
విజయ్ హీరోగా సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కించిన సినిమా సర్కార్. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇటీవల పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. సర్కార్ కథ తనదే అంటూ వరుణ్ రాజేంద్రన్ అనే వ్యక్తి తమిళ రచయితల సంఘాన్ని ఆశ్రయించారు. అయితే విషయం అక్కడ పరిష్కారం కాకపోవటంతో కోర్డు వరకు వెళ్లాల్సి వచ్చింది.
ఈ విషయంలో రచయితల సంఘం అధ్యక్షుడు భాగ్యరాజా కీలకంగా వ్యవహరించారు. రెండు కథల మధ్య పోలికలు ఉన్నట్టుగా నిరూపించేందుకు భాగ్యరాజా సర్కార్ సినిమా కథను కూడా బయట పెట్టాల్సి వచ్చింది. అందుకే నైతిక బాధ్యత వహిస్తూ భాగ్యరాజా రచయితల సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కారణమేదైన సినిమా కథను బయటపెట్టడం తప్పే అన్న భాగ్యరాజా ఇప్పటికే చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్‌ను క్షమాపణ కోరినట్టుగా తెలిపాడు.