సమ్మర్‌లో కూల్... కూల్... | Summer Cool ... Cool ... | Sakshi
Sakshi News home page

సమ్మర్‌లో కూల్... కూల్...

Published Sun, May 24 2015 12:36 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

సమ్మర్‌లో కూల్... కూల్... - Sakshi

సమ్మర్‌లో కూల్... కూల్...

బాలీవుడ్ బీట్
వేసవి తాపాన్ని భరించడం సామాన్యుడికే కాదు... సెలబ్రిటీలకూ కష్టమే. ఎంత ఏసీ గదుల్లో ఉండేవారైనా ఔట్‌డోర్‌కి వెళ్లినప్పుడు భానుడి బారిన పడాల్సిందే. మరి అలాంటప్పుడు వాళ్లు ఎలాంటి దుస్తులు వేసుకుంటారు? ఇదిగో వారి సమాధానం...
 

శ్రద్దాకపూర్: వేసవిలోనే అయినా నాకు మెటీరియల్ గురించి పెద్ద పట్టింపు ఉండదు. కాటన్, జార్జెట్, సిల్క్... ఏదైనా వేసుకుంటాను. అయితే స్లీవ్‌లెస్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. సాధారణంగా ఎప్పుడూ స్లీవ్‌లెస్‌లోనే ఎక్కువ కనిపిస్తుంటాను. కానీ సమ్మర్‌లో అయితే కాస్త ఎక్కువ.
 
అనుష్కశర్మ:వేసవిలో కాటన్ స్కర్టు, కాటన్ షర్టు... ఇవే నాకిష్టం. నిజానికి నా కలెక్షన్లో స్కర్టులు ఎక్కువే ఉంటాయి. బయట తిరిగినప్పుడు అవే ఎక్కువ వేసుకుంటాను. కాస్త డిఫరెంట్‌గా కనిపించాలనుకున్నప్పుడు స్కర్టు, షర్టు వేసి పైన ఓ కోటు తగిలిస్తాను.
 
బిపాసాబసు: ఏ సీజన్లో అయినా నా ఓటు జీన్సు, కాటన్ షర్ట్‌కే. అవి ఉన్నంత సౌకర్యవంతంగా మరేవీ ఉండవు. ఫంక్షన్లు, టీవీ ఇంటర్వ్యూలు, వెకేషన్లు... అకేషన్ ఏదైనా వాటినే వేసుకోవడానికి ఇష్టపడతాను. ఇక వేసవిలో అయితే చెప్పక్కర్లేదు.
 
దీపికా పదుకొనె:వేసవిలో ఔట్‌డోర్ షూటింగులు జరిగితే అంతే సంగతులు. ఇలా షాట్ అవ్వగానే నేను అలా నా కాస్ట్యూమ్స్ మార్చేస్తుంటాను. చిన్న చిన్న నిక్కర్లు, లూజుగా ఉండే దుస్తులు హాయిగా అనిపిస్తుంటాయి. నిజానికి వేసవిలో అనే కాదు. మామూలప్పుడు కూడా ప్రయాణాల్లో నేను వాటినే వేసుకుంటూ ఉంటాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement