Heroes Behave Like That In Romantic Scenes: Tamannaah Bhatia - Sakshi
Sakshi News home page

రొమాంటిక్‌ సన్నివేశాల్లో వారికి దడ.. తమన్నా సంచలన వ్యాఖ్యలు

Published Wed, Jan 18 2023 7:18 AM | Last Updated on Wed, Jan 18 2023 8:53 AM

Heroes behave like that in romantic scenes: Tamannaah - Sakshi

నటి తమన్నా మరోసారి వార్తల్లోకెక్కింది. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఈ అమ్మడి పేరే మారుమోగుతోంది. బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌కు ఆ తర్వాత కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన తమన్నా భాటియా ఈ రెండు భాషల్లోనూ స్టార్‌ హీరోలతో జతకట్టి క్రేజీ నటి అయ్యింది. అయితే తెలుగులో కొంచెం ఎక్కువగా పేరు తెచ్చుకుంది. మొదట్లో గ్లామర్‌ పాత్రలకే పరిమితమైన ఈ మిల్కీబ్యూటీ తర్వాత అభినయానికి ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటించి తానేంటో నిరూపించుకుంది.

అయితే బాహుబలి, సైరా వంటి కొన్ని చిత్రాలు ఈమె నటన సత్తాను చాటిన చిత్రాలు పెద్దగా సక్సెస్‌ కాలేదు. అందుకు ఉదాహరణ హిందీలో నటించిన బబ్లీ బౌన్సర్, ప్లాన్‌ ఏ ప్లాన్‌ బి వంటి చిత్రాలే. అయితే ఈమె అందాల ఆరబోసిన చిత్రాలు మాత్రం బాగానే సక్సెస్‌ అయ్యాయి. ఇక ఐటెం సాంగ్స్‌లో తమన్నా ఇరగదీసింది. హీరోలతో సన్నిహితంగా నటించడం గురించి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూ పేర్కొంటూ ఇప్పుడు చిత్రాల్లో అంతరంగిక సన్నివేశాలను ఎవరు ఇష్టపడడం లేదని చెప్పుకొచ్చింది.

అయినా నిజం చెప్పాలంటే సన్నిహిత సన్నివేశాల్లో నటించేటప్పుడు హీరోయిన్ల కంటే హీరోలకే వణుకు పుడుతుందని, ఈ విషయాన్ని తాను చాలాసార్లు గమనించానని పేర్కొంది. అమ్మాయిలతో అలా నటిస్తున్నామని భావించడమే వారిలో దడకు కారణం కావచ్చునంది. ప్రస్తుతం తమన్నా తెలుగులో చిరంజీవికి జంటగా భోళాశంకర్‌తో పాటు హిందీలో ఒక చిత్రం చేస్తోంది. ఆ మధ్య రజనీకాంత్‌ సరసన జైలర్‌ చిత్రంలో నటించనుందనే ప్రచారం జరిగినా అది వాస్తవం కాలేదు. కాగా ప్రస్తుతం ఈమె తన బాయ్‌ఫ్రెండ్‌ విజయవర్మతో షికార్లు కొడుతోంది. ఈ జంట త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు ప్రచారం జోరుగానే సాగుతోంది.  

చదవండి: (పులి కడుపున పులిబిడ్డే పుడుతుంది.. ఆ కుటుంబం విషయంలో ఇది అక్షరసత్యం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement