
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, కమర్షియల్ చిత్రాల దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ సర్కార్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. వివాదాల కారణంగా సినిమా రిలీజ్‌పై అనుమానాలు ఏర్పడ్డా అన్ని క్లియర్ చేసుకొని అన్నుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు సర్కార్ టీం.
ఈ సినిమాను విజయ్ కెరీర్‌లోనే గతంలో ఎన్నడూ లేనంత భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 80 దేశాల్లో 3000లకు పైగా స్క్రీన్స్‌లో సర్కార్ సినిమా విడుదల కానుందని తమిళ సినిమా ఎనలిస్ట్ రమేష్ బాల వెల్లడించారు. తెలుగు నాట కూడా సర్కార్ 600 స్క్రీన్స్‌పై సినిమా రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమా.. విజయ్ కెరీర్ లోనే కాదు, తమిళ సినిమా చరిత్రలోనే బిగెస్ట్‌రిలీజ్ గా రికార్డ్ సృష్టించనుందన్న టాక్ వినిపిస్తోంది.
#Sarkar will release in 3,000 screens world-wide.. 80 countries..
— Ramesh Bala (@rameshlaus) October 31, 2018
Widest release for a Tamil movie.. pic.twitter.com/G1SkFidXfk