
బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ, హీరోయిన్ తమన్నా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు కొన్నాళ్లుగా వస్తున్న సంగతి తెలిసిందే! ఈ విషయంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించింది తమన్నా. 'మేమిద్దరం(విజయ్‌ను ఉద్దేశిస్తూ..) కలిసి ఓ సినిమా చేశాం. అప్పటినుంచి మా రిలేషన్‌షిప్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. వీటన్నింటిపై స్పందించాల్సిన అవసరం నాకు లేదు.
ఈ అంశంపై నేను ఇంతకుమించి చెప్పాల్సిన విషయాలు కూడా ఏమీ లేవు. అయినా హీరోయిన్స్ గురించి ఇలాంటి అవాస్తవాలు ఎలా తెరపైకి వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. డాక్టర్ నుంచి బిజినెస్‌మెన్ వరకు నాకు తెలియకుండానే కొందరు ఇప్పటికే నా పెళ్లి చాలాసార్లు చేశారు(వ్యంగ్యంగా)' అని చెప్పుకొచ్చింది. ఇకపోతే ప్రస్తుతం తమన్నా రజనీకాంత్ జైలర్, చిరంజీవి భోళా శంకర్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే!
Comments
Please login to add a commentAdd a comment