Romantic Scenes
-
అలాంటి సన్నివేశాల్లో నటించడం కష్టం
జయాపజయాలు మన చేతుల్లో ఉండవు. ఆ విషయాన్ని పక్కన పెడితే నటి అంజలి చేసే పాత్రలన్నీ కచ్చితంగా వైవిధ్యంగా ఉంటున్నాయి. ఈమె కథానాయకిగా నటించినా, ఐటమ్ సాంగ్‌లో నటించినా తనదైన ముద్ర వేసుకుంటున్నారు. తమిళంలో కట్రదు తమిళ్, అంగాడి తెరు, అరవాన్, ఇరైవి, తరమణి వంటి చిత్రాల్లో అంజలి నటనే ఇందుకు నిదర్శనం. అలాగే తెలుగులోనూ గీతాంజలి, సీతమ్మవాకిట్లో సిరిమల్లే చెట్టు వంటి చిత్రాలు అంజలిలోని నటనకు అద్దం పట్టాయి. కాగా ఈమె తాజాగా నటించిన ఏళు కడల్ ఏళు మలై త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి అవార్డులు, ప్రశంసలను అందుకుంది. అలాగే తెలుగులో శంకర్ దర్శకత్వం వహిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రంలో రామ్‌చరణ్‌కు జంటగా నటించారు. కాగా అంజలి తెలుగులో నటించిన బహిష్కరణ వెబ్ సిరీస్ ఇటీవలే ఓటీటీలో విడుదలైంది. ఇందులో ఈమె బెడ్రూమ్ సన్నివేశాల్లో, సహా నటుడితో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం చర్చనీయాంశంగా మారింది. దీని గురించి అంజలి ఒక భేటీలో పేర్కొంటూ రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం కష్టతరం అన్నారు. చిత్రం యూనిట్లో పలువురు మగవారి మధ్య అలాంటి సన్నివేశాల్లో నటించాల్సి ఉంటుందని, ఆ పరిస్థితుల్లో నటించడం కష్టం అని అంజలి పేర్కొన్నారు. -
కథ డిమాండ్ చేస్తే అలాంటి సన్నివేశాల్లోనూ నటిస్తా : మలయాళ బ్యూటీ
‘‘నేను మలయాళం, తెలుగు, తమిళ చిత్రాల్లో నటించాను. అయితే ఇప్పటివరకు ముద్దు సన్నివేశాలు చేయలేదు. కథ డిమాండ్ చేస్తే గ్లామర్ పాత్రలు, ముద్దు సన్నివేశాలు చేసేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’’ అంటున్నారు హీరోయిన్ మాళవికా మీనన్. అందం, అభినయంతో దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఈ మలయాళ బ్యూటీ. తెలుగులో మాళవికా మీనన్ ‘లవ్ కే రన్’ (2016), ‘అమ్మాయిలు అంతే అదో టైపు’ (2018) వంటి చిత్రాల్లో నటించారు. అయితే పలు కారణాల వల్ల ఆ సినిమాలు ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. తాజాగా ఆమె నటించిన మలయాళ సినిమాలు ‘తంగమణి, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ కొచ్చి’ ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ– ‘‘నేను మొదటిసారి నటించిన మలయాళ చిత్రం ‘నిద్ర’ (2011). అందులో హీరో చెల్లెలి పాత్ర చేశాను. అప్పుడు నా వయసు 14 ఏళ్లు. ‘916’ (2012) అనే మలయాళ మూవీ ద్వారా కథానాయికగా పరిచయమయ్యాను. మలయాళ సినిమాల్లో గ్లామర్ పాత్రలకు అవకాశం ఉండదు. అయితే తెలుగు, తమిళ భాషల్లో ఆ అవకాశాలు బాగుంటాయి... ఈ రెండు భాషల్లోనూ గ్లామరస్ హీరోయిన్గా నటించడానికి స్కోప్ ఉంటుంది’’ అన్నారు. -
Tamannaah: రొమాంటిక్ సన్నివేశాల్లో హీరోయిన్ల కంటే హీరోలకే వణుకు
నటి తమన్నా మరోసారి వార్తల్లోకెక్కింది. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఈ అమ్మడి పేరే మారుమోగుతోంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు ఆ తర్వాత కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన తమన్నా భాటియా ఈ రెండు భాషల్లోనూ స్టార్ హీరోలతో జతకట్టి క్రేజీ నటి అయ్యింది. అయితే తెలుగులో కొంచెం ఎక్కువగా పేరు తెచ్చుకుంది. మొదట్లో గ్లామర్ పాత్రలకే పరిమితమైన ఈ మిల్కీబ్యూటీ తర్వాత అభినయానికి ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటించి తానేంటో నిరూపించుకుంది. అయితే బాహుబలి, సైరా వంటి కొన్ని చిత్రాలు ఈమె నటన సత్తాను చాటిన చిత్రాలు పెద్దగా సక్సెస్ కాలేదు. అందుకు ఉదాహరణ హిందీలో నటించిన బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బి వంటి చిత్రాలే. అయితే ఈమె అందాల ఆరబోసిన చిత్రాలు మాత్రం బాగానే సక్సెస్ అయ్యాయి. ఇక ఐటెం సాంగ్స్‌లో తమన్నా ఇరగదీసింది. హీరోలతో సన్నిహితంగా నటించడం గురించి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూ పేర్కొంటూ ఇప్పుడు చిత్రాల్లో అంతరంగిక సన్నివేశాలను ఎవరు ఇష్టపడడం లేదని చెప్పుకొచ్చింది. అయినా నిజం చెప్పాలంటే సన్నిహిత సన్నివేశాల్లో నటించేటప్పుడు హీరోయిన్ల కంటే హీరోలకే వణుకు పుడుతుందని, ఈ విషయాన్ని తాను చాలాసార్లు గమనించానని పేర్కొంది. అమ్మాయిలతో అలా నటిస్తున్నామని భావించడమే వారిలో దడకు కారణం కావచ్చునంది. ప్రస్తుతం తమన్నా తెలుగులో చిరంజీవికి జంటగా భోళాశంకర్‌తో పాటు హిందీలో ఒక చిత్రం చేస్తోంది. ఆ మధ్య రజనీకాంత్ సరసన జైలర్ చిత్రంలో నటించనుందనే ప్రచారం జరిగినా అది వాస్తవం కాలేదు. కాగా ప్రస్తుతం ఈమె తన బాయ్‌ఫ్రెండ్ విజయవర్మతో షికార్లు కొడుతోంది. ఈ జంట త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు ప్రచారం జోరుగానే సాగుతోంది. చదవండి: (పులి కడుపున పులిబిడ్డే పుడుతుంది.. ఆ కుటుంబం విషయంలో ఇది అక్షరసత్యం) -
రొమాంటిక్ సీన్స్‌లో హీరోల ప్రవర్తన అలా ఉంటుంది: తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు
మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీ మూవీతో తెలుగు తెరపై మెరిసిన ఈ పంజాబీ భామ తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక డాన్స్‌లోనూ హీరోలకు పోటీ పడుతూ స్టెప్పులేస్తుంది. ప్రస్తుతం హీరోయిన్గా పలు చిత్రాలు చేస్తూ వీలు చిక్కినపడల్లా స్పెషల్ సాంగ్స్‌తో అలరిస్తోంది. రీసెంట్గా గుర్తుందా శీతాకాలం మూవీతో అలరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్లో వరుస చిత్రాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రీసెంట్గా తమన్నా ఓ బాలీవుడ్ మీడియాతో ముచ్చటింది. ఈ సందర్భంగా రొమాంటిక్ సీన్లతో హీరోల బిహెవియర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు హీరోలు బాగా ఎంజాయ్ చేస్తారని అందరు అనుకుంటారు. కానీ అది తప్పు. చాలామంది హీరోలు ఈ సీన్స్ చేసేందుకు ఇష్టపడరు. షూటింగ్ సమయంలో హీరోయిన్లు ఏం అనుకుంటారోనని చాలా టెన్షన్ పడుతుంటారు. ముఖ్యంగా మోహమాటం ఎక్కువగా ఉన్న హీరోలు, స్టార్ హీరోలు అయితే ఈ సీన్స్ చేసేటప్పుడు కనీసం మాట్లాడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. మూవీ షూటింగ్ మొత్తంలో హీరోలు ఇబ్బంది పడేది సన్నిహిత సీన్లలోనే. అసలు చాలామంది హీరోలు.. హీరోయిన్లతో క్లోజ్‌గా ఉండే సన్నివేశాలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపరు’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా తమన్నా ప్రస్తుతం తెలుగులో చిరంజీవి భోళా శంకర్ మూవీతో బిజీగా ఉంది. చదవండి: సూర్య ఇన్ని పాత్రల్లో నటిస్తున్నారా?.. ఇది పెద్ద రికార్డే..! ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ బట్టర్ఫ్లై మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.. -
కండిషన్స్ ఆప్లై!
కుర్ర హీరోలతో సీనియర్ హీరోయిన్లు రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం బాలీవుడ్లో కొత్తేమీ కాదు. ‘ఏ దిల్ హై ముష్కిల్’ చిత్రంలో రణబీర్‌కపూర్‌తో ఐశ్వర్యారాయ్,‘కి అండ్ కా’లో అర్జున్‌కపూర్‌తో కరీనా కపూర్ నటించారు. ఇటీవల ‘విఐపి–2’లో నటించిన కాజోల్‌తో కుర్ర హీరోలతో సీనియర్ నాయికలు రొమాంటిక్ సినిమాలు చేయడంపై మీ అభిప్రాయం ఏంటి? అని అడిగితే ‘‘ఈ రోజుల్లో డిఫరెంట్ సినిమాలు వస్తున్నాయి. దర్శకుల విజన్ కూడా మారుతోంది. కుర్ర హీరోలతో రొమాంటిక్ సీన్స్ చేయడాన్ని తప్పనడంలేదు. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే నాకేం అభ్యంతరం లేదు. కానీ, కొన్ని కండిషన్స్. నాతో నటించబోయే కుర్ర హీరో మ్యాన్లీగా ఉండాలి. అతని ఆలోచనల్లో, యాక్టింగ్‌లో పరిణితి చెంది ఉండాలి. అలాంటి హీరో సరసన ఛాన్స్ వస్తే అప్పుడు ఆలోచిస్తాను’’ అన్నారామె. -
అతనితో ముద్దుకి సిగ్గుపడలేదు!
‘‘ఆర్క్ లైట్స్ వేడి.. చుట్టూ ఓ వంద మంది ఉన్నప్పుడు చేసే సీన్ బాగా రావాలనే ఆలోచన తప్ప పర్సనల్ ఫీలింగ్స్ ఏవీ ఉండవు. ముద్దు సీన్ చేసినా అంతే. స్క్రీన్‌పై ముద్దు సీన్ పండాలనే ఆకాంక్ష తప్ప అందరూ చూస్తున్నారనే ఆలోచనే ఉండదు’’ అంటున్నారు పూజా హెగ్డే. ‘మొహంజొదారో’లో హృతిక్ రోషన్, పూజా హెగ్డే జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్‌తో పాటు లిప్‌లాక్ కూడా ఉంది. ఆ ముద్దు ముచ్చట చెప్పమని అడిగితే.. ‘‘అప్పటికే చాలా రోజుల నుంచి షూటింగ్ చేస్తుండడం వలన నేనూ, హృతిక్ స్నేహితులయ్యాం. దాన్నో ముద్దుగా చూడలేదు. ఓ మామూలు సీన్ చేసినట్లు చేశాం. ఎప్పుడు ముద్దు పెట్టుకోవడం ప్రారంభించామో.. ఎప్పుడు ముగించామో తెలియలేదు. నేనేం సిగ్గుపడలేదు. బెస్ట్ ఆన్‌స్క్రీన్ కిస్లలో ఇది ఒకటిగా నిలుస్తుంది’’ అని పూజా చెప్పారు. -
అప్పుడు ఇష్టం... ఇప్పుడు అయిష్టం!
రియల్ లైఫ్ లవర్స్ జంటగా నటిస్తే, రీల్‌పై వాళ్ల కెమిస్ట్రీ అదిరిపోతుంది. అందుకు ఓ ఉదాహరణ రణబీర్ కపూర్, కత్రినా కైఫ్. ఈ ఇద్దరూ లవ్‌లో ఉన్నప్పుడు చేసిన ‘అజబ్ ప్రేమ్‌కీ గజబ్ కహానీ’లో రొమాంటిక్ సీన్స్‌లో జీవించారు. అప్పుడు ఇలాంటి సీన్స్‌లో ఇష్టంగా నటించిన ఈ జంట ఇప్పుడు మాత్రం అయిష్టంగా ఉన్నారట. విడిపోయాక ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం ‘జగ్గా జాసూస్’. అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం అంగీకరించినప్పుడు రణబీర్, కత్రినా ప్రేమలోనే ఉన్నారు. షూటింగ్ కాస్త అయ్యాక విడిపోయారు. దాంతో ఇప్పుడు రొమాంటిక్ సీన్స్‌లో నటించడానికి ఇష్టపడటంలేదట. మామూలుగా రిస్కీ ఫైట్ సీన్స్‌ని డూప్స్‌తో చేయిస్తారని అందరికీ తెలుసు. కానీ, ఈ చిత్రంలోని రొమాంటిక్ సీన్స్‌ని డూప్‌తో తీస్తున్నారట. రణబీర్, కత్రినా ఈ సన్నివేశాల్లో నటించడానికి ఇష్టపడకపోవడంతో, చేసేదేం లేక ఈ విధంగా నకిలీలతో కానిచ్చేస్తున్నారట. ఒకవేళ నకిలీలు కనుక కెమిస్ట్రీ పండిస్తే.. అప్పుడు ప్రాబ్లమ్ లేదు. ఆ సంగతలా ఉంచితే.. దీపికా పదుకొనే నుంచి విడిపోయాక ఆమెతో కలిసి రణబీర్ నటించారు. మరి.. ఇప్పుడు కత్రినా విషయంలో ఈ చాక్లెట్ బోయ్ ఎందుకు అంత పట్టుబడుతున్నారో? అలాగే.. సినిమా కోసం కూడా రణబీర్‌తో రొమాన్స్ నటించడానికి కత్రినా ఎందుకు అంత ఇదవుతున్నారో?.. బలమైన కారణం ఏదో ఉండే ఉంటుంది. -
ఖస్సుమన్న కత్రినా!
రొమాంటిక్ సీన్స్‌లో నటించడం కత్రినా కైఫ్‌కి కొత్త కాదు. అవలీలగా చేసేస్తారు. అయితే ఒకే టేక్‌లో ఓకే అయిపోవాలనుకుంటారు. దర్శకుడు రీటేక్ చేద్దామంటే ఆమెకు అస్సలు నచ్చదట. చేయనని కరాఖండిగా చెప్పేస్తారట. ‘ఫితూర్’ షూటింగ్ లొకేషన్లో అలానే చెప్పారట. ఆదిత్యారాయ్ కపూర్, కత్రినా జంటగా అభిషేక్ కపూర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. కత్రినా కన్నా ఆదిత్యారాయ్ కపూర్ జూనియర్. దాంతో రొమాంటిక్ సన్నివేశంలో చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిపడ్డారట. సీన్ తీసిన తర్వాత మానిటర్లో చూసి, ‘సరిగ్గా లేదు.. మళ్లీ చేద్దాం’ అని దర్శకుడు అన్నారట. ఏ మాట వింటే కత్రినాకు మంటగా ఉంటుందో అదే వినపడింది. అంతే... అభిషేక్ కపూర్ మీద విరుచుకుపడ్డారని సమాచారం. అభిషేక్ కూడా కత్రినాతో దీటుగా గొడవపడ్డారట. షూటింగ్ ఆగిపోయేలా ఉండడంతో, నిర్మాత సిద్ధార్థ్‌రాయ్ కపూర్ రంగంలోకి దిగి, కత్రినాను రీటేక్‌కు ఒప్పించారట. -
పన్నెండు గంటల రొమాన్స్‌కి నాలుగు గంటల ప్రాక్టీస్!
రొమాన్స్ చేయడానికిప్రాక్టీస్ చేయాలా? మనసులో ప్రేమ ఉంటే రొమాన్స్ దానంతట అది పుట్టుకొచ్చేయదూ. మరి.. సినిమాల్లో రొమాన్స్ చేసే నాయకా నాయికలందరూ ప్రేమికులు కాదు కదా! అంత అద్భుతంగా రొమాంటిక్ సీన్స్ ఎలా చేస్తారనుకుంటున్నారా? ఆ మూడ్‌లోకి వెళ్లడానికి వాళ్లు మానసికంగా చాలా ప్రిపేర్ అవుతారు. అలా ప్రిపేర్ అయ్యి, కత్రినా కైఫ్ ఇప్పటివరకూ బోల్డన్ని రొమాంటిక్ సీన్స్‌లో నటించారు. కానీ, ఈసారి మాత్రం ఎంత ప్రిపేర్ అయినా రొమాన్స్ చేయలేకపోయారు. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరితో రొమాన్స్ చేయాలనుకున్నారు? ఆ సీన్లో ఎందుకు లీనం కాలేకపోయారు? వాస్తవానికి ఆమె మాత్రమే కాదు.. ఆ చిత్రకథానాయకుడు కూడా ఆమెతోరొమాన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. యువనటుడు ఆదిత్య రాయ్ కపూర్ సరసన కత్రినా కైఫ్ ‘ఫిటూర్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది రొమాంటిక్ మూవీ. ఆదిత్య, కత్రినా మధ్య బోల్డన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నాయట. ఇటీవల కాశ్మీర్లో ఆదిత్య, కత్రినా పాల్గొనగా ఓ పెదవి ముద్దు సన్నివేశం చిత్రీకరించారు. ఆ సీన్ చేయడానికి ఆదిత్య, కత్రినా తెగ ఇబ్బందిపడ్డారట. కాశ్మీర్ తర్వాత ముంబయ్‌లో ఈ ఇద్దరి మీద ఓ రొమాంటిక్ సీన్ తీయడానికి చిత్రదర్శకుడు అభిషేక్ కపూర్ ప్లాన్ చేశారు. ఈ శృంగార సన్నివేశం చాలా ఘాటుగా ఉంటుందట. అందుకని, ఓ నాలుగు గంటల పాటు కత్రినా, ఆదిత్య ప్రాక్టీస్ చేశారు. కానీ, అంతా వృథాయే. టేక్‌ల మీద టేక్‌లు తీసుకున్నారు. అలా పన్నెండు గంటలు గడిచిపోయింది. ఈ పన్నెండు గంటల్లో లెక్కలేనన్ని సార్లు వాళ్లు రొమాన్స్ చేసినా, అది పేలవంగా అనిపించిందట. పన్నెండు గంటల తర్వాత చేసిన రొమాన్స్ ఫర్వాలేదనిపించి చివరికి దర్శకుడు ఓకే చేశారు. ఇంతకీ ఈ ఇద్దరూ ఎందుకింత ఇబ్బందిపడ్డారు? ఆదిత్య అప్ కమింగ్ హీరో కాబట్టి, కత్రినాలాంటి స్టార్‌తో రొమాన్స్‌కి కంగారు పడి ఉంటారు. మరి.. కత్రినా సంగతేంటి? రణబీర్ కపూర్‌తో త్వరలో వివాహం అనే వార్త వస్తోంది కదా.. ఈ సమయంలో ఇలాంటి రొమాంటిక్ సీన్ ఏంటి? అని ఇబ్బందిపడి ఉంటారా? ఏమో... కత్రినాకే తెలియాలి. -
పెళ్లయితే రొమాన్స్ చేయకూడదా!?
‘‘కథానాయికలకు ముప్ఫయ్, నలభై ఏళ్లు వస్తే చాలు... పరిణతి చెందిన పాత్రలే ఇస్తారు. అక్క, వదిన పాత్రలకు పరిమితం చేసేస్తారు. అదే హాలీవుడ్లో అయితే ఎంచక్కా రొమాంటిక్ సినిమాలకు కూడా అవకాశం ఇస్తారు’’ అని తాప్సీ అన్నారు. ఇటీవల ఓ సందర్భంలో కథానాయికల కెరీర్ దీర్ఘకాలం ఉండదు కదా? అనే ప్రశ్న తాప్సీ ముందుంచితే -‘‘మన భారతీయ సినిమాల్లో ఉన్న మైనస్ అదేనండి. పెళ్లయితే చాలు కథానాయికగా పనికి రారని ఫిక్స్ అయిపోతారు. పెళ్లయినవాళ్లు రొమాంటిక్ సీన్స్‌కి బాగుండరని కూడా అనుకుంటారు. పెళ్లయినంత మాత్రాన రొమాన్స్ చేయకూడదా!? ఒకవేళ పెళ్లయిన తారలు ముద్దు సన్నివేశాల్లో నటించడానికి ఇష్టపడకపోతే అది వాళ్ల సొంత నిర్ణయం. దాన్ని నేను గౌరవిస్తాను. కానీ, ఎలాంటి ఆక్షేపణ లేకుండా నటించడానికి సుముఖంగా ఉన్న తారలను పక్కన పెట్టాలనుకోవడం ఏంటి? పెళ్ల యినంత మాత్రాన ప్రతిభ తగ్గిపోతుందా?’’ అన్నారు ఆవేశంగా. ఇంతకీ పెళ్లి చేసుకున్న తర్వాత మీరు ఇదే రంగంలోనే ఉండాలనుకుంటున్నారా? అనడిగితే -‘‘చివరి శ్వాస వరకూ నా జీవితం సినిమా రంగంలోనే అని నేను చెప్పను. ఒకానొక దశలో నేను నటనకు ఫుల్స్టాప్ పెట్టేస్తా. పెళ్లి చేసుకుని హాయిగా జీవించాలనుకుంటున్నా. కానీ, సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తిని మాత్రం పెళ్లి చేసుకోవాలనుకోవడంలేదు. ఎందుకంటే, సినిమా వాతావరణానికి భిన్నమైన జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటున్నా’’ అని తాప్సీ స్పష్టం చేశారు.