ఈ బర్రె ఏ హీరో ఫ్యానో తెలుసా? | People have fan following, I have bull following, says Akshay Kumar | Sakshi
Sakshi News home page

ఈ బర్రె ఏ హీరో ఫ్యానో తెలుసా?

Published Thu, Aug 11 2016 2:49 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM

People have fan following, I have bull following, says Akshay Kumar

హీరోలకు ఫ్యాన్స్‌ ఉండటం సహజమే. కొందరు హీరోలకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. మరికొందరు హీరోలంటే అమ్మాయిలు పడిచస్తారు. ఇంకొందరి సినిమాలంటే ఫ్యామిలీ ఆడియెన్స్ క్యూ కడతారు. ఇలా చెప్పుకుంటూపోతే ఫ్యాన్‌ ఫాలోయింగ్‌లోనూ రకాలు ఉంటాయి. కానీ ఓ స్టార్‌ హీరోను బర్రె ఫాలో కావడం ఎప్పుడైనా చూశారా? లేదు కదా! కానీ బాలీవుడ్‌ యాక్షన్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ అంటే బర్రెలు పడి చస్తాయట. ఆయనే ఈ విషయాన్ని ట్విట్టర్‌లో తెలిపారు. సహజంగా అందరు హీరోలకు మనుష్యులు అభిమానులుగా ఉంటారు. కానీ వెరైటీగా నాకు బర్రెలు అభిమానులైపోయాయి. నేను ఏడికిపోతే ఆడికి వచ్చేస్తున్నాయి. ప్రేమను నేను స్వాగతిస్తున్నానంటూ తన కారు వెంట ఫాలో అవుతున్న బర్రెలతో సెల్ఫీ దిగి మరీ ట్విట్టర్‌లో పెట్టాడు అక్కీ.

ఆ మధ్య ఓ పాకిస్థాన్‌ జర్నలిస్టు బర్రెను ఇంటర్వ్యూ చేసిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. అదేవిధంగా మన అక్కీ కూడా బర్రెల నాడీ పట్టేసినట్టున్నాడు. ఓ అభిమాన బర్రెతో ఆయన నవ్వుతూ సెల్ఫీ దిగుతుండగా.. ఆ బర్రె ఆయనను ఎంత ఆసక్తిగా చూస్తుందో చూడండి. నిజమే మనమిప్పుడు ఒప్పుకోవచ్చు ఈ బర్రె డెఫినెట్‌గా అక్కీ ఫ్యానే అయి ఉంటుందని అభిమానులు ఎక్కసెక్కమాడుస్తున్నారు!

అన్నట్టు మన అక్కీ భాయ్‌ లేటెస్ట్ సినిమా 'రుస్తుం' ఈ శుక్రవారమే వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్‌లో బిజిగా ఉన్న అక్షయ్‌కుమార్ ట్విట్టర్‌ నిండా ఈ సినిమా కబుర్లతో నింపేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement