![ఆమె ప్రశంస... ఓ గిలిగింత! - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/61432406724_625x300.jpg.webp?itok=k1U3O8wq)
ఆమె ప్రశంస... ఓ గిలిగింత!
ఓ లుక్కేస్తారా!
టాలీవుడ్ కానీ, బాలీవుడ్ కానీ... సెలబ్రిటీలు దగ్గరవడం, దూరమవడం సర్వసాధారణమే. అయితే దగ్గరైనప్పుడు ఒకరినొకరు విపరీతంగా పొగిడేసుకోవడం, ఎఫైర్ బ్రేక్ అయిన తర్వాత ఒకరినొకరు తప్పులెన్నుకోవడమే చూస్తుంటాం. హిందీ నటి కల్కి కొచ్చిన్ ఇందుకు పూర్తిగా భిన్నం. ఆమె బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఎందుకో కానీ విడిపోవాలనుకున్నారు. విడిపోయారు కూడా.
అప్పటి నుంచి కూడా కల్కి, అనురాగ్‌లు ఒకరినొకరు తప్పు పట్టుకోలేదు. ఇది వారి హుందాతనం అనుకుంటే, కల్కి ఇటీవల అనురాగ్ కశ్యప్‌ను పొగిడేసింది. ఇటీవల విడుదలైన ‘బాంబే వెల్వెట్’ సినిమా తీయడంలో అనురాగ్ వైవిధ్యాన్ని ఆమె రకరకాలుగా ప్రశంసించింది. అంటే... కలిసి జీవించడానికి అభిప్రాయాలు కుదరకపోతే, ఆ వ్యక్తిలో ప్రతిదీ నచ్చదని కాదు. అతడిలో దర్శకత్వ ప్రతిభను నిజాయితీగా ప్రశంసించడానికి వెనుకాడకపోవడం మంచి విషయమే. మరి... మాజీ భార్య ప్రశంసలు... అనురాగ్ కశ్యప్‌కి గిలిగింతలు పెట్టినంత హాయిగా ఉండి ఉండవచ్చు.