ఖస్సుమన్న కత్రినా! | katrina kaif fire on dircetr Abhishek Kapoor | Sakshi
Sakshi News home page

ఖస్సుమన్న కత్రినా!

Published Wed, Dec 16 2015 11:03 PM | Last Updated on Sun, Sep 3 2017 2:06 PM

ఖస్సుమన్న  కత్రినా!

ఖస్సుమన్న కత్రినా!

రొమాంటిక్ సీన్స్‌లో నటించడం కత్రినా కైఫ్‌కి కొత్త కాదు. అవలీలగా చేసేస్తారు. అయితే ఒకే టేక్‌లో ఓకే అయిపోవాలనుకుంటారు. దర్శకుడు రీటేక్ చేద్దామంటే ఆమెకు అస్సలు నచ్చదట. చేయనని కరాఖండిగా చెప్పేస్తారట. ‘ఫితూర్’ షూటింగ్ లొకేషన్‌లో అలానే చెప్పారట. ఆదిత్యారాయ్ కపూర్, కత్రినా జంటగా అభిషేక్ కపూర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. కత్రినా కన్నా ఆదిత్యారాయ్ కపూర్ జూనియర్. దాంతో రొమాంటిక్ సన్నివేశంలో చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిపడ్డారట.

సీన్ తీసిన తర్వాత మానిటర్‌లో చూసి, ‘సరిగ్గా లేదు.. మళ్లీ చేద్దాం’ అని దర్శకుడు అన్నారట. ఏ మాట వింటే కత్రినాకు మంటగా ఉంటుందో అదే వినపడింది. అంతే... అభిషేక్ కపూర్ మీద విరుచుకుపడ్డారని సమాచారం. అభిషేక్ కూడా కత్రినాతో దీటుగా గొడవపడ్డారట. షూటింగ్ ఆగిపోయేలా ఉండడంతో, నిర్మాత సిద్ధార్థ్‌రాయ్ కపూర్ రంగంలోకి దిగి, కత్రినాను రీటేక్‌కు ఒప్పించారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement