
ప్రముఖ దర్శకుడు భాగ్యరాజ్ తనయుడు శంతన్ భాగ్యరాజ్ హీరోగా రూపొందిన తమిళ చిత్రం ‘ముప్పరిమానమ్’. సృష్టి డాంగే కథానాయిక. ఆది రూపన్ దర్శకుడు. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని భువన్ కుమార్ అల్లం ‘లవ్ గేమ్’ పేరుతో తెలుగులోకి అనువదించారు.
ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఆడియో, ట్రైలర్‌ని విడుదల చేశారు. భువన్ కుమార్ మాట్లాడుతూ– ‘‘గతంలో ‘సారథి’ అనే స్ట్రయిట్ సినిమా నిర్మించాను. ప్రస్తుత ట్రెండ్‌కి కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ‘లవ్ గేమ్’. ఒక అమ్మాయి తన స్వార్థం కోసం ఇద్దరి అబ్బాయిలతో ఎలా గేమ్ ఆడిందనేది కథ. ‘వెన్నెలకంటి’ గారు మంచి సంభాషణలు అందించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం ప్రధాన ఆకర్షణ’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment