Bhagyaraj
-
'విడియుమ్ వరై కార్తిరు' టైటిల్ పోస్టర్ విడుదల
చెన్నై సినిమా: లిబ్రా ప్రొడక్షన్స్ పతాకంపై వీసీ రవీంద్రన్ నిర్మిస్తున్న తాజా చిత్రానికి 'విడియుమ్ వరై కార్తిరు' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో విద్యార్థి విక్రాంత్, కార్తీక్ కుమార్, మహాలక్ష్మి శంకర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రం ద్వారా ముండాసిపట్టి, రాక్షసన్ చిత్రాల దర్శకుడు రామ్‌కుమార్ శిష్యుడు బాజీ సలీమ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా చిత్ర టైటిల్ పోస్టర్‌ను శనివారం దర్శకుడు భాగ్యరాజ్ ఆవిష్కరించారు. ఈ నెల 23 నుంచి కోయంబత్తూరులో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించి అనంతరం సూపర్ ఫాస్ట్‌గా పూర్తి చేయనున్నట్లు తెలిపారు. చదవండి: బేబీ బంప్‌తో అలియా భట్ !.. లీకైన ఫొటోలు.. తనకన్నా చిన్నవాడితో హీరోయిన్ డేటింగ్, ఇద్దరు పుట్టాక పెళ్లి ! ఇది ఎవరికీ తెలియదనుకుంటా: నాగార్జున -
ఆ కష్టమేంటో తెలిసొచ్చింది
చిత్ర నిర్మాణం ఎంత కష్టమో ఒక నటుడిగా, దర్శక, నిర్మాతగా తెలిసోచ్చిందని సారద్ అన్నారు. ఈయన తొలి ప్రయత్నంలోనే చంద్రబాబు ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై స్వీయ దర్శక నిర్మాణంలో పాటలు రాసి, కథానాయకుడిగా నటించిన చిత్రం ‘తెర్కత్తి వీరన్’. శ్రీకాంత్‌దేవా సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం చెన్నైలో జరిగింది. దర్శకుడు భాగ్యరాజ్, నిర్మాత, నటుడు కే.రాజన్, గిల్డ్ అధ్యక్షుడు జాగ్వర్ తంగం, సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొని ఆడియో, ట్రైలర్‌ను విడుదల చేశారు. చిత్ర దర్శకుడు సారద్ మాట్లాడుతూ ఒక యధార్థ సంఘటన ఆధారంగా కమర్శియల్ అంశాలతో చిత్రం తెరకెక్కించినట్లు చెప్పారు. సినిమా తెరకెక్కించాలన్నది తన 17 ఏళ్ల కల అని చెప్పారు. కేవలం 60 రోజుల్లో నేపథ్య సంగీతం అందించినట్లు చెప్పారు. ఎఫెక్ట్స్ కోసం చాలా శ్రమించినట్లు తెలిపారు. యూనిట్ సభ్యులు అంకిత భావంతో ఈ చిత్రానికి పని చేసినట్లు చెప్పారు. ఆడియో ఆవిష్కరిస్తున్న తెర్కత్తి వీరన్ చిత్ర యూనిట్ -
21 ఏళ్ల తర్వాత హీరోగా, గంటన్నరలో సినిమా కంప్లీట్, వరల్డ్ రికార్డ్!
ప్రపంచ రికార్డే లక్ష్యంగా రూపొందించిన చిత్రం 3.6.9. శివమాధవ్ దర్శకత్వంలో పీజీఎస్.శరవణకుమార్ నిర్మించిన ఈ చిత్రంలో దర్శక నిర్మాత కె.భాగ్యరాజ్ కథానాయకుడిగా నటించారు. నిర్మాత శరవణకుమార్ మరో హీరోగా నటించారు. ఈ చిత్రానికి మారీశ్వరన్ ఛాయాగ్రహణం, కార్తీక్ హర్ష సంగీతాన్ని అందించారు. చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం చెన్నైలో సాయంత్రం నిర్వహించారు. ఇది ప్రపంచ రికార్డు కోసం కట్స్ లేకుండా 81 నిమిషాల్లో 24 కెమెరాలతో 450 మంది సాంకేతికవర్గంతో 750 మందికి పైగా నటీనటులతో చిత్రీకరించిన చిత్రం ఇదని తెలిపారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు చిత్రాన్ని సరికొత్త ప్రయోగం చేశారన్నారు. 81 నిమిషాల్లో చిత్రాన్ని పూర్తి చేయడం సాధారణ విషయం కాదని అందుకు దర్శకుడు చాలా హోమ్‌వర్క్ చేశారని అన్నారు. ఇందులో తాను చర్చి ఫాదర్‌గా నటించానని తెలిపారు. అందరూ తాను 21 ఏళ్ల తరువాత హీరోగా నటించిన చిత్రం ఇదని అంటున్నారని, నిజానికి తాను ఎవర్గ్రీన్ హీరో అని భాగ్యరాజ్ పేర్కొన్నారు. చదవండి: అంటే సుందరానికీ.. నాని నాలుక మీద వాత పెట్టారు! ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజవుతున్న సినిమాల లిస్ట్ ఇదిగో -
30 ఏళ్ల తరువాత మళ్లీ జంటగా ఎవర్గ్రీన్ జోడి
తమిళసినిమా : ముప్ఫై ఏళ్ల తరువాత నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ, నటి ఐశ్వర్య మళ్లీ జంటగా కలిసి నటిస్తున్నారు. నటుడు కెవిన్, అపర్ణదాస్ హీరో హీరోయిన్లుగా ఒలింపియా మూవీస్ పతాకంపై ఎస్.అంబేద్ కుమార్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీనికి గణేష్ కె.బాబు దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. కాగా ఇందులో సీనియర్ దర్శకుడు, నటుడు కె.భాగ్యరాజ్, నటి ఐశ్వర్య, కథానాయకుడు కెవిన్‌కు తల్లిదండ్రులుగా నటిస్తున్నారు. వీరిద్దరూ 1992లో విడుదలైన రాసకుట్టి అనే చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించడం గమనార్హం. 30 ఏళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు ఈ చిత్రంలో కలిసి నటించడం విశేషం. ఈ చిత్రానికి ఎళిల్ అరసు చాయాగ్రహణంను, జెన్‌మార్టిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోందని యూనిట్ వర్గాలు తెలిపారు. -
భాగ్యరాజ్ చూపిన స్త్రీలు
కె.భాగ్యరాజ్ తన గురువు కె.భారతీరాజా తీసిన ‘ఎర్రగులాబీలు’ సినిమాకు కథ అందించాడు. ఆ సినిమా సూపర్‌హిట్ అయ్యింది. స్త్రీల వంచన వల్ల మోసపోయిన మగవారు ఆ స్త్రీల మీద పగ తీర్చుకోవడానికి ‘సైకో’లుగా మారే కథ ఇది. తమిళనాడులో 1960ల నాటి సైకో కిల్లర్ రమణ్ రాఘవ్‌ను ఈ కథకు ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. ఎర్రగులాబీలలో ఒక సవతి తల్లి, కాలేజీ అమ్మాయి, గృహిణి మగవారిని వంచించడం కనిపిస్తుంది. భాగ్యరాజ్ తీసిన మరో ముఖ్యమైన సినిమా ‘అంద ఏళు నాట్కల్’ (ఆ ఏడు రోజులు) స్త్రీ హృదయానికి, సంప్రదాయానికీ మధ్య జరిగే సంఘర్షణను చూపిస్తుంది. ఈ సినిమాలో తను ప్రేమించిన అబ్బాయిని చేసుకునే వీలు లేక అంబిక మరో వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. కానీ ఆ పెళ్లి నుంచి బయటపడాలనుందని తన ప్రియుణ్ని పెళ్లి చేసుకోవాలని ఉందని శోభనం నాడే భర్తకు చెబుతుంది. ఆ భర్త ఆ ప్రియుణ్ణి వెతుకుతాడు. కానీ ఆ ప్రియుడు ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరించడు. ఆమె పట్ల తనకు చాలా ప్రేమ ఉన్నా భారతీయ సంప్రదాయంలో తాళికి చాలా విలువ ఉందని, ఒకసారి తాళి కట్టించుకున్న స్త్రీ మరొకరి సొంతం కాజాలదని చెప్పి వెళ్లిపోతాడు. ఈ సినిమా తెలుగులో ‘రాధా కల్యాణం’గా రీమేక్ అయ్యింది. ఈ సినిమాయే ఆ తర్వాత ‘మౌనరాగం’, ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ సినిమాలకు ఆధారం అయ్యింది. ‘చిన్నవీడ్’ సినిమా ‘స్త్రీ సహనాన్ని’ చూపిస్తుంది. ఇందులో హీరోగా వేసిన భాగ్యరాజ్ పెళ్లయిన తర్వాత తన భార్య స్థూలకాయంతో ఉందని మరొకరితో సంబంధం పెట్టుకుంటాడు. ఈ సంగతి భార్యకు తెలుస్తుంది. అయితే ఆమె అతనితో ఘర్షణకు దిగకుండా, అతనితో వేరు పడకుండా ఎంతో ఓపికగా ఉండి మనసు మార్చుకుంటుంది. ఈ సినిమాయే కమలహాసన్ ‘సతీ లీలావతి’గా, నిన్న మొన్న అల్లరి నరేశ్ ‘కితకితలు’గా వచ్చింది. భాగ్యరాజ్ తీసిన ‘ముందానై ముడిచ్చు’ సినిమా తెలుగులో ‘మూడుముళ్లు’గా వచ్చింది. ఇందులో భార్య చనిపోయి ఒక బిడ్డకు తండ్రిగా ఉన్న చంద్రమోహన్ ఒక పల్లెటూళ్లో స్కూల్ టీచర్‌గా పని చేస్తుంటాడు. రెండో పెళ్లి చేసుకుంటే ఆ వచ్చిన భార్య సవతి తల్లిగా తన బిడ్డను ఏ బాధలు పెడుతుందోనని పెళ్లే చేసుకోనంటాడు. కానీ అతని మీద ప్రేమ పెంచుకున్న ఆ ఊరి అమ్మాయి రాధిక అతన్ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని చివరకు అతని కోసం పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకోవడానికి కూడా సిద్ధమైపోతుంది. ఆమెను హాస్పిటల్లో నిస్సహాయ స్థితిలో చూసిగానీ ఆమె ప్రేమను నమ్మడు చంద్రమోహన్. ‘చిన్నరాజా’ సినిమాలో సవతితల్లి ఆస్తి కోసం భర్త నడుములు విరిగేలా చేస్తుంది. సవతి కొడుకును ఉత్త వెంగళాయిగా పెంచుతుంది. చివరకు పాలలో విషం కలిపి అతడి వారసుణ్నే చంపాలనుకుంటుంది. ఆ సంగతి తెలిసినా సవతి తల్లి మీద నమ్మకంతో ఆమె కళ్లెదుటే ఆ పాలు తాగుతాడు భాగ్యరాజ్. అతను చావుబతుకుల్లోకి వెళితే తప్ప ఆ సవతి తల్లిలో పరివర్తన రాదు. ఈ సినిమా తెలుగులో ‘అబ్బాయిగారు’గా వచ్చింది. ‘సుందరకాండ’ సినిమాలో కేన్సర్ ఉన్న అమ్మాయి సుమంగళిగా చనిపోవాలని అనుకుంటుంది. వివాహితుడైనప్పటికీ లెక్చరర్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఆమె చనిపోతుందని తెలిసి ఆ లెక్చరర్ భార్య ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని భర్తతో చెబుతుంది. అయితే ఈలోపే ఆ అమ్మాయి మరణిస్తుంది. భాగ్యరాజ్ సినిమాలలో హీరోను హీరోయిన్లు యథాతథంగా స్వీకరించాల్సిన స్థితి ఉంటుంది. అతడి ‘డార్లింగ్ డార్లింగ్’లో హీరోయిన్ శ్రీమంతురాలు, హీరో వాచ్‌మన్ కొడుకు. ఆమెకు అతని మీద ఏ అభిప్రాయమూ లేకపోయినా చిన్నప్పటి నుంచి ఆమెను ఆరాధిస్తున్న హీరో తన ఆరాధనను తెలిసేలా చేసి పెళ్లి చేసుకుంటాడు. ‘రాసకుట్టి’ సినిమాలో హీరో పల్లెల్లో అల్లరి చిల్లరగా తిరుగుతూ డాక్టర్ గెటప్‌లో, లాయర్ గెటప్‌లో ఫొటోలు దిగి కాలక్షేపం చేస్తుంటాడు. అతడు విద్యాధికుడు అని నమ్మిన హీరోయిన్ చివరకు ఆ మోసం తెలిసి నిరాకరిస్తుంది. కానీ హీరో ఇలాంటి షోకిల్లారాయుడైనా హీరోయిన్ చివరకు అతణ్ణే పెళ్లి చేసుకోక తప్పని విధంగా హీరో క్యారెక్టర్ ఆ తర్వాత తీర్చిదిద్ద బడుతుంది. ఈ సినిమా హిందీలో ‘రాజాబాబు’గా రీమేక్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.మొత్తంగా చూస్తే భాగ్యరాజ్ పితృస్వామ్య సంస్కృతిలో సగటు పురుషుడు స్త్రీని ఎలా చూస్తాడో చూడాలనుకుంటాడో అలా చూపడానికే ఎక్కువ ఇష్టపడ్డాడని అనిపిస్తుంది. అదే భావజాలం స్త్రీలకూ నూరిపోయబడ్డది కాబట్టి అతని సినిమాలన్నీ హిట్ అయ్యాయి. -
'అన్నింటికి మహిళలే కారణం'
పురుషులు పెట్టుకునే వివాహేతర సంబంధాల కన్నా, స్త్రీలు పెట్టుకునే వివాహేతర సంబంధాలు భయంకరమైన పరిస్థితులకు దారి తీస్తాయని, ఆఖరికి.. పిల్లలు, భర్త ప్రాణాలను సైతం అలాంటి మహిళలు ఫణంగా పెడతారని తమిళ దర్శక దిగ్గజం కె.భాగ్యరాజ్ అనడంపై ఇప్పుడు పెద్ద వివాదమే రాజుకుంది. అభ్యంతరకరమైన అతడి వ్యాఖ్యలపై మహిళాలోకం మండిపడుతోంది. యావద్దేశాన్ని షాక్‌కి గురిచేసిన ఘటన ఒకటి ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళనాడులోని పొల్లాచ్చిలో బయటపడింది. ఇప్పుడు మళ్లీ దేశం మొత్తాన్నీ దిగ్భ్రాంతికి, ఆగ్రహావేశాలకు లోను చేసిన ఘటన ఒకటి నిన్న అదే తమిళనాడులోనే జరిగింది! రెండిటికీ ఉన్న సంబంధం.. ‘కరుత్తుగళై పదివు సెయ్’ అనే తమిళ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్. ఈ సినిమా కథకు మూలం పొల్లాచ్చి ఘటన. ఒక గ్యాంగ్ గత రెండేళ్లుగా ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అమాయకులైన స్కూలు బాలికల్నీ, కాలేజీ అమ్మాయిల్నీ, మహిళా టీచర్లనీ వలపన్ని బ్లాక్మెయిల్ చేస్తూ లోబరుచుకోవడం పొల్లాచ్చి ఘటన అయితే, మంగళవారం చెన్నైలోని ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ఒకప్పటి దర్శక దిగ్గజం కె. భాగ్యరాజ్.. మహిళలపై తీవ్రమైన ఆరోపణలు చేయడం తాజా ఘటన. ‘‘అసలు ఇలాంటి నేరాలు మహిళల వల్లే జరుగుతున్నాయి’’ అని ఆయన అన్నారు! స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా అకౌంట్లు అందుబాటులోకి వచ్చాక పెరిగిన అక్రమ సంబంధాలకు, అవినీతి వ్యవహారాలకు మహిళలే ప్రధాన కారణం అని కూడా భాగ్యరాజ్ అన్నారు. అంతేకాదు, పురుషులు పెట్టుకునే వివాహేతర సంబంధాల కన్నా, స్త్రీలు పెట్టుకునే వివాహేతర సంబంధాలు భయంకరమైన పరిస్థితులకు దారి తీస్తాయని, ఆఖరికి.. పిల్లలు, భర్త ప్రాణాలను సైతం అలాంటి మహిళలు ఫణంగా పెడతారని అన్నారు! దీనిపై ఇప్పుడు పెద్ద వివాదమే రాజుకుంది. నిజానికి అది ఆడియో ఫంక్షన్‌లా లేదు. పనికట్టుకుని మహిళల్ని దూషించడానికి భాగ్యరాజా ఈ ఆడియో ఫంక్షన్‌ను అడ్డుపెట్టుకున్నారా అనే సందేహం కలిగించేలా ఆయన కామెంట్స్ చేశారు. ఒక తమిళ సామెతను కూడా ఈ సందర్భంగా చెప్పారు. ‘‘ఊసి ఇదమ్ కుడుకామ నూల్ నొనళాదు’’ (సూది కనుక సందు ఇవ్వకపోతే దారం అందులోకి దూరలేదు) అన్నారు. ‘‘ఆడవాళ్లు చనువిస్తేనే మగవాళ్లు చొరవ చూపుతారు. అలాంటప్పుడు మగవాళ్లనెందుకు తప్పు పడతాం? పురుషుడు తప్పు చేస్తే ఆ తప్పు అతడితోనే ఉండిపోతుంది. స్త్రీ తప్పు చేస్తే అది కుటుంబం మొత్తానికీ చుట్టుకుంటుంది.ఉదాహరణకు మగాడు ‘చిన్నింటి’ కోసం ఏదైనా చెయ్యనివ్వండి, ఎంతైనా ఖర్చుపెట్టనివ్వండి, తన భార్యకు ఏ కష్టమూ రానివ్వడు. ఏ ఇబ్బందీ కలిగించడు. అదే స్త్రీ ఒక అనైతిక సంబంధం పెట్టుకుంటే బిడ్డల్నీ, భర్తనీ చంపేస్తుంది’’ అని తీవ్రాతి తీవ్రమైన విమర్శలతో మహిళల్ని భాగ్యరాజ్ కించపరిచారు. 20 నిమిషాల తన ప్రసంగం మొత్తం మహిళల నైతికతను శంకించేందుకు ప్రోత్సహించేలా మాత్రమే సాగింది. ‘‘తండ్రి తన కూతురికి ఆమె భద్రత కోసం సెల్‌ఫోన్ కొనిస్తాడు. కూతురు ఆ సెల్‌ఫోన్‌తో చాటింగ్ చేస్తూ తనే స్వయంగా ప్రమాదంలోకి కూరుకుపోతుంది’’ అని ప్రసంగాన్ని ముగించారు. ఆడియో ఫంక్షన్లో భాగ్యరాజ్ మాట్లాడిన ప్రతి మాటకూ చప్పట్ల వర్షం కురిసింది. అయితే కొన్ని గంటల తర్వాత దేశవ్యాప్తంగా అతడిపై తిట్లు, చీత్కారాల వడగండ్లు మొదలయ్యాయి. భాగ్యరాజ్ ఉద్దేశాలను జీర్ణం చేసుకోడానికి అంత టైమ్ పట్టిందంటే అతడెంతగా ఒళ్లు మరిచి మాట్లాడాడో అర్థం చేసుకోవచ్చు. అన్నిటికన్నా దారుణాతిదారుణమైన మాట.. స్త్రీలే తమపై అఘాయిత్యానికి పురుషుల్ని ప్రేరేపిస్తారట!! భాగ్యరాజ్ తమిళంలో అన్న ఈ మాటలన్నీ సోషల్ మీడియాలో అన్ని భాషల్లోకీ నెమ్మది నెమ్మదిగా తర్జుమా అవుతున్న కొద్దీ ఆగ్రహజ్వాలలు అన్నివైపుల నుంచి ఆయన్ని చుట్టుముట్టడం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇప్పటికే తమిళనాడు మహిళా కమిషన్‌కు ఒక లేఖ రాశారు. ‘‘అతడి పురుషాహంకార, స్త్రీద్వేష వ్యాఖ్యలపై, ఆమోదయోగ్యం కాని అతడి ధోరణిపై తక్షణం చర్య తీసుకోవాలి’’ అని పద్మ ఆ లేఖలో కోరారు. ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద కూడా భాగ్యరాజ్ కామెంట్లపై ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘అసలు ఇలాంటి కామెంట్ల వల్లే అమ్మాయిలు చనిపోతున్నారు’’ అని ఆమె ట్వీట్ చేశారు. సినీ దర్శకుడు, నటుడు, రచయిత, సంగీత దర్శకుడు, నిర్మాత అయిన కృష్ణస్వామి భాగ్యరాజ్‌కు మహిళల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన తీసిన ‘ముంధనై ముడిచ్చు’, ‘చిన్నవీడు’ వంటి చిత్రాలలో ఔన్నత్యం గల మహిళల పాత్రలు కనిపిస్తాయి. అలాంటిది 66 ఏళ్ల వయసులో భాగ్యరాజ్ ఇలా ఎందుకు మాట్లాడినట్లు?! దానికి ఎవరూ సమాధానం చెప్పలేరు. ఒక్క భాగ్యరాజ్ తప్ప. అయితే అతడు నోరు విప్పాలని ఎవరూ అనుకోవడం లేదు. చెప్పి చెప్పి అలసిపోయాం ‘‘రేప్ జరగడానికి కారణం స్త్రీలే’ అని స్త్రీలను నిందించడం మానేయమని పెద్ద స్థాయిలో ఉన్నవాళ్లకు చెప్పి అలసిపోయాం. ‘సూది అనుమతిస్తేనే, దారం లోపలకి వచ్చింది’ అనే తరహాలో మాట్లాడటం దయచేసి మానేయండి ప్లీజ్. ఈ ఆలోచనా విధానం వల్ల చాలామంది అమ్మాయిలు చనిపోతున్నారు. ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్లే రేప్‌కి కారణం స్త్రీలు అంటున్నారు’’ అని గాయని చిన్మయి ట్వీట్ చేశారు. భాగ్యరాజా మాట్లాడిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేసి, తన అభిప్రాయాన్ని ఆమె వెలిబుచ్చారు. అలాగే భాగ్యరాజా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ట్వీట్ చేసిన కొందరి ట్వీట్లను కూడా చిన్మయి రీట్వీట్ చేశారు. - చిన్మయి, గాయని మనువాద ప్రతినిధి అతను ఈ రకమైన కామెంట్ చేయడం అవగాహన లేమి. మాతృ పరంపరను గుర్తించిన ద్రవిడ సంస్కృతిని అర్థం చేసుకోనితనం. అతను మనువాద, పితృస్వామ్య ప్రతినిధిగా మాట్లాడుతున్నాడు. కట్నంకోసం పురుషులు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, కట్నం కోసం ఆడవాళ్లను చంపడం గురించి ఎందుకు మాట్లాడరు? నేరం ఎవరు చేసినా నేరమే! ఆడవాళ్ల మీద మగవాళ్లు వ్యవస్థీకృతంగా చేస్తున్న దారుణాలు, హింస గురించి ఎందుకు మాట్లాడరు? సెల్ఫోన్లు తప్పు అయితే మొత్తానికే తీసిపారేయండి అంతే కాని అది ఆడవాళ్ల దగ్గరుంటే తప్పు.. మగవాళ్ల దగ్గరుంటే కాదా? – దేవి, సామాజిక కార్యకర్త తప్పు వాళ్లది కాదు స్త్రీలు, పురుషులతో సమానంగా హక్కులు పొందడం, అన్ని రంగాల్లో వాళ్ల సమస్థాయిలో ఉండడం మగవాళ్లకు మింగుడుపడ్డంలేదు. తప్పు వాళ్లది కాదు.. మనువాద సంస్కృతిలో పుట్టి పెరిగి.. దాన్నే జీర్ణించుకున్నారు కాబట్టి ఇలాంటి మాటలే మాట్లాడ్తారు. మనువాద సంస్కృతి ప్రభావం వల్ల స్త్రీ ఎదుగుదల పరిస్థితులు వాళ్లకు అర్థంకావు.అర్థమయ్యేలా చేయాల్సిన పాలక, పోలీస్, న్యాయ వ్యవస్థలూ తమ పాత్ర సరిగ్గా పోషించట్లేదు.సెల్‌ఫోన్.. అందరికీ అందుబాటులో ఉండే కమ్యూనికేషన్ టూల్. పెరిగిన అవసరాల్లో అది అందరికీ అత్యంత అవసరం. దానికి, స్త్రీల ప్రవర్తనకు లింక్ పెట్టడమేంటి? ఆయన అజ్ఞానం, అహంకారం బయటపడ్డం తప్ప ఇంకేం లేదు. ఈ దుస్థితి పోవాలంటే సమాజంలో సమూలమైన మార్పు రావాలి. స్త్రీ, పురుష సమానత్వం గురించి రాజ్యాంగం చెప్పిన విషయాలను.. అసలు ఆ మాటకొస్తే రాజ్యాంగం కచ్చితంగా అమలయ్యేలా చూస్తే చాలు.. ఇలాంటి అభిప్రాయాలు, మాటలు వినిపించవు. – గెడ్డం ఝాన్సీ నేషనల్ కన్వీనర్, దళిత స్త్రీ శక్తి -
భాగ్యరాజాపై కఠిన చర్యలు తీసుకోండి
అమరావతి: ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు భాగ్యరాజాపై తమిళనాట పెద్ద దుమారం రేగుతోంది. తెలుగు ప్రేక్షకులకు కూడా చిరపరిచితుడైన భాగ్యరాజా మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ కూడా భాగ్యరాజా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భాగ్యరాజాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తమిళనాడు మహిళా కమిషన్‌కు ఆమె లేఖ రాశారు. రేప్ ఘటనల్లో మహిళలను తప్పుబట్టేలా మాట్లాడటం ఎంతమాత్రం మానవత్వం కాదని, చిన్నపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు వీరికి కనిపించడం లేదా? అని ఆమె నిలదీశారు. ప్రభుత్వాలు, మహిళా సంస్థలు, పోలీసులు, న్యాయవ్యవస్థ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆపేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంటే కొందరు సెలబ్రిటీలు మాత్రం మహిళలను కించపరచడం, దారుణాలకు మద్దతు పలుకడమేమిటని ఆమె నిలదీశారు. ఈమధ్య తమిళనాడులో ప్రకంపనలు సృష్టించిన పొలాచీ రేప్ కేసు గురించి భాగ్యరాజా ఓ సినీ ఈవెంట్లో ప్రస్తావిస్తూ.. ఆ ఘటన వెనుక మగవాళ్ల తప్పులేదని, వివాహేతర సంబంధాల కోసమే ఈ రోజుల్లో మహిళలు భర్తలను, పిల్లలను చంపుతున్నారని దారుణ వ్యాఖ్యలు చేశారు. సెల్ఫోన్ల వల్లే మహిళలు చెడిపోతున్నారని, రెండేసి సిమ్ కార్డులు వాడుతున్నారని, మహిళలపై అత్యాచారాలు, వేధింపులకు కూడా సెల్ఫోన్లు కారణమని ఆయన చెప్పుకొచ్చారు. పోలాచీ కేసులో అమ్మాయి అవకాశం ఇచ్చినందువల్లే రేప్ జరిగిందని భాగ్యరాజా తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
‘నాకూ గంజాయి అలవాటు ఉండేది’
తనకూ గంజాయి అలవాటు ఉండేదని ప్రముఖ సినీ దర్శకుడు కే.భాగ్యరాజ్ బహిరంగంగా వెల్లడించారు. మోతీ ఆర్ట్స్ పతాకంపై మోతీఫా స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన చిత్రం కోలా. ఈయన మాజీ పోలీస్అధికారి కూడా కావటం విశేషం. విక్కీఆద్మియ, వైశాక్ హీరోలుగా నటించిన ఈ సినిమాలో నటి హరిణి హీరోయిన్గా నటించింది. కణ్మణిరాజా సంగీతా న్ని అందించిన ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆడియోను ఆవిష్కరించిన దర్శక, నటుడు కే. భాగ్యరాజ్ మాట్లాడుతూ.. ఈ చిత్ర సంగీతదర్శకుడు మా ఊరు వారు కావడం సంతోషంగా ఉందని అన్నారు. చిత్రం లోని పాటలకు నృత్యదర్శకురాలు రాధిక చాలా చక్కగా కొరియెగ్రఫీ చేశారని ప్రశంసించారు. ఎనర్జీ అనేది వయసును బట్టి కాకుండా మనసును బట్టి ఉంటుందన్నారు. ఫైట్‌మాస్టర్ జాగ్వుర్‌తంగం గంజాయి అలవాటు గురించి చాలా ఆవేశంగా మాట్లాడారన్న భాగ్యరాజ, ఒకప్పుడు తాను కూడా గంజాయికి అలవాటు పడిన వాడినేనని చెప్పారు. ఒకసారి తన సహాయకుడొకరు కోయంబత్తూర్‌లో గంజాయితో కూడిన సిగరెట్‌ను ఇచ్చాడన్నారు. తాను వద్దాన్నా వినకుండా కాల్చేలా చేశాడని, మొదట్లో అది బాగానే ఉందనిపిస్తుందని ఆ తరువాత దాని ప్రభావం చూపిస్తుందని చెప్పారు. గంజాయి తీసుకుంటే ఎందుకో కారణం తెలియకుండానే నవ్వేస్తుంటామని చెప్పారు. అలా గంజాయికి అలవాటు పడిన తాను ఒక సమయంలో ఏదేదో సాధించాలని వచ్చి ఇలా అయిపోయానేంటి? అన్న ఆలోచన రావడంతో ఎంతో కష్టపడి ఆ అలవాటు మానుకున్నానని తెలిపారు. ప్రస్తుతం సిగరెట్ తాగడం కూడా మానేశానని చెప్పారు. -
రాజకీయాల్లో ఈజీ.. సినిమాల్లోనే కష్టమబ్బా!
తమిళసినిమా: రాజకీయాల్లో వారసులు రాత్రికి రాత్రే ఎదుగుతున్నారని, సినిమాల్లో మాత్రం అలా కుదరడం లేదని సీనియర్ దర్శకుడు, నటుడు కే భాగ్యరాజ్ వ్యాఖ్యానించారు. నటుడు విక్రమ్‌ప్రభు కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘అసురగురు’ ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న కే భాగ్యరాజ్ మాట్లాడుతూ.. సినీరంగంలో వారసులకు విజయాలు సులభంగా రావడం లేదని, పోరాడి సాధించుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. అయితే రాజకీయాల్లో మాత్రం వారసులు రాత్రికిరాత్రే ఎదుగుతున్నారని, ముఖ్యమైన పదవులు వారిని వరిస్తున్నాయి అన్నారు. కే భాగ్యరాజ్ కొడుకు శంతను హీరోగా పరిచయమై చాలాకాలమైనా మంచి హిట్ కోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉన్న విషయం ఇక్కడ గమనార్మం. మరోవైపు సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్న నటుడు, స్టాలిన్ తనయుడు ఉదయనిధి ఇటీవల డీఎంకే యువజన కార్యదర్శి పదవిని చేపట్టిన విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలో కే భాగ్యరాజ్ చేసిన వ్యాఖ్యలు చర్ఛనీయాంశంగా మారాయి. విక్రమ్‌ప్రభుకు జోడీగా నటి మహిమా నంబియార్ నటించిన ‘అసురగురు’ చిత్రంలో యోగిబాబు, జగన్, మనోబాల ముఖ్యపాత్రలను పోషించారు. జేఎస్బీ ఫిలిం స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌దీప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన దర్శకుడు మోహన్‌రాజా శిష్యుడు. గణేశ్‌రాఘవేంద్ర సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో నటుడు విక్రమ్‌ప్రభు, నటి మహిమా నంబియార్, నిర్మాత కలైపులి థాను, ఎడిటర్ మోహన్ అతిథులుగా పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ముగిసిన నడిగర్ పోలింగ్
సాక్షి, చెన్నై: దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్) ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మైలాపూర్‌లోని సెయింట్ ఎబాస్ బాలికల పాఠశాలలో ఓటింగ్ నిర్వహించగా.. కమల్‌హాసన్, ప్రకాష్‌రాజ్, కుష్భూ, రాధ, కేఆర్ విజయ సహా పలువురు నటులు, నటీమణులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. చివరిక్షణంలో హడావుడి ప్రకటన కారణంగా పోలింగ్ మందకోడిగా సాగినట్టు నిర్వాహకులు తెలిపారు. 3వేల100 మంది సభ్యులున్న నడిగర్ సంఘానికి 2019-2022 మధ్యకాలానికి ఈ ఎన్నికలు జరిగాయి. మద్రాస్ హైకోర్టు తుదితీర్పు అనంతరం నడిగర్ సంఘం ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి నాజర్ నేతృత్వంలోని పాండవార్ ప్యానెల్, భాగ్యరాజ్ నేతృత్వంలోని శంకర్‌దాస్ ప్యానెల్ నడిగర్ సంఘం ఎన్నికల్లో పోటీచేశాయి. జనరల్ సెక్రటరీ పదవికి హీరో విశాల్, నిర్మాత గణేశ్‌తో తలపడ్డారు. కోశాధికారి పదవికి హీరో కార్తీ, హీరో ప్రశాంత్ బరిలో ఉన్నారు. నాజర్ గ్రూప్, భాగ్యరాజ్ గ్రూప్ మధ్య తీవ్రస్థాయిలో మాటలయుద్ధం జరగడంతో.. ఎన్నికల ప్రక్రియ రచ్చకెక్కింది. విశాల్ తమిళ వ్యక్తి కాదని, అతడిని నడిగర్ సంఘం నుంచి బయటకు పంపాలని భాగ్యరాజ్ సంచలన కామెంట్స్ చేయడంతో పోటీ వేడెక్కింది. ఈ క్రమంలో ఎన్నికల ప్రక్రియను ఆపాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. చివరినిమిషంలో హైకోర్టు అనుమతి ఇవ్వడంతో పోలింగ్ జరిగింది. పోస్టల్ బ్యాలెట్ అందకపోవడంతో ముంబైలో దర్బార్ షూటింగ్లో ఉన్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఓటుహక్కు వినియోగించుకోలేకపోయారు. దీనిపై ట్విట్టర్ వేదికగా ఆయన తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తంచేశారు. అయితే పదిరోజుల ముందే పోస్టల్ బ్యాలెట్లు పంపామని, తపాలా శాఖ ఆలస్యం కారణంగా అవి అందలేదని నటి కుష్భూ తెలిపారు. -
కొనసాగుతున్న నడిగర్ సంఘం ఎన్నికల పోలింగ్
-
మందకొడిగా నడిగర్ సంఘం ఎన్నికలు
పెరంబూరు: ఎన్నో మలుపుల తరువాత నడిగర్ సంఘం ఎన్నికలు ఎట్టకేలకు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఉదయం ప్రారంభం అయిన ఈ ఎన్నికలు సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 3644 మంది సభ్యులుండగా.. ఓటు హక్కు అర్హత 3171 మంది సభ్యులు షూటింగ్‌ల కారణంగా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు పోస్టల్ ఓటు సమయానికి చేరలేనందున ఓటు వేయలేకపోతున్నానని తెలిపారు. నడిగర్‌సంఘం ఎన్నికల వివాదం, వివరాలు.. 2019–2022కు గానూ నడిగర్‌సంఘం ఎన్నికల తేదీని ప్రకటించక ముందు నుంచే వివాదాంశంగా మారింది. ప్రస్తుతం సంఘ నిర్వాహక వర్గం పదవీ కాలం ముగిసిన ఆరు నెలలకు ఎన్నికలను నిర్వహించ తలపెట్టడంతోనే విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు మొదలయ్యాయి. సభ్యుల సమీకరణాలు మారిపోయాయి. ప్రస్తుత జట్టుకు 2015లో విజయానికి తీవ్రంగా కృషి చేసిన వారు, గట్టి మద్దతునిచ్చినవారిలో కొందరు వ్యతిరేక జట్టులో చేరి ఆ జట్టును ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్నారు. నటుడు ఉదయ, ఆర్కే.సురేశ్ వంటి వారు విశాల్‌కు వ్యతిరేకంగా మారారు. ఇక విశాల్ జట్టుకు గతంతో పూర్తి అండదండలు అందించిన నిర్మాత ఐసరిగణేశ్, మద్దతుగా నిలిచిన దర్శక నటుడు కే.భాగ్యరాజ్ పోటీగా వచ్చారు. ప్రస్తుత పాండవర్ జట్టుకు వ్యతిరేకంగా కొత్త జట్టు స్వామి శంకర్‌దాస్ పేరుతో సిద్ధం అయ్యింది. ఈ దశలో సీనియర్ నటుడు రాధారవి అసలు సంఘం ఎన్నికలే జరగవంటూ పేర్కొన్నారు. అదే విధంగా విశ్రాంతి హైకోర్టు న్యాయమూర్తి పద్యనాభన్ నేతృత్వంలో ఎన్నికల తేదీని ప్రకటించడంతో పాటు, స్థానికి అడయారులోని ఎంజీఆర్ జానకీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆవరణను ఎన్నికలకు వేదికగా ప్రకటించారు. అక్కడే అసలు సమస్య మొదలైంది. ఒక రకంగా పోలీసులే సమస్యకు తెరలేపారని చెప్పవచ్చు. ఆ కళాశాలలో ఎన్నికలు నిర్వహించడానికి శాంతి భద్రతల దృష్ట్యా రక్షణ కల్పించలేమని పోలీసులు తెలిపారు. దీంతో విశాల్ ఎన్నికల రక్షణ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, ఆ సమయంలో కొందరు సంఘ సభ్యులు తమను సభ్యత్వం తొలగించారంటూ సంఘాల జిల్లా అధికారిని కలిపి ఫిర్యాదు చేయడంతో సమస్య జఠిలంగా మారింది. 61 మంది సభ్యుల ఫిర్యాదును ఎన్నికల సంఘం జిల్లా అధికారి విచారించి నిజ నిర్ధారణ జరిగే వరకూ నడిగర్ సంఘం ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు వెల్ల డించారు. దీంతో విశాల్ వర్గం మరోసారి ఆ 61 మంది సభ్యత్వం రద్దుకు కారణాలతో చెన్నై హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఎన్నికల అధికారి పిటిషన్‌పై విచారణ విశాల్ వర్గానికి అనుకూలంగా వచ్చింది. ఆ 61 మంది సభ్యతం రద్దు చేయడం సరైన చర్యే అంటూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఎన్నికల రద్దు పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం శుక్రవారం నడిగర్ సంఘం ఎన్నికలను నిర్వహించవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఈ లోపు విశాల్ వర్గం రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రాన్ని అందించింది. అదే విధంగా స్వామి శకరదాస్ జట్టు గవర్నర్‌ను కలిశారు. ఎన్నికలకు వేదిక లభించింది మొత్తం మీద న్యాయస్థానం తీర్పుతో కాస్త ఊపిరి పీల్చుకున్న పోటీ జట్ల వర్గాల ముందు మరో సమస్య నిలిచింది. అదే ఎన్నికల వేదిక. విశాల్ జట్టు ఎన్నికలకు వేదిక గురించి తీవ్రంగా చర్చలో మునిగిపోగా, స్వామి శంకర్‌దాస్ జట్టు వారు మాత్రం కోర్టు తీర్పును స్వాగతిస్తూనే ఇప్పటి వరకూఎన్నికలు ఎక్కడ నిర్వహించేదీ ఖరారు కాలేదు. ఇతర ప్రాంతాల్లోని సభ్యులకు బ్యాలెట్ పత్రాలు పూర్తిగా అందలేదు. నటుడు రజనీకాంత్‌కే బ్యాలెట్ పేపర్లు చేరలేదని, ఆయన తరుచూ ఫోన్ చేసి అడుగుతున్నారని, పోలీసుల భద్రత విసయం ఏమిటీ? లాంటి విమర్శలను, అయోమయాన్ని ప్రస్మీట్ పెట్టి మరీ వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎట్టకేలకు వేదిక శనివారం సెట్ అయ్యింది. విశాల్ జట్టు స్థానిక అల్వార్‌పేటలోని జెయింట్ ఎబ్బాస్ పాఠశాలలో ఎన్నికల వేదికను సిద్ధం చేశారు. అదే విధంగా శనివారం మధ్యాహ్నం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వంను సచివాలయంలో కలిసి ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా చర్చలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఆదివారం నడిగర్ సంఘ ఎన్నికలకు రంగం సిద్ధం అయ్యింది. కాగా ఆదివారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అయితే ఫలితాలను మాత్రం న్యాయస్థానం ఆదేశాల మేరకు నిలిపేయనున్నారు. న్యాయస్థానం ప్రటించిన తరువాత ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. బహుశ జూలై 5వ తేదీన సంఘం ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. -
అమ్మాయి స్వార్థం
ప్రముఖ దర్శకుడు భాగ్యరాజ్ తనయుడు శంతన్ భాగ్యరాజ్ హీరోగా రూపొందిన తమిళ చిత్రం ‘ముప్పరిమానమ్’. సృష్టి డాంగే కథానాయిక. ఆది రూపన్ దర్శకుడు. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని భువన్ కుమార్ అల్లం ‘లవ్ గేమ్’ పేరుతో తెలుగులోకి అనువదించారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఆడియో, ట్రైలర్‌ని విడుదల చేశారు. భువన్ కుమార్ మాట్లాడుతూ– ‘‘గతంలో ‘సారథి’ అనే స్ట్రయిట్ సినిమా నిర్మించాను. ప్రస్తుత ట్రెండ్‌కి కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ‘లవ్ గేమ్’. ఒక అమ్మాయి తన స్వార్థం కోసం ఇద్దరి అబ్బాయిలతో ఎలా గేమ్ ఆడిందనేది కథ. ‘వెన్నెలకంటి’ గారు మంచి సంభాషణలు అందించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం ప్రధాన ఆకర్షణ’’ అన్నారు. -
‘సర్కార్ కథ బయటకు చెప్పినందుకే’
విజయ్ హీరోగా సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కించిన సినిమా సర్కార్. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇటీవల పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. సర్కార్ కథ తనదే అంటూ వరుణ్ రాజేంద్రన్ అనే వ్యక్తి తమిళ రచయితల సంఘాన్ని ఆశ్రయించారు. అయితే విషయం అక్కడ పరిష్కారం కాకపోవటంతో కోర్డు వరకు వెళ్లాల్సి వచ్చింది. ఈ విషయంలో రచయితల సంఘం అధ్యక్షుడు భాగ్యరాజా కీలకంగా వ్యవహరించారు. రెండు కథల మధ్య పోలికలు ఉన్నట్టుగా నిరూపించేందుకు భాగ్యరాజా సర్కార్ సినిమా కథను కూడా బయట పెట్టాల్సి వచ్చింది. అందుకే నైతిక బాధ్యత వహిస్తూ భాగ్యరాజా రచయితల సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కారణమేదైన సినిమా కథను బయటపెట్టడం తప్పే అన్న భాగ్యరాజా ఇప్పటికే చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్‌ను క్షమాపణ కోరినట్టుగా తెలిపాడు. -
అందులో మార్పు లేదు
‘సర్కార్’ కథ కాపీ చేశారని దర్శకుడు మురుగదాస్ మీద పలు విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఆరోపించిన రచయిత వరుణ్‌కి, ‘సర్కార్’ టీమ్‌కు సంధి కుదిరిందట. ఈ విషయం గురించి మురుగదాస్ తన ట్వీటర్లో ఖాతాలో పేర్కొన్నారు. ‘‘ఎప్పటిలానే బోలెడన్ని వదంతులు ప్రచారం అవుతున్నాయి. ఒకతను వేయాల్సిన ఓటును, దొంగతనంగా వేరే వాళ్లు వేసేస్తారు అనే కాన్సెప్ట్‌తో కూడుకున్న కథను పదేళ్ల క్రితమే ఓ వ్యక్తి రాసుకున్నారు అని దర్శకుడు భాగ్యరాజాగారు నాతో అన్నారు. ఆ పాయింట్ తప్ప మా కథకు వాళ్ల కథకూ ఎటువంటి సంబంధమూ లేదు. కానీ, మనకన్నా ముందు ఒక సహాయ దర్శకుడు ఈ కథను రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి అతడిని ఉత్సాహపరచడం కోసం టైటిల్స్‌లో అతని పేరు వేస్తే బాగుంటుందని భాగ్యరాజాగారు అన్నారు. దానికి సరే అని ఒప్పుకున్నాను. అంతే.. ‘సర్కార్’ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఏ ఆర్ మురుగదాస్. ఇందులో ఎటువంటి మార్పు లేదు’’ అనే వీడియోను పోస్ట్ చేశారు. -
పార్తిబన్ కు సెన్సార్ షాక్!
