మనకు ఏ విషయం గురించి తెలియకపోయినా.. వెంటనే చేసే పని గూగుల్‌లో వెతకడం. గూగుల్‌లో ఎప్పుడు ఏదీ ఎలా ట్రెండ్ అవుతుందో చెప్పడం కష్టమే. రోజుకు కొన్ని కోట్ల మంది గూగుల్‌లో ఏదో ఒక విషయం గురించి సర్చ్ చేస్తుంటారు. ప్రస్తుతం ఇలా ఎక్కువమంది టాపిక్ ఏంటో తెలుసా?. విజయ్ నటించిన సర్కార్ మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. రాజకీయ నేపథ్యంలో దొంగ ఓట్ల నేపథ్యంలో తెరకెక్కించగా.. సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.
అయితే ఈ సినిమాలో సెక్షన్ 49పి అనే టాపిక్ హైలెట్‌గా మారింది. కథ అంతా ఈ సెక్షన్ చుట్టూనే తిరుగుతుంది. ఈ సెక్షన్ ప్రకారం పోలింగ్ సమయంలో తన ఓటును ఎవరైనా వేసినట్టు ఓటరు గుర్తిస్తే వెంటనే ఆ పోలింగ్ బూత్‌కు వెళ్లి ఆ ఓటును వెనక్కి తీసేయమనీ, మళ్లీ తన ఓటు తాను వేసుకునే వీలు కల్పించమని అడిగే హక్కు ఓటరుకు ఉంటుంది. ఇప్పటివరకు ఇలాంటి సెక్షన్ ఒకటి ఉందని తెలియని నెటిజన్లు దీని గురించి గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారట.
Comments
Please login to add a commentAdd a comment