షాపింగ్‌ మాల్‌ ప్రారంభానికి పూజా హెగ్డే.. రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా..? | Pooja Hegde Remuneration For Shop Opening - Sakshi
Sakshi News home page

Pooja Hegde: కడపలో సందడి చేసిన పూజా హెగ్డే.. రెమ్యునరేషన్‌గా ఎంత ఇచ్చారంటే

Published Sat, Aug 26 2023 2:27 PM | Last Updated on Sat, Aug 26 2023 2:50 PM

Pooja Hegde Remuneration For Shop Opening - Sakshi

సినిమా అవకాశాలు అంతగా లేకున్నా ఇప్పటికీ టాలీవుడ్‌ ట్రెండింగ్‌ హీరోయిన్‌ల లిస్ట్‌లో  పూజాహెగ్డే ఉంది. అయితే ఈ అమ్మడు చేసిన కొన్ని సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో సినిమా అవకాశాలు తగ్గాయి. వీటి సంగతి పక్కన పెడితే పూజా అందానికి మాత్రం కుర్రకారు ఫిదా అవుతుంటారు. ఎప్పుడూ ఫిట్‌గా ఉంటూ తన అందంతో వారిని మెస్మరైజ్ చేస్తుంటుంది అ బ్యూటీ. కానీ ఇక్కడ ఒక మంచి కథ ఉన్న సినిమాతో మళ్లీ తెరపైన పూజాహెగ్డే కనిపిస్తే తప్పకుండా పూర్వవైభవం దక్కించుకుంటుంది. 

(ఇదీ  చదవండి: ఆ పార్టీలో నాపై చెయి వేశాడు.. నిలదీస్తే బోరున ఏడ్చాడు: కస్తూరి)

ప్రస్తుతం తన చేతిలో అంతగా  సినిమా అవకాశాలు లేకపోవడంతో పూజా హెగ్డే పలు షాపింగ్‌ మాల్స్‌ ప్రారంభ కార్యక్రమాలతో బిజీగానే ఉంది. తాజాగ కడపలోని ఓ షాపింగ్ మాల్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఇంతకీ ఆ షాపు ఓపెనింగ్‌ కోసం వచ్చిన పూజ హెగ్డే తీసుకున్న పారితోషికం ఎంతో తెలిస్తే షాకవుతారు. అక్కడ కొన్ని గంటలు మాత్రమే ఆమె ఉన్నందుకు గాను అక్షరాలా రూ. 40 లక్షలు తీసుకున్నారని టాక్‌.

(ఇదీ  చదవండి: Pooja Hegde : కడపలో సందడి చేసిన బుట్టబొమ్మ (ఫొటోలు)

కడప మాత్రమే కాదు మరెక్కడైన గానీ షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌ కార్య క్రమంలో పూజ వచ్చి రిబ్బన్‌ కట్‌ చేయాలంటే రూ. 40 లక్షలు పైగా తీసుకుంటుందని టాక్‌. దీంతో టాలీవుడ్‌లో ఆమె డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. కడపలో షాపింగ్‌ మాల్‌ ప్రారంభించిన పూజా హెగ్డే.. ఆ తర్వాత  తను నటించిన సినిమా పాటలకు స్టెప్పులు వేసింది. దీంతో అక్కడికి వచ్చిన యువకులు కూడా డ్యాన్స్‌లు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement