అనంతపురంలో నాట్స్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ | Distribution Of Sewing Machines Under NATS In Anantapur | Sakshi
Sakshi News home page

అనంతపురంలో నాట్స్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ

Published Fri, May 31 2024 6:28 PM | Last Updated on Fri, May 31 2024 7:02 PM

Distribution Of Sewing Machines Under NATS In Anantapur

మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా అనంతపురంలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ చేసింది. స్థానిక ఆదిమూర్తి నగర్‌లోని లిటిల్ ఫ్లవర్ పాఠశాల ప్రాంగణంలో నిరుపేద మహిళలకు నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు)నూతి  ఉచిత కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. మహిళలు స్వశక్తితో ఎదగాలనేదే నాట్స్ ఆశయమని బాపు నూతి అన్నారు. మహిళా సాధికారత కోసం నాట్స్  కృషి చేస్తుందన్నారు. 

అనంతపురం ఆర్డీటితో కలిసి నల్లమల అటవీ ప్రాంతంలో గిరిజన మహిళల కోసం కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బాపు నూతి తెలిపారు. ఈ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో లిటిల్ ఫ్లవర్ పాఠశాల అధినేత ఆంజనేయులు, నాయుడు, సాయి, అనిల్ కుమార్ నాట్స్ సభ్యులు పాల్గొన్నారు. మహిళా సాధికారత కోసం నాట్స్ చేపట్టే ప్రతి కార్యక్రమంలో చేయూత అందిస్తున్న ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

(చదవండి: నిడదవోలులో మానసిక దివ్యాంగులకు అండగా నాట్స్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement