చక్రం తిప్పిన హ్యాండ్‌లూమ్ | Domestic textiles | Sakshi
Sakshi News home page

చక్రం తిప్పిన హ్యాండ్‌లూమ్

Published Thu, Aug 13 2015 10:42 PM | Last Updated on Sat, Aug 11 2018 7:29 PM

చక్రం తిప్పిన హ్యాండ్‌లూమ్ - Sakshi

చక్రం తిప్పిన హ్యాండ్‌లూమ్

నాడు ఉద్యమ స్ఫూర్తిని అందరి హృదయాల్లో రేకెత్తించడానికి దేశీయ చేనేతలు చేసిన గొప్పతనం అంతా ఇంతాకాదు.
 అందులో భాగంగా మన తెలుగురాష్ట్రాల చేనేత గొప్పతనాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకుందాం.
 పండగ వేళ చేనేత వస్త్రాలను ధరించి తెలుగింటి కళతో వెలుగొందుదాం.

 
 పోచంపల్లి
రంగు దారాలను టై అండ్ డై చేసి, లేత, ముదురు రంగులలో నల్లగొండ జిల్లాలో రూపుదిద్దుకుంటుంది పోచంపల్లి చీర. కాటన్, పట్టు రెండు విధాల లభిస్తూ అతివల మేనికి హంగులు అద్దుతున్నాయి. పోచంపల్లి ప్యాటర్న్స్‌లో బెడ్‌షీట్స్, టేబుల్‌మ్యాట్స్, కర్టెన్స్.. కూడా అందుబాటులో ఉన్నాయి. దీని నుంచే రూపు కట్టిన ఇకత్ ఫ్యాబ్రిక్ నేటితరానికి బాగా చేరువైంది.
 
ధర్మవరం
రాయలసీమ ప్రాంతంలో పురుడుపోసుకున్న ధర్మవరం చీరలు అనంతపురం జిల్లాకు ప్రత్యేకం. ధర్మవరం పెళ్లి పట్టు చీరలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. మంచి రంగులు, ఆకర్షణీయమైన జరీ కొంగు ఈ చీర ప్రత్యేకత. ధర్మవరం చీరలు కంచిపట్టు చీరలకు దగ్గర పోలిక. కానీ రంగులు, డబుల్‌షేడెడ్.. మాత్రం పూర్తి భిన్నం.
 
నారాయణపేట్

మహబూబ్‌నగర్ జిల్లాలో నారాయణపేట్ చిన్న టౌన్. కానీ, ఇక్కడి చీరలు అంతర్జాతీయ పేరు గడించాయి. ఈ నేత చీరలో మహారాష్ట్రీయుల సంస్కృతి కనిపిస్తుంది. పట్టి బార్డర్, పెద్ద పల్లూ, సంప్రదాయ ఎరుపు, తెలుపు గీతలు, ఇకత్ డి జైన్ వీటి ప్రత్యేకత. కొంగు చీరకు పూర్తి కాంట్రాస్ట్‌లో ఉంటుంది. వీటిలో కాటన్, పట్టు చీరలు రెండు రకాలు లభిస్తున్నాయి.
 
 ఉప్పాడ
 తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడ ఓ చిన్న గ్రామం. కానీ, ఇక్కడ రూపుదిద్దుకున్న చీరలు అతివలను అద్భుతమైన అందంతో కట్టిపడేస్తున్నాయి. కంటికి హాయిగొలిపే రంగులు, చిక్కని అల్లిక, మెత్తదనం, సిల్వర్-గోల్డ్ కలర్ డిజైన్స్ ఈ చీరల ప్రత్యేకత.  కాటన్, పట్టు రెండు రకాల చీరలు ఉప్పాడలో లభిస్తున్నాయి.
 
 వెంకటగిరి

 రాజులు పరిపాలించిన రాజ్యంగా నెల్లూరు జిల్లాలో ఉన్న వెంకటగిరి ప్రఖ్యాతి చెందింది. ఇక్కడ వెంకటగిరి కాటన్ శారీస్ చాలా ప్రసిద్ధం. అలాగే రాజమాత చీరలు కూడా బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. రంగు రంగు దారాలను ఉపయోగిస్తూ చిన్న జరీ బార్డర్, బ్రొకేడ్ పల్లూ, మెటివ్స్‌తో జమదాని పరిజ్ఞానంతో చీరను అందంగా రూపుకడతారు.
 
 గద్వాల్

 మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల్ ఒక చిన్న పట్టణం. ప్రాచీన వైభవానికి సంస్థానాలకు ఈ ప్రాంతం పెట్టింది పేరు. బ్రొకేడ్ శారీస్, కాంట్రాస్ట్ పల్లూ, బార్డర్, ప్యాటర్స్‌కి ఈ చీర పెట్టింది పేరు. హంసల బార్డర్ మరో ప్రత్యేకత. అలాగే మోటివ్స్, పల్లూ స్టైల్
 
 ఈ ప్రాంతానికే వన్నె తెచ్చింది. ఈ చీరలలో 80 శాతం కాటన్, మిగతా 20 శాతం జరీ, పట్టుదారాలను ఉపయోగిస్తారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement