Ganesh K. Babu Director: K Bhagyaraj, Aishwarya In Film Together After 30 Years - Sakshi
Sakshi News home page

K Bhagyaraj-Aishwarya: 30 ఏళ్ల తరువాత మళ్లీ జంటగా ఎవర్‌గ్రీన్‌ జోడి

Published Sun, Mar 27 2022 7:27 AM | Last Updated on Sun, Mar 27 2022 10:32 AM

K Bhagyaraj, Aishwarya in a film Together After 30 Years - Sakshi

భాగ్యరాజ్‌తో నటి ఐశ్వర్య

తమిళసినిమా : ముప్ఫై ఏళ్ల తరువాత నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ, నటి ఐశ్వర్య మళ్లీ జంటగా కలిసి నటిస్తున్నారు. నటుడు కెవిన్, అపర్ణదాస్‌ హీరో హీరోయిన్లుగా ఒలింపియా మూవీస్‌ పతాకంపై ఎస్‌.అంబేద్‌ కుమార్‌ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీనికి గణేష్‌ కె.బాబు దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది.

కాగా ఇందులో సీనియర్‌ దర్శకుడు, నటుడు కె.భాగ్యరాజ్, నటి ఐశ్వర్య, కథానాయకుడు కెవిన్‌కు తల్లిదండ్రులుగా నటిస్తున్నారు. వీరిద్దరూ 1992లో విడుదలైన రాసకుట్టి అనే చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించడం గమనార్హం. 30 ఏళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు ఈ చిత్రంలో కలిసి నటించడం విశేషం. ఈ చిత్రానికి ఎళిల్‌ అరసు చాయాగ్రహణంను, జెన్‌మార్టిన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతోందని యూనిట్‌ వర్గాలు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement