‘సర్కార్’ కథ కాపీ చేశారని దర్శకుడు మురుగదాస్ మీద పలు విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఆరోపించిన రచయిత వరుణ్‌కి, ‘సర్కార్’ టీమ్‌కు సంధి కుదిరిందట. ఈ విషయం గురించి మురుగదాస్ తన ట్వీటర్‌లో ఖాతాలో పేర్కొన్నారు. ‘‘ఎప్పటిలానే బోలెడన్ని వదంతులు ప్రచారం అవుతున్నాయి. ఒకతను వేయాల్సిన ఓటును, దొంగతనంగా వేరే వాళ్లు వేసేస్తారు అనే కాన్సెప్ట్‌తో కూడుకున్న కథను పదేళ్ల క్రితమే ఓ వ్యక్తి రాసుకున్నారు అని దర్శకుడు భాగ్యరాజాగారు నాతో అన్నారు.
ఆ పాయింట్ తప్ప మా కథకు వాళ్ల కథకూ ఎటువంటి సంబంధమూ లేదు. కానీ, మనకన్నా ముందు ఒక సహాయ దర్శకుడు ఈ కథను రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి అతడిని ఉత్సాహపరచడం కోసం టైటిల్స్‌లో అతని పేరు వేస్తే బాగుంటుందని భాగ్యరాజాగారు అన్నారు. దానికి సరే అని ఒప్పుకున్నాను. అంతే.. ‘సర్కార్’ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఏ ఆర్ మురుగదాస్. ఇందులో ఎటువంటి మార్పు లేదు’’ అనే వీడియోను పోస్ట్ చేశారు.
అందులో మార్పు లేదు
Published Wed, Oct 31 2018 1:14 AM | Last Updated on Wed, Oct 31 2018 1:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment