మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీ మూవీతో తెలుగు తెరపై మెరిసిన ఈ పంజాబీ భామ తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక డాన్స్‌లోనూ హీరోలకు పోటీ పడుతూ స్టెప్పులేస్తుంది. ప్రస్తుతం హీరోయిన్‌గా పలు చిత్రాలు చేస్తూ వీలు చిక్కినపడల్లా స్పెషల్ సాంగ్స్‌తో అలరిస్తోంది. రీసెంట్‌గా గుర్తుందా శీతాకాలం మూవీతో అలరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస చిత్రాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా తమన్నా ఓ బాలీవుడ్ మీడియాతో ముచ్చటింది. ఈ సందర్భంగా రొమాంటిక్ సీన్లతో హీరోల బిహెవియర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు హీరోలు బాగా ఎంజాయ్ చేస్తారని అందరు అనుకుంటారు. కానీ అది తప్పు. చాలామంది హీరోలు ఈ సీన్స్ చేసేందుకు ఇష్టపడరు. షూటింగ్ సమయంలో హీరోయిన్లు ఏం అనుకుంటారోనని చాలా టెన్షన్ పడుతుంటారు. ముఖ్యంగా మోహమాటం ఎక్కువగా ఉన్న హీరోలు, స్టార్ హీరోలు అయితే ఈ సీన్స్ చేసేటప్పుడు కనీసం మాట్లాడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. మూవీ షూటింగ్ మొత్తంలో హీరోలు ఇబ్బంది పడేది సన్నిహిత సీన్లలోనే. అసలు చాలామంది హీరోలు.. హీరోయిన్లతో క్లోజ్‌గా ఉండే సన్నివేశాలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపరు’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా తమన్నా ప్రస్తుతం తెలుగులో చిరంజీవి భోళా శంకర్ మూవీతో బిజీగా ఉంది.
చదవండి:
సూర్య ఇన్ని పాత్రల్లో నటిస్తున్నారా?.. ఇది పెద్ద రికార్డే..!
ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ బట్టర్‌ఫ్లై మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Comments
Please login to add a commentAdd a comment