న్యూఢిల్లీ: ఇక నుంచి ఆడియో కాన్ఫరెన్సింగ్, ఆడియోటెక్స్, వాయిస్ మెయిల్ సర్వీసుల లైసెన్సింగ్ విధానం.. ’ఏకీకృత లైసెన్స్’ పరిధిలోనే ఉండనున్నట్లు టెలికం విభాగం (డాట్) వెల్లడించింది. ప్రస్తుతం ఆడియోటెక్స్, వాయిస్ మెయిల్ సర్వీసులకు స్టాండెలోన్ లైసెన్సు తీసుకోవాల్సి ఉంటోంది. తాజా మార్పుల ప్రకారం ప్రస్తుతం వీఎంఎస్ / ఆడియోటెక్స్ / యూఎంఎస్ లైసెన్సులు ఉన్న సంస్థలు ఏకీకృత లైసెన్సుకు మారడమనేది ఐచ్ఛికంగానే ఉంటుందని డాట్ తెలిపింది. కొత్త నిబంధనలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. ‘2001 జులై 16న ఇచ్చిన వీఎంఎస్, ఆడియోటెక్స్, యూఎంఎస్ లైసెన్సులను పునరుద్ధరించడం లేదా కొత్తగా స్టాండెలోన్ లైసెన్సులను జారీ చేయబోము‘ అని డాట్ ఒక ప్రకటనలో తెలిపింది. టెలికం రంగంలో విధానపరమైన సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment