
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పెద్ద కూతురు, హీరోయిన్ ఐశ్వర్య పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. కోలీవుడ్ లెజెండరీ నటుడు, దర్శకుడు తంబి రామయ్య కుమారుడు, యంగ్ హీరో ఉమాపతిని ఆమె పెళ్లి చేసుకుంది. చెన్నైలో హనుమాన్ ఆలయంలో జరిగిన ఈ వివాహా వేడుకలో బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. తాజాగా వీరి పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి.
కాగా.. ఐశ్వర్య- ఉమాపతిల ఎంగేజ్‌మెంట్ వేడుక గతేడాది అక్టోబర్‌లో జరిగింది. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు పెద్దల అనుమతితోనే నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఐశ్వర్య కెరీర్ అనుకుంత సక్సెస్‌ఫుల్‌గా సాగడం లేదు. కూతురి కోసం అర్జున్ డైరెక్టర్‌గా మారి సినిమా తీయగా అది కూడా ఆశించినంత ఫలితం అందుకోలేకపోయింది. మరోవైపు ఉమాపతి తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. కోలీవుడ్‌లో అడగప్పట్టత్తు మగజనంగళే, మనియార్ కుటుంబం, తిరుమనం, థానే వాడి సినిమాల్లో హీరోగా నటించాడు.
Comments
Please login to add a commentAdd a comment