గుడి కట్టు పండగ పట్టు
పసుపు, పచ్చ, ఎరుపు, నీలం, గంధం, గులాబీ...
గుడి ద్వారానికి ఈ అన్ని రంగులూ అద్దినట్టు అనిపిస్తున్నాయి.
ఈ చీరల్లో... మన బంగారు తల్లులు
గుడిలో అడుగుపెడితేనే పండుగలా అనిపిస్తుంది.
ఈ పండుగ సీజన్‌లో గుడికట్టు... పండగ పట్టు.
► రాణీ పింక్ కలర్ పట్టుచీరకు బంగారు జరీ వెలుగు... వేడుకకు వెయ్యింతల కళను మోసుకొస్తుంది.
► నీలం, వంగపండు, జరీ కాంబినే షన్‌తో నేసిన పట్టు చీర కడితే నవ్వులతో పండుగ కళ నట్టింటికి విచ్చేసినట్టే!
► జరీ మామిడి పిందెల డిజైన్, సియాన్‌గ్రీన్ కలర్ కలనేతలో ఓ ఆకర్షణ. పట్టు చీరకు పూర్తి కాంట్రాస్ట్ డిజైన్ బ్లౌజ్ పండుగ రోజుకు సిసలైన కాంబినేషన్.
► గడపకు కుంకుమ బొట్టు... మేనికి ఎరుపు రంగు పట్టు చీర పండుగ కళను వెయ్యింతలు చేస్తుంది.
► చీరంత అంచు అయితే సింగారం బంగారమే!
► మిసిమి మేని ఛాయతో పోటీపడే పసుపువన్నె పట్టు చీర ఆధునికపు సింగారాలను అలవోకగా అద్దుతుంది.
► అలల అలల జరీ కలబోత. నీలం రంగు జిలుగుల పట్టుచీర కడితే ఆకాశం నడిచి వచ్చినట్టే!
► నారింజ రంగు పట్టుచీరకు ముదురు నీలం రంగు అంచు, అందులో దాగున్న జరీ జిలుగుల వెలుగులు మేనిపై అమరితే రత్నాలు రాశులుగా పోసినట్టే!