చీరేశారు!
చీర అంటే అందం. చీర అంటే ఆనందం.
చీర సౌందర్యాన్ని పెంచే ఓ వస్త్రమే కాదు...
భారతీయ సంస్కృతికి చిహ్నం కూడా.
అందుకే అతివల దుస్తుల వరుసలో
చీర ఎప్పుడూ ముందుంటుంది.
‘నువ్వు పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మా...
ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ’ అన్నాడో కవి. పట్టు చీరే కాదు...
పట్టుమని వంద రూపాయలు చేయని చీరలో కూడా ముగ్ధ అందం మూడింతలవుతుంది.
దక్షిణాది కంజీవరం నుంచి బెంగాల్ వారి బలుచరి వరకు... సెలెబ్రిటీలు కట్టే ఫ్యాన్సీ చీరల నుంచి పల్లె పడుచులు కట్టే నేత చీర వరకూ...
చీర చీరకూ అందమే.
కట్టిన ప్రతి పడతిలోనూ సౌందర్యమే.
అందుకే మోడ్రన్ దుస్తుల్లో మురిపించే సినిమా
తారలు సైతం చీరను చిన్నచూపు చూడరు.
ఏ ప్రముఖ సందర్భం వచ్చినా చీరను వదలరు. విభిన్నమైన డిజైన్లతో, వైవిధ్యభరితమైన కట్టుబడితో చీరకు కొత్త అందాన్ని తెస్తున్నారు బాలీవుడ్ సుందరాంగులు. వివిధ సందర్భాల్లో వాళ్లు ఎలా ‘చీరే’శారో చూడండి!