
ప్రపంచ రికార్డే లక్ష్యంగా రూపొందించిన చిత్రం 3.6.9. శివమాధవ్ దర్శకత్వంలో పీజీఎస్.శరవణకుమార్ నిర్మించిన ఈ చిత్రంలో దర్శక నిర్మాత కె.భాగ్యరాజ్ కథానాయకుడిగా నటించారు. నిర్మాత శరవణకుమార్ మరో హీరోగా నటించారు. ఈ చిత్రానికి మారీశ్వరన్ ఛాయాగ్రహణం, కార్తీక్ హర్ష సంగీతాన్ని అందించారు. చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం చెన్నైలో సాయంత్రం నిర్వహించారు.
ఇది ప్రపంచ రికార్డు కోసం కట్స్ లేకుండా 81 నిమిషాల్లో 24 కెమెరాలతో 450 మంది సాంకేతికవర్గంతో 750 మందికి పైగా నటీనటులతో చిత్రీకరించిన చిత్రం ఇదని తెలిపారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు చిత్రాన్ని సరికొత్త ప్రయోగం చేశారన్నారు. 81 నిమిషాల్లో చిత్రాన్ని పూర్తి చేయడం సాధారణ విషయం కాదని అందుకు దర్శకుడు చాలా హోమ్‌వర్క్ చేశారని అన్నారు. ఇందులో తాను చర్చి ఫాదర్‌గా నటించానని తెలిపారు. అందరూ తాను 21 ఏళ్ల తరువాత హీరోగా నటించిన చిత్రం ఇదని అంటున్నారని, నిజానికి తాను ఎవర్‌గ్రీన్ హీరో అని భాగ్యరాజ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment