కథ డిమాండ్‌ చేస్తే అలాంటి సన్నివేశాల్లోనూ నటిస్తా : మలయాళ బ్యూటీ | Malavika Menon says she is ready to do any character | Sakshi
Sakshi News home page

Malavika Menon: కథ డిమాండ్‌ చేస్తే అలాంటి సన్నివేశాల్లోనూ నటిస్తా

Published Fri, Jun 28 2024 10:52 AM | Last Updated on Fri, Jun 28 2024 2:28 PM

Malavika Menon says she is ready to do any character

‘‘నేను మలయాళం, తెలుగు, తమిళ చిత్రాల్లో నటించాను. అయితే ఇప్పటివరకు ముద్దు సన్నివేశాలు చేయలేదు. కథ డిమాండ్‌ చేస్తే గ్లామర్‌ పాత్రలు, ముద్దు సన్నివేశాలు చేసేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’’ అంటున్నారు హీరోయిన్‌ మాళవికా మీనన్‌. అందం, అభినయంతో దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఈ మలయాళ బ్యూటీ. తెలుగులో మాళవికా మీనన్‌ ‘లవ్‌ కే రన్‌’ (2016), ‘అమ్మాయిలు అంతే అదో టైపు’ (2018) వంటి చిత్రాల్లో నటించారు. 

అయితే పలు కారణాల వల్ల ఆ సినిమాలు ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. తాజాగా ఆమె నటించిన మలయాళ సినిమాలు ‘తంగమణి, వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ కొచ్చి’ ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందాయి. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ– ‘‘నేను మొదటిసారి నటించిన మలయాళ చిత్రం ‘నిద్ర’ (2011). అందులో హీరో చెల్లెలి పాత్ర చేశాను. అప్పుడు నా వయసు 14 ఏళ్లు. ‘916’ (2012) అనే మలయాళ మూవీ ద్వారా కథానాయికగా పరిచయమయ్యాను. మలయాళ సినిమాల్లో గ్లామర్‌ పాత్రలకు అవకాశం ఉండదు. అయితే తెలుగు, తమిళ భాషల్లో ఆ అవకాశాలు బాగుంటాయి... ఈ రెండు భాషల్లోనూ గ్లామరస్‌ హీరోయిన్‌గా నటించడానికి స్కోప్‌ ఉంటుంది’’ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement