మరోసారి తండ్రి కాబోతున్న హీరో | Shahid Kapoor Couple Are Having Another Baby | Sakshi
Sakshi News home page

మరోసారి తండ్రి కాబోతున్న హీరో

Published Sat, Apr 21 2018 12:14 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Shahid Kapoor Couple Are Having Another Baby - Sakshi

కూతురు మిషాతో షాహిద్‌ కపూర్‌

ముం‍బై : బాలీవుడ్‌ తారలకు ఎంత క్రేజ్‌ ఉంటుందో వారి పిల్లలకు అంతకన్నా ఎక్కువ క్రేజే ఉంటుంది. తాము ఆరాధించే హీరోలకు సంబంధించిన ఏ విషయమైనా అభిమానులకు ఆనందాన్ని ఇస్తుంది. షాహిద్‌ కపూర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఫొటో అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. షాహిద్‌- మీరా రాజ్‌పుత్‌ల ముద్దుల తనయ మిషా పక్కన బిగ్‌ సిస్టర్‌ అనే అక్షరాలు, బెలూన్‌లతో కూడిన ఫొటో శుభవార్తకు సంబంధించిందేనని అభిమానులు సంబరపడిపోతున్నారు.

2016లో మిషాకు జన్మనిచ్చిన షాహిద్‌- మీరా దంపతులు మరో బేబీని తమ జీవితాల్లోకి ఆహ్వానిస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. మీరా రాజ్‌పుత్‌ ప్రెగ్నెంట్‌ అంటూ బీ టౌన్‌లో వదంతులు ప్రచారం అవుతున్న నేపథ్యంలో ఫొటో షేర్‌ చేయడం ద్వారా షాహిద్‌ కన్ఫర్మేషన్‌ ఇచ్చేశాడు. బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ 2015లో ఢిల్లీకి చెందిన మీరా రాజ్‌పుత్‌ను పెళ్లాడిన విషయం తెలిసిందే. బీ టౌన్‌ స్టార్‌ కిడ్స్‌ అబ్‌రామ్‌, ఆరాధ్య బచ్చన్‌, తైమూర్‌లతో పాటు మిషాకు కూడా అభిమానుల సంఖ్య ఎక్కువగానే ఉంది.

పద్మావత్‌ సినిమాలో రతన్‌ సింగ్‌గా అలరించిన షాహిద్‌ శ్రీ నారాయణ్‌ సింగ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘భట్టీ గుల్‌ మీటర్‌ చాలు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

❤️

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement