శారీ పోయి గౌను వచ్చే!
రీయూజ్
‘చీర రంగు బాగుంది.. కానీ డిజైన్ నచ్చలేదు.’ ‘ఈ చీర కట్టి కట్టి బోర్ కొట్టి పక్కన పెట్టేశాను.’ ‘చీర పాడైనా అంచులు, పల్లూ సూపర్బ్‌గా ఉన్నాయి.తీసేయాలనిపించడం లేదు.’ ‘ఈ చీర కట్టుకుంటే నాయనమ్మలా ఉన్నావు అంటున్నారు... ’ చీరల గురించి ఈ తరహా కామెంట్స్ చాలా మంది ఇల్లాళ్ల నోట వింటూ ఉంటాం. ఇలాంటి ఇబ్బంది ఉంటే మీ శారీకో కొత్త రూపు ఇవ్వవచ్చు. మీ అమ్మాయి మోడ్రన్ స్టైల్‌కి అనువుగా పాత చీరలను ఇలా కొత్తగా మార్చేయవచ్చు. నేటి యూత్‌ని మీ సరికొత్త సృజనతో సర్‌ప్రైజ్ చేయచ్చు.
ఇలా చేయండి
ఆరు గ జాల చీరలో కావల్సిన భాగాన్ని ఎంచుకోండి. మ్యాక్సీ డిజైన్ చేయాలా.. స్కర్ట్ కుట్టించాలా అనేది తేల్చుకోండి. పల్లూని, అంచులను వేరు చేసి స్కర్ట్ లేదా గౌనులకు అంచులుగా జత చేయండి. పట్టు చీరతో డిజైన్ చేసిన మిడ్ స్కర్ట్‌కి మోడ్రన్ టాప్ వేస్తే అల్ట్రామోడ్రన్ లుక్‌తో పార్టీలోనూ అదరగొట్టేస్తారు. చీర అంచులను గౌన్‌కి నెక్ డిజైన్‌గా, బెల్ట్‌గా,... రకరకాల ప్యాటర్న్స్ తీసుకుంటే వాటిల్లో మీ అమ్మాయిలు బుట్టబొమ్మల్లా మెరిసిపోతారు.