సమంతకు షాకిచ్చిన అభిమాని | Fan Shock To Samantha In Twitter | Sakshi
Sakshi News home page

సమంతకు షాకిచ్చిన అభిమాని

Published Mon, Jul 9 2018 8:12 AM | Last Updated on Mon, Jul 9 2018 12:22 PM

Fan Shock To Samantha In Twitter - Sakshi

తమిళసినిమా: నటి సమంత గురించి ఏదో ఒక వార్త మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంటుంది. ఆ మధ్య నటుడు నాగచైతన్యతో ప్రేమ అనే ప్రచారం హోరెత్తించారు. ఆ జంట ప్రేమపెళ్లికి దారి తీయడంతో ఇకపై సమంత నటిస్తుందా? అందుకు నాగచైతన్య కుటుంబం అంగీకరిస్తుందా, అనే సందేహాలను ప్రచారం చేశాయి.పెళ్‌లైన మూడో రోజునే సమంత షూటింగ్‌కు సిద్ధం అయితే అదో వార్త అయ్యింది. కాయలున్న చెట్టుకే రాళ్లన్న సామెతలా ఫామ్‌లో ఉన్న సమంత గురించి రకరకాల వదంతులు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకటి సమంత నటనకు గుడ్‌బై చెప్పనున్నారన్నది ఒకటి. అయితే ఇలాంటి వదంతులను ఎంజాయ్‌ చేస్తూ తన పని తాను చేసుకుపోతున్న సమంత కెరీర్‌ పరంగా విజయబాటలో దూసుకుపోతున్నారు. ద్విభాషా చిత్రం యూటర్న్‌తో పాటు తమిళంలో విజయ్‌సేతుపతికి జంటగా నటిస్తున్న సూపర్‌ డీలక్స్, తెలుగులో తన భర్త నాగచైతన్యతో ఒక చిత్రం చేస్తున్నారు. శివకార్తికేయన్‌తో నటించిన సీమరాజా చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉంది.

ఇంత బిజీగా ఉన్న సమంత సమయం దొరికినప్పుడల్లా ట్విట్టర్‌లో తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటుంటారు. ట్విట్టర్‌లో సమంతకు అభిమానుల ఫాలోయింగ్‌ అధికస్థాయిలోనే ఉంది. తంటా ఎక్కడొచ్చిందంటే స్నేహితులు, సినిమా వాళ్ల ప్రశ్నలకే తప్ప సమంత అభిమానులకు బదులివ్వడం లేదట. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వీరాభిమాని కాస్త ఘాటుగానే ప్రశ్నించాడు. అదేమిటంటే తాను ఇప్పటి వరకూ వేలకు పైగా మీకు ట్వీట్‌ చేశానని, మీరు మాత్రం ఒక్కసారి కూడా బదులివ్వలేదని నిష్టూరమాడాడు. అంతే కాదు అయిన మీపై అభిమానం ఒక్క శాతం కూడా తగ్గలేదంటూ,  ధైర్యంగా ఐలవ్యూ అని కూడా చెప్పేశాడు. దీంతో షాక్‌ అవడం సమంత వంతైంది. ఆ తరువాత తేరుకుని తనకు వెయ్యికి పైగా మెసేజ్‌లు చేసినందుకు కృతజ్ఞతలు అని ఆ అభిమానికి బదులిచ్చారు. అంతే తనకు సమంత ట్విట్‌ చేయడంతో ఆ అభిమాని ఆనందంతో ఎగిరి గంతేశాడు. నేను జయించాను. ఎంతో సాధించాన న్న ఫీలింగ్‌ కలుగుతోంది అంటూ ఫుల్‌ జోష్‌లో మునిగిపోయాడు. అభిమానం అంటే ఇదే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement