
కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సర్కార్. నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తొలి షో నుంచే డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం సత్తా చాటుతూ వస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్‌ను సాధించి రికార్డ్ సృష్టించిన సర్కార్ ప్రస్తుతం ఈ ఏడాది సౌత్‌లోనే హైయ్యస్ట్ గ్రాసర్‌గా రికార్డ్‌ను సొంతం చేసుకుంది.
రెండు వారాల్లో సర్కార్ 225 కోట్లకు పైగా గ్రాస్ సాధించి 2018లో సౌత్‌లో అత్యధిక గ్రాస్ సాధించిన సినిమాగా టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇన్నాళ్లు ఈ రికార్డ్ టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ రంగస్థలం పేరిట ఉంది. రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం 218 కోట్లతో సర్కార్ రిలీజ్ కు ముందు వరకు టాప్ ప్లేస్‌లో ఉంది. విజయ్ సర్కార్ ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తుండటంతో ఫుల్ రన్ మరిన్ని రికార్డ్‌లు సాధించటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.
Comments
Please login to add a commentAdd a comment