నటుడు, దర్శకుడు పార్తిబన్ కు సెన్సార్‌బోర్డు షాక్ ఇచ్చింది. ఇప్పుడు సెన్సార్ అనేది చాలా మందికి తలనొప్పిగా మారింది. అందుకు కారణం వినోదపు పన్ను రాయితీలే. సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ అందించిన చిత్రాలకు వినోదపు పన్ను రాయితీలు వర్తించవు. యూ సర్టిఫికెట్లు కోసం చిత్ర దర్శక నిర్మాతలు ఆశించేది అందుకే. ఇటీవల సూర్య నటించిన ఎస్–3 చిత్రానికీ యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వడంతో ఆ చిత్ర నిర్మాత రివైజింగ్ కమిటీకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్తిబన్ తాజాగా స్వీయ దర్శకత్వంలో ముఖ్య పాత్ర పోషించిన చిత్రం కోడిట్ట ఇడంగళై నిరప్పుగా. నటుడు శాంతను భాగ్యరాజ్, నటి పార్వతినాయర్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 23నే విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. అయితే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో విడుదల తేదీని ఈ నెల 30కి వాయిదా వేసినట్లు సమాచారం. కోడిట్ట ఇడంగళై నిరప్పుగా చిత్రానికి సెన్సార్ యూ/ ఏ సర్టిఫికెట్ ఇవ్వడంతో పార్తిబన్ తో సహా చిత్ర యూనిట్ షాక్‌కు గురైంది. అయితే ఈ విషయంలో రివైజింగ్ కమిటీకి వెళ్లాలని భావించినా, అలాంటి నిర్ణయంతో చిత్ర విడుదల మరింత ఆలస్యం అవుతుందన్న భావనతో చిత్రానికి యూ/ ఏ సర్టిఫికెట్‌తోనే విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
కుటుంబకథా చిత్రంగా కాదల్ కాలమ్
కాదల్ కాలమ్ చిత్ర పాటలు బాగున్నాయని ప్రముఖ దర్శకుడు కే.భాగ్యరాజ్ అభినందించారు. తమిళకొడి ఫిలింస్ పతాకంపై వెప్పడై. జీ.సెల్వరాజ్ నిర్మిస్తున్న చిత్రం కాదల్ కాలమ్. కె.భాగ్యరాజ్ శిష్యుడు సోమసుందరం కథ,కథనం,దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఈ చిత్రంలో నూతన నటుడు చంద్రు కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయనకు జంటగా తెలుగు నటి శిల్పాశెట్టి నటిస్తుండగా మరో హీరోయిన్గా సార్వీ చేకూరి నటిస్తోంది. జయానందన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ను ఇంతకు ముందే ప్రఖ్యాత నటుడు కమలహాసన్ ఆవిష్కరించి ముగ్గురు స్నేహితులు కలిసి నిర్మిస్తున్నారని తెలిసి అభినందించారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఉదయం చెన్నై, వడపళనిలోని ఆర్కేవీ.స్టూడియోలో నిర్వహించారు. చిత్ర ఆడియోను భాగ్యరాజ్ ఆవిష్కరించగా తొలి ప్రతిని దర్శకుడు పాండ్యరాజన్ అందుకున్నారు. భాగ్యరాజ్ మాట్లాడుతూ సోమసుందరం కఠన శ్రమజీవి అని ప్రశంసించారు.రచయిత అయిన ఆయన పత్రికా విలేకరిగా మారి ఇప్పుడు దర్శకుడిగా అవతారమెత్తారని తెలిపారు. ఈ కాదల్ కాలమ్ చిత్రం చూసిన సెన్సార్ బృందం కే.భాగ్యరాజ్ చిత్రం చూసినట్లు ఉందని అభినందించారట. ఇది ఒక గురువుగా తాను గర్వపడే విషయం అన్నారు. చిత్ర పాటలు చూశానని చాలా బాగున్నాయని చిత్రం కూడా జనరంజకంగా ఉంటుందని ఆశిస్తున్నానని అన్నారు. చిత్ర నిర్మాత సెల్వరాజ్ మాట్లాడుతూ ఎంత సంపాదించినా అమ్మాయిని పెళ్లి చూపులకు వెళ్లినప్పుడు అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అడుగుతారన్నారు. అలాంటి ఇతి వృత్తంతో రూపొందుతున్న ప్రేమ సన్నివేశాలతో కూడిన కుటుంబకథాచిత్రం కాదల్ కాలమ్ అని చెప్పారు. -
ఘనంగా నటుడు శాంతను, కీర్తీల వివాహం
-
పునర్నిర్మాణానికి ఆ రెండు చిత్రాలు
గతంలో విజయం సాధించిన చిత్రాలు పునర్ నిర్మాణం ఆ మధ్య జోరుగా సాగి ఆగిపోయింది. తిల్లుముల్లు చిత్రంతో ఆగిన ఆ ట్రెండ్ త్వరలో మళ్లీ మొదలు కానుంది. ఇంతకుముందు కె.భాగ్యరాజా హీరోగా స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం డార్లింగ్ డార్లింగ్. పూర్ణిమ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సుమన్ ముఖ్యపాత్ర పోషించారు. 1982లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. చిత్రంలోని పాటలన్నీ విశేష ప్రజాదరణ పొందాయి. ఆ చిత్రం రీమేక్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. భాగ్యరాజ పాత్రలో ఆయన తనయుడు శాంతను నటించనున్నారు. నిర్మాత షణ్ముగరాజన్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఆయనే రీమేక్ చేయనున్నారు. హీరోయిన్ ఎవరన్నది నిర్ణయం కాని ఈ చిత్రానికి అదియమాన్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. కాగా 1994లో తెరపైకొచ్చి మంచి విజయాన్ని సాధించిన చిత్రం ఇందు. నటుడు ప్రభుదేవా, అప్పటి క్రేజీ హీరోయిన్ రోజా జంటగా నటించిన ఈ చిత్రానికి పవిత్రన్ దర్శకుడు. అలాంటి చిత్రం తాజాగా మరోసారి తెరకెక్కడానికి రెడీ అవుతోంది. ఈ చిత్ర తారాగణం ఎంపిక జరుగుతోంది. ఈ రెండు చిత్రాలు ప్రజాదరణ పొందితే మరిన్ని తెరకెక్కే అవకాశం ఉంటుంది.