్‌లు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. కృష్ణవంశీ దర్శకత్వంలో ఒకటి, తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎండీ హరీష్‌కుమార్, డైరెక్టర్లు నీరూస్ కుమార్, అవినాష్‌కుమార్, సింగార్ సింధు, రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఎం.రాజ్‌కిషోర్, కాంట్రాక్టర్ తోట సుబ్బారావు, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ పిల్లి నిర్మల తదితరులు పాల్గొన్నారు. -
నగరంలో రెజీనా హల్చల్
-
ఎల్బీనగర్లో రకుల్
మన్సూరాబాద్: అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ గురువారం ఎల్బీనగర్లో సందడి చేశారు. లక్ష్మీ పద్మవంశీ హ్యాండ్లూమ్స్, టెక్ట్స్‌టైల్స్ మార్కెట్ (ఎల్పీటీ) ట్రస్ట్ ఆద్వర్యంలో నూతనంగా నిర్మించిన ఎల్పీటీ మార్కెట్‌ను ఆమెతో పాటు ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ ప్రారంభించారు. రకుల్ ప్రీత్‌సింగ్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. దీంతో జాతీయ ర హదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు జెల్ల బిక్షమ్, ఉపాధ్యక్షులు పద్మశ్రీ గజం గోవర్థన్, ప్రధాన కార్యదర్శి కొంగరి లక్ష్మీనారాయణ, కోశాధికారి చెరుపల్లి నర్సింహ, సంయుక్త కార్యదర్శి గండూరి శంకర్, శాశ్వత సభ్యులు గోశిక యాదగిరి, సభ్యులు జెల్ల నర్సింహ, పిల్లలమర్రి అశోక్, రాపోలు రవి, నామని అయోధ్య, జెల్ల గణేష్, గంజి కైలాసం, మహంకాళి శ్రీనివాస్, పున్న శ్రీశైలం, పెద్ది జగదీష్, కోమటి సత్యనారాయణ, పున్న రమణ విశ్వనాథ్, కోట కృష్ణ, తిరందాసు హనుమంతు, పున్న దశరథ తదితరులు పాల్గొన్నారు. -
ఇప్పుడు కూడా నేను తెలియని వారున్నారా!
స్టార్డమ్ వస్తే... కనీసం సరదాగా షాపింగ్ కూడా చేసే పరిస్థితి ఉండదు. అందుకే... స్టార్లందరూ సాధారణ జీవితం అనుభవించడానికి ఇతర దేశాలకు వెళుతుంటారు. అక్కడ యదేచ్ఛగా షాపింగులు గట్రా చేస్తుంటారు. ఎందుకంటే... అక్కడి జనాలు మనవాళ్లను గుర్తు పట్టరు కాబట్టి. అది కూడా ఓ విధంగా ఓ గొప్ప అనుభూతే. అయితే... ఇక్కడున్న మన జనాలే మన స్టార్లను గుర్తు పట్టకపోతే? అది నిజంగా అవమానం. అలాంటి పరిస్థితే ఇటీవల ప్రణీతకు ఎదురైంది. ఇటీవల హైదరాబాద్‌లోనే ఓ వ్యాపార సంస్థ ప్రారంభోత్సవానికి అతిథిగా వెళ్లి రిబ్బన్ కట్ చేసిందట ప్రణీత. అయితే... అక్కడి ప్రణీతను చూసిన చాలామంది ‘ఎవరు?’ అని చెవులు కొరుక్కున్నారట. ఇది విని షాక్ తినడం ప్రణీత వంతు అయ్యిందట. ‘‘ ‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్‌బస్టర్‌లో హీరోయిన్గా నటించిన, నేను కూడా తెలీని వారు ఉన్నారా!’’ అని సదరు సంస్థ యాజమాన్యంతో ఆశ్చర్యం వెలిబుచ్చిందట ప్రణీత. ఇది ముస్లిం ఏరియా అని, ఇక్కడ తెలుగు సినిమాలు చూడరని, బాలీవుడ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని, ఈ విషయంలో మీరు బాధపడాల్సిన అవసరం లేదని సంస్థ యాజమాన్యం సర్ది చెప్పడంతో ప్రణీత ఊపిరి పీల్చుకుందట. ఏదిఏమైనా ప్రణీతకు ఇది కాస్త చేదు అనుభవమే.