కండిషన్స్‌ ఆప్లై! | Different films are coming nowadays | Sakshi
Sakshi News home page

కండిషన్స్‌ ఆప్లై!

Published Wed, Aug 30 2017 12:46 AM | Last Updated on Sun, Sep 17 2017 6:06 PM

కండిషన్స్‌ ఆప్లై!

కండిషన్స్‌ ఆప్లై!

కుర్ర హీరోలతో సీనియర్‌ హీరోయిన్లు రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటించడం బాలీవుడ్‌లో కొత్తేమీ కాదు. ‘ఏ దిల్‌ హై ముష్కిల్‌’ చిత్రంలో రణబీర్‌కపూర్‌తో ఐశ్వర్యారాయ్,‘కి అండ్‌ కా’లో అర్జున్‌కపూర్‌తో కరీనా కపూర్‌ నటించారు. ఇటీవల ‘విఐపి–2’లో నటించిన కాజోల్‌తో కుర్ర హీరోలతో సీనియర్‌ నాయికలు రొమాంటిక్‌ సినిమాలు చేయడంపై మీ అభిప్రాయం ఏంటి? అని అడిగితే ‘‘ఈ రోజుల్లో డిఫరెంట్‌ సినిమాలు వస్తున్నాయి. దర్శకుల విజన్‌ కూడా మారుతోంది. కుర్ర హీరోలతో రొమాంటిక్‌ సీన్స్‌ చేయడాన్ని తప్పనడంలేదు. స్క్రిప్ట్‌ డిమాండ్‌ చేస్తే నాకేం అభ్యంతరం లేదు. కానీ, కొన్ని కండిషన్స్‌. నాతో నటించబోయే కుర్ర హీరో మ్యాన్లీగా ఉండాలి. అతని ఆలోచనల్లో, యాక్టింగ్‌లో పరిణితి చెంది ఉండాలి. అలాంటి హీరో సరసన ఛాన్స్‌ వస్తే అప్పుడు ఆలోచిస్తాను’’ అన్నారామె.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement