ముందే పట్టు పట్టుకుందామన్నా పట్టు దొరకదుఅలా జారిపోయే సిల్క్ ఇది.దాని మీద ఎంబ్రాయిడరీ వర్క్!ఈ చేతి కుట్టు తర్వాతచీర మీదపట్టు దొరుకుద్ది గానీధరే పట్టు చిక్కదు.చూసి ఆనందిద్దాంవీలైనప్పుడు కొందాంలేదంటే...ఈ కుట్టు పట్టుకే కాదుఅన్ని చీరలకూక్రియేటివ్‌గా కుట్టితక్కువలో కొట్టేద్దాం.
⇔ నలుపు రంగు చీరకు వెడల్పాటి అంచులా ఎంబ్రాయిడరీ పనితనం జిలుగులు పోతోంది. చిరు నగవులతో పోటీపడుతూ కొత్త అందాలు విరబూస్తోంది.
⇔ జరీతో అల్లిన మామిడిపిందెల డిజైన్ అంచుజత చేస్తే ఏ రంగు చీరైనా ఇలా ముచ్చటగారూపుకట్టాల్సిందే!
⇔ రాణీపింక్ చీరపై జరీ దారాలు, ముత్యాల వరుసలు కొంగొత్తగా రూపుకట్టి కొత్త కళను మోసుకొచ్చాయి.
⇔ పట్టుచీరే బంగారం. ఇక ఎంబ్రాయిడరీ హంగులు తోడైతే వేడుకకే సింగారం.
⇔ పచ్చని చీరకు గులాబీ రంగు అంచు సంప్రదాయాన్ని కూడా సై్టలిష్‌గా మార్చేస్తుంది.
⇔ జరీ జిలుగులతోనూ, అద్దాలతోనూ అంచుగా రూపు కట్టిన బంగారు రంగు చీర వేదికపై వెలుగు పూలు వెదజల్లుతుంది.
కుట్టుపట్టు
Published Thu, Feb 16 2017 11:29 PM | Last Updated on Tue, Sep 5 2017 3:53 AM
Advertisement
Advertisement