పన్నెండు గంటల రొమాన్స్‌కి నాలుగు గంటల ప్రాక్టీస్! | Katrina Kaif, Aditya Roy Kapur took over 12 hours to get intimate scene right | Sakshi
Sakshi News home page

పన్నెండు గంటల రొమాన్స్‌కి నాలుగు గంటల ప్రాక్టీస్!

Published Sat, May 2 2015 11:47 PM | Last Updated on Sun, Sep 3 2017 1:18 AM

పన్నెండు గంటల రొమాన్స్‌కి నాలుగు గంటల ప్రాక్టీస్!

పన్నెండు గంటల రొమాన్స్‌కి నాలుగు గంటల ప్రాక్టీస్!

రొమాన్స్ చేయడానికిప్రాక్టీస్ చేయాలా? మనసులో ప్రేమ ఉంటే రొమాన్స్ దానంతట అది పుట్టుకొచ్చేయదూ. మరి.. సినిమాల్లో రొమాన్స్ చేసే నాయకా నాయికలందరూ ప్రేమికులు కాదు కదా! అంత అద్భుతంగా రొమాంటిక్ సీన్స్ ఎలా చేస్తారనుకుంటున్నారా? ఆ మూడ్‌లోకి వెళ్లడానికి వాళ్లు మానసికంగా చాలా ప్రిపేర్ అవుతారు. అలా ప్రిపేర్ అయ్యి, కత్రినా కైఫ్ ఇప్పటివరకూ బోల్డన్ని రొమాంటిక్ సీన్స్‌లో నటించారు. కానీ, ఈసారి మాత్రం ఎంత ప్రిపేర్ అయినా రొమాన్స్ చేయలేకపోయారు.
 
 ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరితో రొమాన్స్ చేయాలనుకున్నారు? ఆ సీన్‌లో ఎందుకు లీనం కాలేకపోయారు? వాస్తవానికి ఆమె మాత్రమే కాదు.. ఆ చిత్రకథానాయకుడు కూడా ఆమెతోరొమాన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. యువనటుడు ఆదిత్య రాయ్ కపూర్ సరసన కత్రినా కైఫ్ ‘ఫిటూర్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది రొమాంటిక్ మూవీ. ఆదిత్య, కత్రినా మధ్య బోల్డన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నాయట. ఇటీవల కాశ్మీర్‌లో ఆదిత్య, కత్రినా పాల్గొనగా ఓ పెదవి ముద్దు సన్నివేశం చిత్రీకరించారు. ఆ సీన్ చేయడానికి ఆదిత్య, కత్రినా తెగ ఇబ్బందిపడ్డారట. కాశ్మీర్ తర్వాత ముంబయ్‌లో ఈ ఇద్దరి మీద ఓ రొమాంటిక్ సీన్ తీయడానికి చిత్రదర్శకుడు అభిషేక్ కపూర్ ప్లాన్ చేశారు.
 
  ఈ శృంగార సన్నివేశం చాలా ఘాటుగా ఉంటుందట. అందుకని, ఓ నాలుగు గంటల పాటు కత్రినా, ఆదిత్య ప్రాక్టీస్ చేశారు. కానీ, అంతా వృథాయే. టేక్‌ల మీద టేక్‌లు తీసుకున్నారు. అలా పన్నెండు గంటలు గడిచిపోయింది. ఈ పన్నెండు గంటల్లో లెక్కలేనన్ని సార్లు వాళ్లు రొమాన్స్ చేసినా, అది పేలవంగా అనిపించిందట. పన్నెండు గంటల తర్వాత చేసిన రొమాన్స్ ఫర్వాలేదనిపించి చివరికి దర్శకుడు ఓకే చేశారు. ఇంతకీ ఈ ఇద్దరూ ఎందుకింత ఇబ్బందిపడ్డారు? ఆదిత్య అప్ కమింగ్ హీరో కాబట్టి, కత్రినాలాంటి స్టార్‌తో రొమాన్స్‌కి కంగారు పడి ఉంటారు. మరి.. కత్రినా సంగతేంటి? రణబీర్ కపూర్‌తో త్వరలో వివాహం అనే వార్త వస్తోంది కదా.. ఈ సమయంలో ఇలాంటి రొమాంటిక్ సీన్ ఏంటి? అని ఇబ్బందిపడి ఉంటారా? ఏమో... కత్రినాకే తెలియాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement